యుకె సంపన్నుల్లో మనోళ్లే టాప్ - రిచెస్ట్ లిస్ట్ ప్రకటించిన సండే టైమ్స్

యుకెలో అత్యంత సంపన్నమైన వ్యక్తులుగా భారత్‌కు చెందిన హిందూజా సోదరులు ప్రథమ స్థానంలో నిలిచారు. సండే టైమ్స్ తాజాగా రిచెస్ట్ పీపుల్స్ జాబితాను లండన్‌లో ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే శ్రీ, గోపి హిందూజాల సంపద 1.356 బిలియన్ డాలర్లు పెరిగి 22 డాలర్లకు చేరుకుంది. గత ఏడాది ప్రకటించిన జాబితాలో మొదటి స్థానంలో జిమ్ రాట్ క్లిఫ్ ఈసారి మూడో స్థానానికి పడిపోయారు. జాబితాలో మొదటి నల్ల జాతి మహిళగా మోరన్ నిలిచారు. 1914లో హిందూజా సోదరులు ముంబైలో వ్యాపారాన్ని ప్రారంభించారు. చముము, గ్యాస్, బ్యాంకింగ్, ఐటీ, స్థిరాస్థి తదితర రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు..వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అవి భారీగా ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నాయి. నలుగురు సోదరుల్లో శ్రీ, గోపిలు మాత్రమే బిజినెస్ రంగాన్ని చూసుకుంటున్నారు. మిగతా ఇద్దరు సోదరులు దీనికి దూరంగా ఉన్నారు. గతంలో 2014, 2017 లలో ప్రకటించిన జాబితాల్లో హిందూజాలు స్థానం సంపాదించారు. యూరప్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన 1000 మంది సంపన్నులను విశ్లేషించారు. ఫైనల్‌గా ఈ జాబితాను ప్రకటించారు.ప్రస్తుతం వెల్లడ...