జాక్ పాట్ కొట్టేసిన రెంటోమోజో
లక్ ఎవరిని ఎప్పుడు పలకరిస్తుందో ఎవరికెరుక. అలాంటి భారీ ఆఫర్‌ను స్వంతం చేసుకుంటే ఎలా వుంటుందో తలుచుకుంటేనే వళ్లు జలదరించింది. అదృష్టం పలకరించాలే కానీ కోట్లు వాలిపోతాయి. మందగించిన బిజినెస్ జోరందుకుంటుంది. ఆదాయం సమకూరుతుంది. రూపాయలు వాలిపోతాయి. డాలర్ల పంట పండుతుంది. ఖలేజా ఉండాలే కానీ ..ప్రారంభించడమే కావాల్సిందల్లా. గీతాంశు 2014లో బెంగళూరు కేంద్రంగా రెంటో మోజో స్టార్టప్‌ను స్టార్ట్ చేశారు. ఈ అంకుర సంస్థ అద్దెకు ఫర్నీచర్ అందజేస్తుంది. కొనుగోలు చేయాల్సిన పనిలేదు. పాడై పోతుందున్న బెంగ లేదు. వాటిని మోసుకు వెళ్లాల్సిన బాధంటూ ఉండదు. ఎంచక్కా మనకు అవసరం అనిపిస్తే ..రెంటో మోజో యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడమే. కావాల్సిన వస్తువులన్నీ అందుబాటులో ఉంటాయి.
ఇల్లు, ఆఫీస్, రెస్టారెంట్స్, హోటల్స్ , కంపెనీలు, చిన్న చిన్న బిజినెస్ కేంద్రాలు, స్పాట్స్..ఇలా ప్రతి దానికి ఫర్నీచర్ అవసరమే. వీళ్లు కొత్త రకంగా ఆలోచించారు. కొన్ని రోజులుండే ఫర్నీచర్ కోసం ఎందుకు ఖర్చు చేయాలి డబ్బుల్ని. కార్లున్నాయి. అవసరానికి అద్దెకు దొరుకుతున్నాయి. ఆటోలు, మోటారు బైక్‌లు, వాహనాలు ఇలా ప్రతిదీ రెంట్ లో లభ్యమవుతున్నాయి. ఫుడ్, టాయిస్, దుస్తులు , సిరామిక్ , టైల్స్ ..అన్నీ దొరుకుతాయి. బెంగళూరు ఇప్పటికే ఇండియాలో ఐటీ హబ్ గా వినుతికెక్కింది. వేలాది మంది సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ పనిచేస్తున్నారు. బతుకు దెరువు కోసం లక్షలాది మంది జనం ఈ నగరానికి వస్తూనే ఉన్నారు. వీరందరికి అద్దెకు ఇళ్లు కావాలి. ఉండేందుకు కొంచెం జాగా కావాలి. ప్రతి ఒక్కరికి పని చేయాలన్నా లేదా దైనినైనా స్వంతం చేసుకోవాలన్నా..బిజినెస్ నడపాలన్నా ఫర్నీచర్ కావాల్సిందే. ఇక్కడే అసలు పాయింట్.
రెంటో మోజో టేబుల్స్, చైర్స్, డైనింగ్ టేబుల్స్, తదితర వాటినన్నింటిని అద్దె రూపంలో ఇస్తుంది. వాడుకున్నందుకు రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ కాన్సెప్ట్ వర్కవుట్ అయ్యింది. ఇంకేం డబ్బులు వచ్చి పడ్డాయి. జనం దీనిని యాక్సెప్ట్ చేశారు. వ్యాపారం పుంజుకుంది. స్టార్టప్ సక్సెస్ అయింది. జపాన్‌కు చెందిన ఒకరు రెంటోమోజోలో పెట్టుబడి పెట్టారు. మరికొందరు దీనిలో ఇన్వెస్ట్ చేశారు. ఈ అంకుర సంస్థ ఆన్‌లైన్ లోనే వ్యాపారం నిర్వహిస్తుంది. అసీల్ పార్ట్‌నర్స్, చిరాటే వెంచర్స్, ఐడిజి వెంచర్స్, బెయిన్ కేపిటల్, మాజీ లెండింగ్ క్లబ్ సిఇఓ రెనాడ్ ఇందులో పెట్టుబడులు పెట్టారు. జూలై 2017లో బి ఫండింగ్ 10 మిలియన్ల పెట్టుబడి పెట్టింది బెయిన్ కేపిటల్. తక్కువ టైంలో ఎక్కువ జనాదరణ పొందడంతో ..లాభాల పట్టింది ఈ అంకుర సంస్థ. అన్ని సంస్థలు కలిపి 77 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాయి. బెంగళూరు స్టార్టప్ సంస్థలలో ఇదో రికార్డు. రెంటో మోజో ఐడియా రియల్లీ గుడ్ కదూ. మనకూ ఓ ఐడియా తడితే..ఎలా వుంటుందో ట్రై చేస్తే పోలా.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి