క‌త్తుల క‌ర‌చాల‌నం - ప్ర‌పంచం విస్మ‌యం..చిన్న‌న్న‌తో పెద్ద‌న్న‌..!

ప్ర‌పంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మొద‌టిసారిగా ఉత్త‌ర కొరియా మైదానంలోకి అడుగు పెట్టారు. అత్యంత భారీ క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త న‌డుమ ఆయ‌న కాలు మోపారు. ఇప్ప‌టికే యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన్న ప్ర‌స్తుత త‌రుణంలో ట్రంప్ ప‌ర్య‌ట‌న ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌న టూర్ ..వైర‌ల్‌గా మారింది. తొలి అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌గా ఓ రికార్డు కూడా సృష్టించారు. ఒక‌రిపై మ‌రొక‌రు కారాలు మిరియాలు నూరుతున్నారు. నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్‌తో క‌ర‌చాల‌నం చేశారు. వాషింగ్ట‌న్ కు రావాల‌ని ట్రంప్ కోరారు. ఇద్ద‌రు చిరున‌వ్వులు చిందించారు. చిలుక ప‌లుకులు ప‌లికారు. నిన్న‌టి దాకా వీరిద్ద‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. ఒకానొక ద‌శ‌లో ట్రంప్ దాడులు చేస్తాన‌ని, దేశాన్ని తుద ముట్టిస్తాన‌ని బీరాలు ప‌లికాడు. ఒకే ఒక్క హెచ్చ‌రిక‌తో మిన్న‌కుండి పోయారు.

నీవు దాడి చేసిన క్ష‌ణ‌మే నీ అమెరికా ప్ర‌పంచ ప‌టంలో ఉండ‌ద‌ని కిమ్ చెప్పేశాడు. నీదగ్గ‌ర ఉన్న ఆయుధాల కంటే రెట్టింపు అణ్వాయుధాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయంటూ కిమ్ చెప్పేస‌రిక‌ల్లా ..యుఎస్ ప్రెసిడెంట్ మౌనం దాల్చారు. ఈ స‌మ‌యంలో ట్రంప్ , కిమ్‌ల భేటీ అత్యంత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. వీరిద్ద‌రు సుదీర్ఘంగా చ‌ర్చ‌లు జ‌రిపారు. కిమ్‌తో స‌మావేశ‌మైన అనంత‌రం ట్రంప్ మాట్లాడుతూ ..త‌మ దేశానికి రావాల‌ని ఆహ్వానించారు. మ‌రోసారి స‌మావేశం కావాల‌ని ఇద్ద‌రూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. బ‌ద్ధ శ‌త్రువులుగా ఉన్న ఇరు దేశాల నాయ‌కులు భేటీ కావ‌డంతో ప్ర‌పంచంలోని మిగ‌తా దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇద్ద‌రూ మొండి ఘ‌టాలే. శ‌ర‌వేగంగా చోటు చేసుకున్న నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ఈ అద్భుతం చోటు చేసుకుంది. వీలు కుదుర్చుకుని అమెరికా రావాల‌ని ట్రంప్ కోరారు.

ఉత్త‌ర కొరియా అణ్వ‌స్త్రాల‌పై కార్యాచ‌ర‌ణ స్థాయి చ‌ర్చ‌ల‌ను ప్రారంభించేందుకు ఇద్ద‌రు నేత‌లు అంగీకారం తెలిపారు. కిమ్ స్పందిస్తూ స‌రైన స‌మ‌యం, వీలు చూసుకుని ఉత్త‌ర కొరియా రాజ‌ధాని ప్యాంగ్యాంగ్ ను సంద‌ర్శించాల‌ని కిమ్ ట్రంప్‌ను కోరారు. ఉత్త‌ర‌, ద‌క్షిణ కొరియాల మ‌ధ్య నిస్సైనిక ప్రాంతంగా పిలిచే స‌రిహ‌ద్దు ప్రాంతంలో తాజా స‌మావేశం జ‌రిగింది. వీరిద్ద‌రి మ‌ధ్య తొలి భేటీ గ‌త ఏడాది సింగ‌పూర్‌లో జ‌రిగింది. అయితే అది ఫ‌ల‌వంతం కాలేదు. అణు నిరాయుధీక‌ర‌ణ‌పై స్ప‌ష్ట‌మైన పూచీ రాలేదు. రెండో భేటీ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో వియ‌త్నాంలో జ‌రిగింది. అది కూడా విఫ‌ల‌మైంది. అణు ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, యుఎస్ ను తాకే దీర్ఘ  శ్రేణి క్షిప‌ణుల‌ను అభివృద్ధి చేసిన ఉత్త‌ర కొరియా..ఆర్థిక ఆంక్ష‌ల‌ను ఎత్తి వేస్తేనే త‌న ఆయుధ కార్య‌క్ర‌మానికి స్వ‌స్తి ప‌లుకుతాన‌ని కిమ్ స్ప‌ష్టం చేశారు. తాజా భేటీ తో కొంత మేర‌కు ఉద్రిక్త‌త త‌గ్గే అవ‌కాశం ఉంది. స‌రిహ‌ద్దు రేఖ‌ను దాటి రావాల‌ని న‌న్ను ఆహ్వినించ‌డం ఆనందం క‌లిగించింద‌ని ట్రంప్ మీడియాతో వెల్ల‌డించ‌డం విశేషం. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!