ఆథెర్ ఎన‌ర్జీకి బొంప‌ర్ బొనాంజా - స‌చిన్ బ‌న్సాల్ బిగ్ ఇన్వెస్ట్‌మెంట్

పేష‌న్, ప‌ర్ప‌స్ ట్యాగ్ లైన్‌తో చిన్న పెట్టుబ‌డితో  ప్రారంభ‌మైన ఆథెర్ ఎన‌ర్జీ అంకుర సంస్థ జాక్ పాట్ కొట్టేసింది. రాను రాను ఆయిల్‌కు విప‌రీత‌మైన డిమాండ్ పెర‌గ‌డం, వాహ‌నాల‌కు స‌రి పోక పోవ‌డం, ధ‌రాభారం మోయ‌లేక పోవ‌డంతో ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషించారు ఔత్సాహికులు. దీంతో గ‌త ప‌దేళ్లుగా సోలార్ ప‌వ‌ర్‌తో పాటు విద్యుత్ ఛార్జింగ్‌తో న‌డిచేలా బైక్‌లు, స్కూట‌ర్లు, కార్లతో పాటు ఇత‌ర వాహ‌నాలు విద్యుత్‌తో న‌డిచేలా త‌యారు చేస్తున్నారు. ఆటోమొబైల్ ఇండ‌స్ట్రీ లో ఎక్కువ‌గా కార్లకు అధిక డిమాండ్ ఉంటోంది. ఇండియా ప‌రంగా చూస్తే ప్ర‌తి మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన వారు స్టేట‌స్ సింబ‌ల్‌గా భావిస్తున్నారు. దీంతో ప్రతి ఒక్క‌రు కార్ల‌ను కొనుగోలు చేసేందుకు ఉత్సుక‌త ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

దీనిని ముందుగానే గుర్తించిన నిర్వాహ‌కులు ఆథెర్ ఎనర్జీ పేరుతో స్టార్ట‌ప్‌ను ప్రారంభించారు. ఒక్క‌సారి విద్యుత్ ఛార్జింగ్ చేస్తే 80 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణం చేసేందుకు వీల‌వుతుంది. స్టాప్, స్టార్ట్..వీ..అనే పేరుతో దీనిని రూపొందించారు. హై కెపాసిటీ లైన్ బ్యాట‌రీని ఇందులో రూపొందించారు. ఈ వెహికిల్ 50 వేల కిలోమీట‌ర్లు ప్ర‌యాణించేందుకు వీలుంటుంది. త్వ‌ర‌గా ఛార్జ్ అవ‌డం ఈ కంపెనీ ప్ర‌త్యేక‌త‌. ప‌ర్యావ‌ర‌ణానికి ముప్పు అంటూ వుండ‌దు. స్పోర్ట్ మోడ్‌లో 50 కిలోమీట‌ర్ల స్పీడ్ వుంటే, రైడ్ మోడ్‌లో అయితే 65 కిలోమీట‌ర్లు, ఎకో మోడ్‌లో అయితే 75 కిలోమీట‌ర్లు ఉండేలా డిజైన్ చేశారు. గుడ్ ద బ్యాడ్ రోడ్స్ అనేది ఆథెర్ ఎనర్జీ ల‌క్ష్యం.

ముంబై ఐఐటీకి చెందిన 16 మంది కలిసి ఆథెర్ ఎనర్జీ స్టార్ట‌ప్‌కు ప్రాణం పోశారు. వీరి ఆలోచ‌న‌కు భారీ స్పంద‌న రావ‌డంతో..దేశంలోని 30 సిటీస్‌ల‌లో ఎల‌క్ట్రిక్ వెహికిల్స్ ఆఫీసుల‌తో పాటు 55 ఛార్జింగ్ స్టేష‌న్స్ ఏర్పాటు చేయాల‌న్న‌ది వీరి టార్గెట్. ఆథెర్ ఎన‌ర్జీ  ప్రైవేట్ లిమిటెడ్ చేసిన ఈ ప్ర‌య‌త్నం భారీ కంపెనీల‌ను ఆక‌ర్షించింది. ఫ్లిప్ కార్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు స‌చిన్ బ‌న్సాల్ ..ఏకంగా 32 మిలియ‌న్ల‌ను పెట్టుబ‌డిగా పెట్టారు. అంటే ఇండియ‌న్ రూపీస్ ప‌రంగా చూస్తే 220 కోట్లు అన్న‌మాట‌. బ‌న్సాల్‌తో పాటు హీరో మోటో కార్పొరేష‌న్ కంపెనీ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వ‌చ్చిందని వెల్ల‌డించారు ఆథెర్ ఎన‌ర్జీ సిఇఓ త‌రుణ్ మెహ్‌తా. రాబోయే కాల‌మంతా ఎల‌క్ట్రిసిటీ వెహికిల్స్‌దే రాజ్య‌మంటున్నారు ఈ సిఇఓ. ఆయ‌న మాట‌ల్లో వాస్త‌వం వుంది క‌దూ..

కామెంట్‌లు