యుకె సంపన్నుల్లో మనోళ్లే టాప్ - రిచెస్ట్ లిస్ట్ ప్రకటించిన సండే టైమ్స్
యుకెలో అత్యంత సంపన్నమైన వ్యక్తులుగా భారత్‌కు చెందిన హిందూజా సోదరులు ప్రథమ స్థానంలో నిలిచారు. సండే టైమ్స్ తాజాగా రిచెస్ట్ పీపుల్స్ జాబితాను లండన్‌లో ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే శ్రీ, గోపి హిందూజాల సంపద 1.356 బిలియన్ డాలర్లు పెరిగి 22 డాలర్లకు చేరుకుంది. గత ఏడాది ప్రకటించిన జాబితాలో మొదటి స్థానంలో జిమ్ రాట్ క్లిఫ్ ఈసారి మూడో స్థానానికి పడిపోయారు. జాబితాలో మొదటి నల్ల జాతి మహిళగా మోరన్ నిలిచారు. 1914లో హిందూజా సోదరులు ముంబైలో వ్యాపారాన్ని ప్రారంభించారు. చముము, గ్యాస్, బ్యాంకింగ్, ఐటీ, స్థిరాస్థి తదితర రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు..వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అవి భారీగా ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నాయి.
నలుగురు సోదరుల్లో శ్రీ, గోపిలు మాత్రమే బిజినెస్ రంగాన్ని చూసుకుంటున్నారు. మిగతా ఇద్దరు సోదరులు దీనికి దూరంగా ఉన్నారు. గతంలో 2014, 2017 లలో ప్రకటించిన జాబితాల్లో హిందూజాలు స్థానం సంపాదించారు. యూరప్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన 1000 మంది సంపన్నులను విశ్లేషించారు. ఫైనల్‌గా ఈ జాబితాను ప్రకటించారు.ప్రస్తుతం వెల్లడించిన చోటు దక్కించుకున్న వారి బ్యాంకు ఖాతాలను పరిగణలోకి తీసుకోరు. ఉక్కు రంగ దిగ్గజంగా పేరొందిన లక్ష్మీ మిట్టల్ 3.99 మిలియన్ డాలర్ల సంపదను కోల్పోయి మూడో స్థానానికి పడిపోయింది. ప్రవాస భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ వ్యాపారాలలో భాగస్వాములుగా ఉన్నారు. ఆసియా, అరబ్, ఆఫ్రికా, అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యూరప్ , తదితర ప్రాంతాలలో ఎన్ ఆర్ ఐ లు స్థిరపడ్డారు.
తమదైన ముద్రను కనబరుస్తూ స్వంతంగా ఆర్థికంగా ఎదుగుతూ ..వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రకటించిన జాబితా చూస్తే.. ఇండస్ట్రీ అండ్ ఫైనాన్స్ రంగానికి చెందిన హిందూజా సోదరులు శ్రీ, గోపీలు 22 బిలియన్లతో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. రెండో స్థానంలో 18.7 బిలియన్లతో డేవిడ్ అండ్ సైమన్‌లు చోటు దక్కించు కోగా, మూడో స్థానంలో 18.2 బిలియన్ డాలర్లతో సర్ జిమ్ రాట్ క్లిఫ్ నిలిచారు. 14.4 బిలియన్ డాలర్లతో సర్ లెన్ బ్లావాట్నిక్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఇన్వెస్ట్ మెంట్, మ్యూజిక్, మీడియా రంగాలలో ఆయన తనదైన ముద్రను కనబరిచారు. హౌస్ హోల్డ్ గూడ్స్ అండ్ టెక్నాలజీ రంగంలో రాణిస్తున్న సర్ జేమ్స్ డైసన్ అండ్ ఫ్యామిలీ 12.6 బిలియన్ డాలర్లతో అయిదో స్థానాన్ని పొందారు.
ఆరో స్థానంలో 12.3 బిలియన్ డాలర్లతో క్రిస్టన్ అండ్ జాన్ రాసింగ్ నిలిచారు. ఏడో స్థానంలో 12 బిలియన్ డాలర్ల సంపదతో చార్లేన్ డే కార్లావానో చోటు దక్కించుకున్నారు. ఎనిమిదో స్థానంలో 11.3 బిలియన్ డాలర్లతో మైనింగ్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కు సంబంధించి అలిషెర్ ఉసామోవ్ ఉండగా, తొమ్మిదో స్థానంలో ఆయిల్ అండ్ ఇండస్ట్రీ రంగంలో 11.2 బిలియన్ డాలర్లతో రోమన్ అబ్రమోవిచ్ చోటు దక్కించుకుంటే..పదో స్థానంలో 10 బిలియన్ డాలర్లతో మైఖెల్ ఫ్రీడ్ మెన్ నిలిచారు. భారీ ఎత్తున ఆదాయం గడించిన ఈ వ్యాపారవేత్తలు కనీసం 10 శాతం ఆదాయాన్ని సామాజిక అభివృద్ధి కోసం ఖర్చు చేస్తే మేలు చేసిన వారవుతారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి