మహీంద్రాకు ఆనంద్ గుడ్ బై

ఇండియాలో అత్యంత సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు. మిగతా కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్లు అంతా తమ వ్యాపారాలను ఎలా పెంచు కోవాలో చూస్తూ ఉంటే మహీంద్రా ఎండీ అండ్ చైర్మన్ ఆనంద్ మాత్రం సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. అంతే కాకుండా స్ఫూర్తి దాయకంగా ఉండే వాళ్లకు మహీంద్రా ఆర్ధిక తోడ్పాటు అందజేస్తున్నారు. ఇదే సమయంలో ఉన్నత వ్యాపార విలువలను పెంపొందిస్తూ కంపెనీని లాభదాయక బాటలో ఉండేలా తీర్చి దిద్దారు. దీంతో భారత దేశంలో ఆనంద్ టాప్ పొజిషన్ లో నిలిచారు. తాజాగా మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ మేనేజ్‌మెంట్‌లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్న ఆనంద్ర మహీంద్రా వైదొలుగుతున్నారు. ఆయనను కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నియమించింది. ఈయన బాధ్యతలు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రాబోతున్నాయి. పవన్ కుమార్ గోయెంకాను మేనేజింగ్ డైరెక్టర్‌గా మళ్లీ అపాయింట్ చేస్తూ.. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అదనపు బాధ్యతలు అప్ప జెప్పింది. సీఈవో బాధ్యతలను త్వరలో చేపడతారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాన్స్‌ను అమలు చేయడమే లక్ష్యంగా సీఈవో పొజిషన్‌ను కంపెనీ క్రియేట్ చేసిం...