భాగ్యనగరమే బెటర్

ఇండియాలో అన్ని ప్రాంతాల కంటే మన భాగ్యనగరమే బెటర్ అంటున్నారు పలువురు వ్యాపారవేత్తలు. ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్, తదిర రంగాల కంపెనీలన్నీ ఈ సిటీనే ఎంచుకుంటున్నాయి. ఓ వైపు దేశం గడ్డు పరిస్థితిని ఎదురుకుంటోంది. ఇంకో వైపు వ్యాపార, వాణిజ్య, ఆటోమొబైల్ రంగాలన్నీ తీవ్ర ఒడిడుకులు లోనవుతున్నాయి. ఆర్ధిక మంద గమనం దెబ్బకు వ్యాపారవేత్తలు లబోదిబోమంటున్నారు. ఎకనామిక్ స్లో డౌన్ వల్ల దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుంటే హైదరాబాద్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఏటా ప్రాపర్టీ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. 2019– 2020 ఆర్థిక సంవత్సరంలో మన సిటీలో ప్రాపర్టీ రేట్లు 17 శాతం మేర పెరిగాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి  నుంచి రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తూనే ఉంది.

రెసిడెన్షియల్ తోపాటు కమర్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. హైదరాబాద్ లో కమర్షియల్ లీజింగ్ 40 లక్షల నుంచి 45 లక్షల చదరపు అడుగుల నుంచి 90 లక్షల చదరపు అడుగుల వరకు చేరుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఇన్ ఫ్రా స్ట్రక్చర్ మెరుగు పడటం, వర్కింగ్ ప్రొఫెషనల్స్ సంఖ్య పెరగడంతో రియల్ ఎస్టేట్ రంగం రయ్యుమంటూ దూసుకు పోతోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో సర్కార్ తీసుకుంటున్న చర్యలతో హైదరాబాద్ కు పెద్ద పెద్ద కంపెనీలు క్యూ కడుతున్నాయి. దీంతో ప్రాపర్టీ మార్కెట్ లో డిమాండ్ పెరిగింది.

పెద్ద సంఖ్యలో స్టార్టప్ లు, గ్లోబల్ ఫర్మ్స్ తరలి వస్తున్నాయి. గత నెల అమెజాన్ సంస్థ యూఎస్ తర్వాత  హైదరాబాద్ లోపెద్ద క్యాంపస్ ను ప్రారంభించింది. హైటెక్ సిటీ దగ్గరలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 9.5 ఎకరాల్లో క్యాంపస్ నిర్మించింది. ఇటీవల ఇంటెల్ సంస్థ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ ను హైదరాబాద్ లోనే ఓపెన్ చేసింది. షూర్ సాఫ్ట్ వేర్ సంస్థ కూడా ఇక్కడే ఆఫీసు తెరిచింది. నగరంలోని ఐటీ సెజ్ వేవ్ రాక్ ను 1800 కోట్లతో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ అలయన్జ్ గ్రూప్ తో కలిసి కొనుగోలు చేసింది. 25 లక్షల చదరపు అడుగుల వైశాల్యం ఉన్న వేవ్ రాక్ లో అనేక కంపెనీలు కొలువుదీరి ఉన్నాయి. వేవ్ రాక్ లో అద్దె మీదనే 145 కోట్లు వస్తాయి. మొత్తం మీద హైదరాబాద్ బెటర్ ప్లేస్ అన్నమాట.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!