ముగిసిన వేలం..ఆటగాళ్ల ఆనందం

అదృష్టం అంటే ఇదేనేమో. ఇండియాలో క్రికెట్ ఆటకున్నంత క్రేజ్ ఇంకే ఆటకు, ఆటగాళ్లకు లేదు. వీళ్ళ కోసం కోట్లల్లో ఫ్యాన్స్ కొట్టుకుంటారు..ప్రేమిస్తారు. ఇంతటి పిచ్చి ఇంకే ఆటకు లేదు. వరల్డ్ వైడ్ గా ఫుట్ బాల, బ్యాడ్మింటన్ , టెన్నిస్ క్రీడలు దుమ్ము రేపుతుంటే క్రికెట్ మాత్రం ప్రత్యేకంగా తన హవాను కొనసాగిస్తోంది. ఎంతలా అంటే విడిచి ఉండలేనంత. ఇక క్రికెటర్లు కరోడ్ పతులవుతున్నారు. ఒక్క రోజులోనే మోస్ట్ పాపులర్ అయిపోతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో క్రికెటర్ల లక్ వరించింది. ఐపీఎల్‌ - 2020 సీజన్‌కు సంబంధించి వేలం ముగిసింది. ఈసారి కోల్‌కతా వేదికగా జరిగిన వేలంలో పలువురు క్రికెటర్లకు ఊహించని ధరలు దక్కగా, చాలా మంది స్టార్‌ క్రికెటర్లకు నిరాశే ఎదురైంది.

ఊహించినట్లు గానే ఆసీస్‌ పేసర్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌, ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు మ్యాక్స్‌వెల్‌లు అత్యధిక ధరకు అమ్ముడు పోయారు. కమ్మిన్స్‌15 కోట్లకు పైగా అమ్ముడు పోగా, మ్యాక్స్‌ వెల్‌ 10.5 కోట్లకు వేలంలో కొనుగోలు చేశారు. భారత యువ క్రికెటర్లలో ముందుగా ఊహించినట్లు గానే యశస్వి జైస్వాల్‌, ప్రియాం గార్గ్‌లు ఐపీఎల్‌ వేలంలో పంట పండింది. భారత ఆండర్‌ -19 క్రికెటర్లైన జైస్వాల్‌ను రాజస్తాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేయగా,  గార్గ్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొనుగోలు చేసింది. ఈ వేలంలో తొలుత ప్రియాం గార్గ్‌ను 1.90 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ దక్కించుకోగా, జైస్వాల్‌ను 2.40 కోట్లకు రాజస్తాన్‌ రాయల్స్‌ చేజిక్కించుకుంది. అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్స్‌ అయిన గార్గ్‌-జైస్వాల్‌ల కనీస ధర 20 లక్షలు ఉండగా పలు ఫ్రాంఛైజీలు వీరి కోసం పోటీ పడ్డాయి.

ప్రధానంగా ముంబై ఇండియన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, కింగ్స్‌ పంజాబ్‌లు వీరి కోసం ఆసక్తి చూపాయి. ఇక పీయూష్‌ చావ్లా వేలంలో అదుర్స్‌ అనిపించాడు. 6.75 కోట్లకు చెన్నె సూపర్‌ కింగ్స్‌ కొనుగోలు చేసింది. చావ్లా కనీస ధర కోటి ఉండగా సీఎస్‌కే 6.75 కోట్లతో దక్కించుకుంది. వరుణ్‌ చక్రవర్తిని 4 కోట్ల ధర వెచ్చించి కేకేఆర్‌ దక్కించుకుంది. దీపక్‌ హుడా కనీస ధర 40 లక్షలు ఉండగా 50  లక్షలకు కింగ్స్‌ పంజాబ్‌ కొనుగోలు చేసింది. వెస్టిండీస్‌ హిట్‌ మ్యాన్‌ హెట్‌మెయిర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది. అతని కనీస ధర 50 లక్షలు ఉండగా,  7.75 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది. వినయ్‌ కుమార్‌ చివరి ఆటగాడిగా వేలంలోకి రాగా, అతన్ని ఏ ఒక్క ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!