స్విస్ బ్యాంకులో ఇంగ్లండ్ నెంబ‌ర్ వ‌న్

ప్రపంచంలో ఎక్క‌డ వున్నా స‌రే తాము అక్ర‌మంగా సంపాదించిన సొమ్మును దాచుకునే ఏకైక మార్గం ఏదైనా వుందంటే అది స్విస్ బ్యాంక్ ఒక్క‌టే. అక్క‌డ ఇన్వెస్ట్ చేసిన వారికి ఎలాంటి ఇబ్బందులంటూ వుండ‌వు. దాచుకున్న వారికి పూర్తి సెక్యూరిటీ ఇస్తుంది. అందుకే బ‌డా బాబులు, వ్యాపార‌వేత్త‌లు, అక్ర‌మార్కులు, పొలిటిక‌ల్ లీడ‌ర్లు, బిజినెస్ టైకూన్స్‌, సెల‌బ్రెటీలు, సినీ రంగానికి చెందిన వారు, క్రీడాకారులు ఇలా ప్ర‌తి ఒక్క‌రు ఇందులో త‌మ డ‌బ్బుల‌న్ని దాచుకున్నారు. ప్ర‌తి ఏటా ఏయే దేశాల‌కు చెందిన వారు ఎంతెంత ఇన్వెస్ట్ చేశార‌న్న వివ‌రాలు వెల్ల‌డించ‌దు ఈ బ్యాంక్. కానీ ఏ కంట్రీ ..ఏ స్థానంలో ఉందో మాత్రం ప్ర‌క‌టిస్తుంది. ఇక్క‌డే ఆయా దేశాల లావాదేవీలు, వ్యాపార వ్య‌వ‌హారాలు కొంత మేర‌కైనా ఆయా దేశాల ప్ర‌జ‌ల‌కు తెలిసే అవ‌కాశం ఉంటుంది.

తాజాగా స్విట్జ‌ర్ లాండ్ లోని జ్యూరిచ్ లో కొలువు తీరిన స్విస్ బ్యాంక్ నిర్వాహ‌కులు ..న‌గ‌దును జ‌మ చేసే దేశాల జాబితా వివ‌రాల‌ను ప్ర‌క‌టించింది. గ‌త ఏడాదితో పోలిస్తే ఇండియా ఒక స్థానానికి ప‌డి పోయింది. గ‌తంలో 75వ స్థానంలో వుంటే ఈసారి 74 ర్యాంకుతో స‌రిపెట్టుకుంది. ఏడాది కాలంలో ఇండియ‌న్ సిటిజ‌న్స్ , బిజినెస్ ప‌ర్స‌నాలిటీస్ స్విస్ బ్యాంకులో జ‌మ చేసే న‌గ‌దును బ‌ట్టి ఆ బ్యాంకు ర్యాంకులు ఇస్తుంది. కాగా, యుకె ఎప్ప‌టిలాగే మొద‌టి స్థానంలో కొన‌సాగుతోంది. గ‌తంలో 88వ స్థానంలో భార‌త్ గ‌తేడాది ఏకంగా 15 స్థానాలు దాటి 73వ స్థానంలో నిలిచింది. ఈసారి వెన‌క్కి వెళ్లింది. బ్యాంకు విశ్లేష‌ణ ప్ర‌కారం ఇండియ‌న్ పౌరులు వ్య‌క్తిగ‌తంగా లేదా వ్యాపార ప‌రంగా బ్యాంకులో జ‌మ చేసే న‌గ‌దు గ‌ణ‌నీయంగా త‌గ్గిందంటూ స్విస్ బ్యాంకు తెలిపింది.

ఇత‌ర దేశాల‌కు చెందిన వ్య‌క్తులు చేసే న‌గ‌దు జ‌మ‌తో పోలిస్తే ఇది కేవ‌లం 0.07 శాతంగా ఉంద‌ని పేర్కొంది. భార‌త్ తో పోలిస్తే యూకే ఏకంగా 26 శాతం న‌గ‌దు జ‌మ‌తో నెంబ‌ర్ ఒన్ లో ఉండ‌గా అమెరికా రెండ‌వ స్థానంలో, వెస్టిండీస్ మూడో స్థానంలో, ఫ్రాన్స్ నాల్గ‌వ స్థానంలో , హాంకాంగ్ ఐదో స్థానంలో ఉన్నాయి. మొత్తం స్విస్ బ్యాంకులో జ‌మ‌య్యే న‌గ‌దులో స‌గానికి పైగా ఈ మొద‌టి ఐదు దేశాల నుంచే వ‌స్తోంది. టాప్ -10 ఖాతాల‌తో పాటు మూడింట రెండొంతుల ఖాతాలు కూడా ఈ దేశాల‌కు చెందిన‌వే కావ‌డం గ‌మ‌నార్హం. బ‌హ‌మాస్, జ‌ర్మ‌నీ, ల‌క్సెంబ‌ర్గ్, కేమెన్ ఐలాండ్, సింగ‌పూర్ దేశాలు టాప్ 10లో ఉన్నాయి. బ్రిక్ దేశాల్లోనూ ఇండియా చివ‌రి స్థానంలో ఉండ‌గా, మొద‌టి ప్లేస్‌లో ర‌ష్యా, మూడో స్థానంలో చైనా , నాల్గో స్థానంలో ద‌క్షిణాఫ్రికా, బ్రెజిల్ ఆ త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!