సరి లేరుకు సైరా

తెలుగు సినిమాలో అరుదైన సన్నివేశం చోటు చేసుకోబోతోంది. అదేమిటంటే సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి చిరంజీవి రాబోతున్నారు. అనిల్ రావి పూడి డైరెక్షన్ లో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు రావాలని కోరుతూ చిత్ర యూనిట్ మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించింది. ఇందు కోసం చిరు కూడా అంగీకరించినట్లు స్వయంగా ప్రిన్స్ ట్వీట్ కూడా చేశాడు. ఇటీవలే సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని, ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా కొనసాగిస్తోంది చిత్ర బృందం. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌, సాంగ్స్‌ ఓ రేంజ్‌లో ఉన్నాయి. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

కొత్త ఏడాదిలో పండుగ వేళ విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను భారీగా నిర్వహించాలని భావిస్తోంది. దీని కోసం భారీ ఏర్పాట్లు చేయాలని, టాలీవుడ్‌కు చెందిన మరో అగ్ర హీరోను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని నిర్మాతలు భావిస్తున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. దీనిలో భాగంగా ఈ ఈవెంట్‌ అప్‌డేట్‌ కోసం సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా లాండ్‌ మార్క్‌ అనౌన్స్‌మెంట్‌కు సిద్ధం కండి అంటూ దిల్ రాజు బ్యానర్‌ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సోషల్ మీడియా పేజ్‌లో ఓ పోస్ట్ చేశారు. దీంతో అభిమానుల్లో ఈ అనౌన్స్‌మెంట్‌ మరింత ఆసక్తిని పెంచింది. కాగా ఈ ప్రకటన సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రానున్న ముఖ్య అతిథి గురించే అయివుంటుందని అందరూ ఊహించారు.

అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రానున్న అతిథి విషయంలో మహేష్‌ క్లారిటీ ఇచ్చారు. భారీగా జరిగే వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు మహేష్‌ బాబు కన్ఫర్మ్‌ చేశారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వచ్చేందుకు అంగీకరించిన చిరంజీవి గారికి ధన్యవాధాలు. మీరు విచ్చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ రాకతో మా ఆనందం రెట్టింపు అయ్యింది. మిమ్మల్ని కలవడానికి ఎంతోగానో ఎదురు చూస్తున్నా అంటూ ట్వీట్‌ చేశారు ప్రిన్స్. ఇందులో చాలా రోజుల తర్వాత లేడీ అమితాబ్ బచ్చన్, విజయశాంతి. దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!