చట్టాల అమలులో రాష్ట్రాలే కీలకం

ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఏది మాట్లాడినా అదో సంచలనం. క్షణాల్లోపే ఆ విషయం వైరల్ అవుతోంది. తాజాగా సిటిజన్ షిప్ అంశంపై దేశమంతటా నిరసనలు, ఆందోళననలు చెలరేగుతున్నాయి. సెలబ్రెటీలు సైతం కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా నటుడు సిద్దార్థ్ పై కేసు కూడా నమోదైంది. కేంద్రం ఏ చట్టం చేసినా రాష్ట్రాల సహకారం లేనిదే అమలు సాధ్యం కాదని ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌ మరోసారి తేల్చి చెప్పారు. ఆయన సీఏఏ, ఎన్నార్సీలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. పౌరసత్వ సవరణ బిల్లుపై పార్లమెంటులో ఓటింగ్‌ జరగక ముందే నా అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించా.

సీఏఏ, ఎన్నార్సీలు దేశానికి మంచిది కాదని నా అభిప్రాయం. నాతో ఏకీభవించేవాళ్లంతా ఈ చట్టాలను వ్యతిరేకించాలని కోరుతున్నా. దేశంలోని 16 రాష్ట్రాల్లో బీజేపీయేతర ముఖ్యమంత్రులున్నారు. ఈ రాష్ట్రాల్లో దేశ జనాభా 65 శాతం ఉంది. గత లోక్‌సభ ఎన్నికలల్లో బీజేపీకి అత్యధిక మెజార్టీ స్థానాలు వచ్చినా ఓట్ల శాతం చూసుకుంటే వారికి వచ్చిన ఓట్లు 39 శాతమే. అంటే బీజేపీని దేశంలో 61  శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నా రనేగా అర్థం. మా పార్టీ ఎన్డీఏలో భాగస్వామియే. కాదనను.

కానీ చరిత్ర చూస్తే కొన్ని కీలక సమస్యలపై ఈ రెండూ పార్టీల వైఖరి పరస్పరం విరుద్ధంగా ఉంటుంది. అలాగే ఎన్నార్సీపై కూడా మా పార్టీ వైఖరి ఏంటో ఇ‍ప్పటికే మా నాయకుడు స్పస్టం చేశారు. పౌరసత్వ బిల్లు చట్టం ఆమోదం కావడం వల్ల పౌరులకు స్వేచ్ఛ అంటూ ఉండదని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఇప్పటికే ఈ రాజకీయ వ్యూహకర్తను ప్రతి పొలిటికల్ పార్టీ అధినేతలు కోరుకుంటున్నారు. ఈ ఒక్కడు ఇండియన్ పాలిటిక్స్ లో మోస్ట్ వాంటెడ్ స్ట్రాటజిస్ట్. ఇదిలా ఉండగా చాలా రాష్ట్రాలు సిటిజన్ షిప్ బిల్లుపై గగ్గోలు పెడుతున్నాయి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!