పోస్ట్‌లు

జూన్ 30, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

క‌త్తుల క‌ర‌చాల‌నం - ప్ర‌పంచం విస్మ‌యం..చిన్న‌న్న‌తో పెద్ద‌న్న‌..!

చిత్రం
ప్ర‌పంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మొద‌టిసారిగా ఉత్త‌ర కొరియా మైదానంలోకి అడుగు పెట్టారు. అత్యంత భారీ క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త న‌డుమ ఆయ‌న కాలు మోపారు. ఇప్ప‌టికే యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన్న ప్ర‌స్తుత త‌రుణంలో ట్రంప్ ప‌ర్య‌ట‌న ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌న టూర్ ..వైర‌ల్‌గా మారింది. తొలి అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌గా ఓ రికార్డు కూడా సృష్టించారు. ఒక‌రిపై మ‌రొక‌రు కారాలు మిరియాలు నూరుతున్నారు. నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్‌తో క‌ర‌చాల‌నం చేశారు. వాషింగ్ట‌న్ కు రావాల‌ని ట్రంప్ కోరారు. ఇద్ద‌రు చిరున‌వ్వులు చిందించారు. చిలుక ప‌లుకులు ప‌లికారు. నిన్న‌టి దాకా వీరిద్ద‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. ఒకానొక ద‌శ‌లో ట్రంప్ దాడులు చేస్తాన‌ని, దేశాన్ని తుద ముట్టిస్తాన‌ని బీరాలు ప‌లికాడు. ఒకే ఒక్క హెచ్చ‌రిక‌తో మిన్న‌కుండి పోయారు. నీవు దాడి చేసిన క్ష‌ణ‌మే నీ అమెరికా ప్ర‌పంచ ప‌టంలో ఉండ‌ద‌ని కిమ్ చెప్పేశాడు. నీదగ్గ‌ర ఉన్న ఆయుధాల కంటే రెట్టింపు అణ్వాయుధాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయంటూ కిమ్ చెప్పేస‌రిక‌ల్లా ..యుఎస్ ప్రెసిడెంట్ మౌనం దాల్చారు. ఈ స‌మ‌యంలో ట్రంప్...

`చేతులెత్తేశారు..చ‌తికిల ప‌డ్డారు..అబ్బా తొలి దెబ్బ..!

చిత్రం
నిన్న‌టి దాకా ఓట‌మి ఎరుగ‌కుండా గెలుపొందుతూ వ‌స్తున్న విరాట్ కోహ్లి సేనకు కోలుకోలేని షాక్ ఇచ్చింది ప్ర‌పంచ్ క‌ప్ టోర్నీ ఆతిథ్య జ‌ట్టు ఇంగ్లండ్. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ తో ఉన్న భార‌త ఆట‌గాళ్లు అటు బౌలింగ్‌లోను..ఇటు బ్యాటింగ్‌లోను ఫెయిల‌య్యారు. ఇప్ప‌టి దాకా టోర్నీ ఫెవ‌రేట్‌గా ఉన్న ఇరు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంగ్లండ్ బౌల‌ర్ల ధాటికి బ్యాట్స్‌మెన్స్ ప‌రుగులు తీసేందుకు నానా తంటాలు ప‌డ్డారు. రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ చేయ‌డం మీద దృష్టి పెట్టాడే కానీ జ‌ట్టు విజ‌యం కోసం దృష్టి పెట్ట‌లేక పోయాడు. ఈ అప‌జ‌యంతో నైనా ఇండియా జ‌ట్టు కోలుకుంటే మంచిది లేక‌పోతే క‌ప్ మాటేమిటో కానీ ఉన్న ప‌రువు పోయే ప్ర‌మాదం పొంచి ఉంది. ఇక ఆట విష‌యానికొస్తే, ఇంగ్లండ్ జ‌ట్టు ఘ‌న విజయాన్ని న‌మోదు చేసుకుని సెమీ ఫైన‌ల్ ఆశ‌లు స‌జీవంగా వుంచుకుంది. ద‌క్షిణాఫ్రికాకు చుక్క‌లు చూపించి, ఆస్ట్రేలియా దిగ్గ‌జ జ‌ట్టును ఓడించి..పాకిస్తాన్‌ను మ‌ట్టి క‌రిపించి..విండీస్‌ను ఇంటికి పంపించేలా చేసిన భార‌త జ‌ట్టు చివ‌ర‌కు ఇంగ్లండ్ ముందు చేతులెత్తేసింది. ఆ జ‌ట్టు బౌల‌ర్ల ధాటికి మ‌న ఆట‌గాళ్లు విల‌విల‌లాడి పోయారు. సెమీస్‌కు క‌చ్చితంగా చేరా...

