బెంగాల్‌కు కాయకల్ప చికిత్స - ప్రశాంత్ కిషోర్‌తో దీదీ దోస్తీ
సుదీర్ఘ రాజకీయ అనుభవానికి చెక్ పెట్టి..వ్యక్తిగా ప్రవేశించి..బెబ్బులిలా గాండ్రించి..తనకంటూ ఓ స్టైల్‌ను ..ఇమేజ్ ను..బ్రాండ్‌ను ఏర్పాటు చేసుకుని..రాజకీయ రణరంగంలో కాకలు తీరిన యోధులను మట్టికరిపించి ..వామపక్షపు సామ్రాజ్యపు గోడలను కూల్చి వేసిన ఘనత మమతా బెనర్జీది. చరిత్రను తిరగరాయడమే కాకుండా తానే ఓ రికార్డు నమోదు చేసింది. ఆమె ఎవ్వరికీ లొంగదు..ఇంకెవ్వరినీ తన దరిదాపుల్లోకి రానివ్వదు. ఏ ఒక్కరితో పూర్తి చెలిమి అంటూ చేయదు. ఆమె నైజమే అంత. దీనిపై ప్రశ్నిస్తే..ఆమె నవ్వేస్తారు. మౌనంగా వుండి పోతారు.
నన్ను ఓ కోల్‌కతా అపరకాళినంటూ అంటూ వుంటారు. నేను మనిషిని. కాకపోతే మిగతా వారికంటే పట్టుదల ఎక్కువ. అంతే ..అంతకు తప్పించి నా వద్ద ఏ ఆయుధమూ లేదు..మరే శక్తి లేదంటారు ఆమె. మొదటి నుంచి ప్రజల మధ్యనే ఉన్నా. వారి కోసమే పని చేస్తున్నా. పారదర్శకత పాలన అందించేందుకు చర్యలు చేపట్టా. కొందరికి రుచించక పోవచ్చు. కేంద్రం రాష్ట్రాల మీద ఆధారపడి ఉంది. కానీ రాష్ట్రాలు కేంద్రం మీద ఆధారపడడం లేదన్న విషయం తెలుసు కోవాలి. అందుకే నేను మోదీ రాజరిక వ్యవస్థను నిలదీశా. గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తా. తాజాగా జరిగిన సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది.
దీంతో దీదీ పునరాలోచనలో పడ్డారు. ఎక్కడ పొరపాట్లు జరిగాయో..ఏమేం చేస్తే రాబోయే ఎన్నికల్లో తిరిగి పవర్ లోకి రావచ్చో ఇప్పటి నుంచే ఆపరేషన్ మొదలు పెట్టారు. ఇంకేం హుటా హుటిన ..పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా..పక్కా ప్లానర్‌గా..విజయ తీరాలకు చేర్చే ..పవర్ ఫుల్ వెపన్ రూపంలో ఉన్న , ఒడిస్సాకు చెందిన ప్రశాంత్ కిషోర్ కు కబురు పెట్టింది. ఇద్దరూ కొన్ని గంటల పాటు చర్చించారు. ఈ మేరకు ఒప్పందం కూడా చేసుకున్నారు. ఎన్ని కోట్లకు అగ్రిమెంట్ కుదిరందన్నది ఇంకా తేలలేదు. రాబోయే ఎన్నికల వరకు ప్రశాంత్ కిషోర్ ఉరఫ్ పీకే దీదీకి అండగా వుంటారు. తన టీంను బెంగాల్‌లో మోహరిస్తాడు. తన ఆయుధాలను ప్రతిపక్షాలపై ఎక్కు పెడతాడు.
ఏదో రకంగా మమత మళ్లీ పీఠం ఎక్కేలా చేసేందుకు ఇప్పటి నుంచే రంగంలోకి ఎంటరై పోయాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ చాప కింద నీరులా టీడీపికి నిద్ర పోకుండా చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో ఒప్పందం చేసుకున్నాడు. తన టీంను దించాడు. ఇంకేం 151 సీట్లను అందించేలా చేశాడు. ఈ విజయంలో ప్రజల పాత్ర ఎక్కువగా వుంటే..గెలుపు రుచిని చూపించింది..దానికి వర్కవుట్ చేసింది మాత్రం పీకే అండ్ టీం మాత్రమే. సో ..జగన్ పవర్ లోకి రావడం, సీఎం కావడంతో పీకే రేంజ్ దేశంలో మరింత పెరిగింది. ఆయన ఎక్కడికి వెళ్లినా సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా మారారు. సో దీదీ, పీకేల మధ్య ఒప్పందం ..రాబోయే ఎన్నికల్లో తాము పవర్ లోకి రావడం ఖాయమంటూ ..తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి