ఓగోకు అల్టేరియా బిగ్ ఆఫ‌ర్

భార‌త‌దేశంలోని అంకురాల‌కు ఊహించ‌ని ఆఫ‌ర్లు వెల్లువ‌లా వ‌చ్చి ప‌డుతున్నాయి. బెంగ‌ళూరు స్టార్ట‌ప్ గా ప్రారంభ‌మైన ఓగోకు అల్టేరియా కేపిట‌ల్ బిగ్ ఆఫ‌ర్ ల‌భించింది. ఈ స్టార్ట‌ప్ విశేషం ఏమిటంటే ..టూ వీల‌ర్స్ ను రెంట్‌కు ఇస్తుంది. దాని ద్వారా వ‌చ్చే ఆదాయంతో వంద‌లాది మందికి ఉపాధి క‌ల్పిస్తోంది. ఊహించ‌ని రీతిలో ఈ ఐడియాకు స్పంద‌న రావ‌డంతో దేశ వ్యాప్తంగా విస్త‌రించే ఆలోచ‌న‌లో ఉన్నారు ఓగో నిర్వాహ‌కులు. అల్టేరియా కేపిట‌ల్ కంపెనీ 800 కోట్లు పెట్టుబ‌డి పెట్టాల‌ని ఒప్పందం చేసుకుంది. ఇది ఒక‌ర‌కంగా బంప‌ర్ ఆఫ‌ర్‌. ఒప్పందంలో భాగంగా మొద‌టి విడ‌త‌గా 25 కోట్లు రిలీజ్ చేసింది ఆల్టేరియా.

ఓగో మొద‌టిగా బెంగ‌ళూరులో బైక్‌ల‌ను అద్దెకు ఇవ్వ‌డం ప్రారంభించింది. ఓలా, ఊబెర్ కంపెనీలు రెంట్‌కు కార్లు ఇచ్చే ఐడియాకు భారీ స్పంద‌నతో పాటు లెక్క‌లేనంత ఆదాయం ల‌భిస్తోంది. ఇందులో భాగంగా వ‌చ్చిన ఐడియాతో బైక్‌ల‌ను రెంట్‌కు ఇచ్చేలా ప్లాన్ చేసింది. ఇది బాగా వ‌ర్క‌వుట్ అయింది. అంచ‌నాకు మించి ఆదాయం స‌మ‌కూర‌డంతో ..ఓగో ఇండియాలో పాపుల‌ర్ స్టార్ట‌ప్‌గా నిలిచింది. 12,000 వేల వెహికిల్స్‌తో దేశంలోని 5 న‌గ‌రాల‌లో ఓగో  కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తోంది. బెంగ‌ళూరుతో పాటు హైద‌రాబాద్, చెన్నై, త‌దిత‌ర సిటీల‌లో స్టార్ట్ చేసింది. ఏప్రిల్ నెలాఖ‌రు వ‌ర‌కు 5 వేల బైకులు ఏర్పాటు చేసింది ఓగో.

ఇక ఓగోతో చేసుకున్న ఎంఇఓ ప్ర‌కారం అల్టేరియా ..గ‌త ఏడాది అక్టోబ‌ర్ నెల‌లో 8 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. అంతేకాకుండా ఓలా, మ్యాట్రిక్స్ పార్ట్ న‌ర్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసింది. కార్ప‌స్ కింద 800 కోట్లు స‌మీక‌రించింది. ఇండ‌స్లాండ్ బ్యాంక్, స్మాల్ ఇండ‌స్ట్రీస్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలు ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. స్కూట‌ర్ల‌ను రెంట్‌కు ఇస్తున్న‌రు ఓగో నిర్వాహ‌కులు. 3 మిలియ‌న్ల ట్రిప్స్ తిరిగిన‌ట్లు వెల్ల‌డించింది ఓగో కంపెనీ. క‌లారి కేపిట‌ల్, ప‌వ‌న్ ముంజ‌ల్, హీరో మోటో ఇందులో ఇన్వెస్ట్ చేసింది. ఓగో ప్ర‌త్యేకంగా యాప్ రూపొందించింది. దీని ద్వారా రెంట్ కు స్కూట‌ర్ల‌ను తీసుకోవ‌డం ఈజీగా మారింది.

రెంట‌ల్స్ తీసుకునేందుకు 500 స్కూట‌ర్ స్టేష‌న్స్ ఐదు న‌గ‌రాల్లో ఏర్పాటు చేశారు. 3 మిలియ‌న్ల‌కు పైగా ట్రిప్పులు జ‌రిగిన‌యి. రోజు రోజుకు ఓగో స్కూట‌ర్స్ కు డిమాండ్ పెరుగుతోంది. త‌క్కువ స‌మ‌యం, ఎక్కువ ఆదాయం రావడం ఆనందంగా ఉందంటున్నారు ఓగో ఫౌండ‌ర్, సిఇఓ ఆనంద్ అయ్యాదురై వెల్ల‌డించారు. ఆనంద్ తో పాటు ప‌ద్మ‌నాభ‌న్ బాల‌కృష్ణ‌న్, సంచిత్ మిట్ట‌ల్ కో ఫౌండ‌ర్స్ ఉన్నారు. ఓగోకు స‌పోర్ట్ చేయ‌డం వ‌ల్ల మ‌రిన్ని అవ‌కాశాలు పెరుగుతాయంటున్నారు అల్టేరియా కేపిట‌ల్ మేనేజింగ్ పార్ట్‌న‌ర్ వినోద్ మ‌రుళి అంటున్నారు. ఏది ఏమైనా ఓగో ..చేసిన ప్ర‌య‌త్నం కోట్లు కుమ్మ‌రిస్తోంది. 

కామెంట్‌లు