ఓపెన్ స్టార్ట‌ప్‌కు బంప‌ర్ ఛాన్స్ ..భారీ ఇన్వెస్ట్

చిత్రం
ఫైనాన్షియ‌ల్ రంగంలో స‌క్సెస్ ఫుల్‌గా ఆదాయాన్ని గ‌డిస్తున్న స్టార్ట‌ప్ కంపెనీ ఓపెన్ అంకుర సంస్థ జాక్ పాట్ కొట్టేసింది. టైగ‌ర్ గ్లోబ‌ల్ సంస్థ ఏకంగా 210 కోట్లు పెట్టుబ‌డిగా పెట్ట‌నుంది. ఇది ఇండియ‌న్ స్టార్ట‌ప్‌ల‌లో ఓ రికార్డు. బ్యాంకింగ్ స‌ర్వీసెస్ , ఎస్ఎంఇ, స్టార్ట‌ప్స్‌, లోన్స్, త‌దిత‌ర వాటికి ఈ సంస్థ ఆర్థిక స‌హ‌కారం అంద‌జేస్తుంది. టాంగ్లిన్ వెంఛ‌ర్ పార్ట్‌న‌ర్స్ అడ్వ‌యిజ‌ర్స్, 3 ఒన్ 4 కేపిట‌ల్, స్పీడ్ ఇన్వెస్ట్ అండ్ బెట‌ర్ కేపిట‌ల్ , సిండికేట్ కంపెనీలు కూడా ఇందులో పెట్టుబ‌డులు పెట్టాయి. మోర్ ప్రాడ‌క్ట్స్‌, వాల్యూ యాడెడె స‌ర్వీసెస్ రంగాల‌లో సేవ‌లందిస్తుంది. ఒకే ఒక్క ఏడాదిలో ఒన్ మిలియ‌న్ ఎస్ఎంఇల‌కు ఫండింగ్ స‌మ‌కూర్చి పెట్టింది ఓపెన్. బిజినెస్ బ్యాంకింగ్ రంగాన్ని మ‌రింత విస్త‌రించేందుకు కొత్త ప్రొడక్ట్స్ ను రూపొందించే ప‌నిలో ప‌డింది. యుద్ధ ప్రాతిప‌దిక‌న రెండు కొత్త ప్రొడ‌క్ట్స్‌ను లాంఛింగ్ చేసే ప‌నిలో ప‌డింది. ఓపెన్ ప్ల‌స్ కార్డు, బిజినెస్ క్రెడిట్ కార్డు ల‌ను అందుబాటులోకి తీసుకు రానుంది. 30 రోజుల పాటు ఎంత డ‌బ్బు తీసుకున్నా ఎలాంటి వ‌డ్డీ క‌ట్టాల్సిన ప‌నిలేదు. ఈ వెసులుబాటు ఓపెన్‌లో మా...

స్విస్ బ్యాంకులో ఇంగ్లండ్ నెంబ‌ర్ వ‌న్

చిత్రం
ప్రపంచంలో ఎక్క‌డ వున్నా స‌రే తాము అక్ర‌మంగా సంపాదించిన సొమ్మును దాచుకునే ఏకైక మార్గం ఏదైనా వుందంటే అది స్విస్ బ్యాంక్ ఒక్క‌టే. అక్క‌డ ఇన్వెస్ట్ చేసిన వారికి ఎలాంటి ఇబ్బందులంటూ వుండ‌వు. దాచుకున్న వారికి పూర్తి సెక్యూరిటీ ఇస్తుంది. అందుకే బ‌డా బాబులు, వ్యాపార‌వేత్త‌లు, అక్ర‌మార్కులు, పొలిటిక‌ల్ లీడ‌ర్లు, బిజినెస్ టైకూన్స్‌, సెల‌బ్రెటీలు, సినీ రంగానికి చెందిన వారు, క్రీడాకారులు ఇలా ప్ర‌తి ఒక్క‌రు ఇందులో త‌మ డ‌బ్బుల‌న్ని దాచుకున్నారు. ప్ర‌తి ఏటా ఏయే దేశాల‌కు చెందిన వారు ఎంతెంత ఇన్వెస్ట్ చేశార‌న్న వివ‌రాలు వెల్ల‌డించ‌దు ఈ బ్యాంక్. కానీ ఏ కంట్రీ ..ఏ స్థానంలో ఉందో మాత్రం ప్ర‌క‌టిస్తుంది. ఇక్క‌డే ఆయా దేశాల లావాదేవీలు, వ్యాపార వ్య‌వ‌హారాలు కొంత మేర‌కైనా ఆయా దేశాల ప్ర‌జ‌ల‌కు తెలిసే అవ‌కాశం ఉంటుంది. తాజాగా స్విట్జ‌ర్ లాండ్ లోని జ్యూరిచ్ లో కొలువు తీరిన స్విస్ బ్యాంక్ నిర్వాహ‌కులు ..న‌గ‌దును జ‌మ చేసే దేశాల జాబితా వివ‌రాల‌ను ప్ర‌క‌టించింది. గ‌త ఏడాదితో పోలిస్తే ఇండియా ఒక స్థానానికి ప‌డి పోయింది. గ‌తంలో 75వ స్థానంలో వుంటే ఈసారి 74 ర్యాంకుతో స‌రిపెట్టుకుంది. ఏడాది కాలంలో ఇండియ‌న్ సిటిజ‌న్స్ , బి...