ఫోర్బ్స్‌ లిస్టులో మనోడే టాప్

ఇప్పటికే ప్రపంచ క్రికెట్ రంగంలో తనకంటూ ఓ రేంజ్ ఏర్పాటు చేసుకున్న టీమిండియా సారధి విరాట్ కోహ్లీ మరో రికార్డ్ క్రియేట్ చేశాడు. పరుగుల వరద పారిస్తూనే వరల్డ్ వైడ్ గా మోస్ట్ పాపులర్ ఆటగాడిగా పేరొందాడు. విరాట్‌ కోహ్లి కేవలం క్రికెట్లోనే కాదు ఇదివరకే సామాజిక మాధ్యమాల్లోనూ ఫాలోవర్ల పరంగా దూసుకెళ్లాడు. ఇప్పుడు ఫోర్బ్స్‌ ఇండియా సెలబ్రిటీల జాబితా లోనూ టాప్‌ లేపాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానంలో ఉన్న ఈ రన్‌ మెషిన్‌ తాజాగా భారత టాప్‌ –100 సెలబ్రిటీల్లోనూ నంబర్‌ వన్‌గా నిలిచాడు. మొత్తం 252.72 కోట్ల ఆర్జనతో అతనికి మొదటి స్థానం దక్కింది. అయితే బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ 293.25 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

ఇక్కడ ఫోర్బ్స్‌ జాబితా ర్యాంకుల్ని కేవలం ఆదాయం తోనే గణించరు. ఆ లెక్కన చూస్తే అక్షయ్‌ టాప్‌ లేపే వాడు. కానీ ఫోర్బ్స్‌ లెక్కకు ఇతర కోణాలు ప్రాతిపదిక అవుతాయి. ఆదాయంతో పాటు, పేరు ప్రఖ్యాతులు, ప్రసార మాధ్యమాల్లోని క్రేజ్, సామాజిక సైట్లలో అనుసరిస్తున్న వారి సంఖ్య  లాంటి అంశాలను బట్టి ర్యాంకింగ్‌ను కేటాయిస్తారు. గతేడాది అక్టోబర్‌ 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు ఈ అంశాలను లెక్కలోకి తీసుకున్న ఫోర్బ్స్‌ మేగజైన్‌ తాజా సంపన్న సెలబ్రిటీల జాబితాలో కోహ్లికి అగ్ర స్థానం కేటాయించింది.

ఇప్పటికే మనోడు అన్నిట్లోనూ టాప్ రేంజ్ లో కొనసాగుతూ వస్తున్నాడు. అటు ఆటలో ఇటు డబ్బులు సంపాదించడంలో మనోడు మిగతా సెలబ్రెటీలు సైతం విస్తు పోయేలా దూసుకెళుతున్నాడు. ఇదిలా ఉండగా టాప్‌100లో క్రీడాకారుల సంఖ్య పెరిగింది. 21 మంది క్రీడాకారులకు చోటు దక్కింది. క్రికెటర్లు కాకుండా బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ సింధు, సైనా, సునీల్‌ ఛెత్రి, మేరీకోమ్‌ , బజరంగ్‌ , అనిర్బన్‌, బోపన్న కూడా ఈ జాబితాలో ఉన్నారు. మొత్తం మీద మన ఆటగాళ్ల పంట పండుతోంది. ఇండియాలో చిన్నారుల నుంచి పెద్దల దాకా క్రికెట్ అంటే ఇష్టం. అందుకే ఈ ఆటకు ఉన్నంత క్రేజ్ ఇంకే ఆటకు లేదు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!