పౌర సమాజం ధర్మాగ్రహం

కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు హింసాత్మకంగా మారుతున్నాయి. దేశమంతటా వివిధ వర్గాలకు చెందిన పౌరులు, ప్రజా సంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు, మానవతావాదులు, ప్రజాస్వామికవాదులు నటీ నటులు సైతం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. దేశం ప్రస్తుతం అగ్ని గుండంగా మారింది. వివిధ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌ ఆందోళనలతో అట్టుడికింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. బిజ్నోర్‌లో ఇద్దరు, మీరట్, సంభాల్, ఫిరోజాబాద్‌, కాన్పూరు లో ఒక్కరు చొప్పున చనిపోయారు. ఢిల్లీలోనూ ఆందోళనలు పోలీసుల లాఠీచార్జి, కాల్పులకు దారి తీశాయి.

ప్రార్థనల అనంతరం మసీదుల ముందు వేలాదిగా నిరసన తెలిపారు. యూపీలో గోరఖ్‌పూర్‌ నుంచి బులంద్‌షహర్‌ వరకు దాదాపు అన్ని పట్టణాల్లో ప్రదర్శనలు జరిగాయి. పలుచోట్ల ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఢిల్లీలో జాతీయ పతాకం చేత పట్టుకుని, రాజ్యాంగాన్ని కాపాడాలంటూ కదం తొక్కారు. ఎర్రకోట, జామా మసీదు వద్ద భారీ ర్యాలీలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలతో పాటు కర్ణాటక, కేరళ సరిహద్దుల్లో ఇంటర్నెట్, ఎస్సెమ్మెస్‌ సేవలను నిలిపి వేశారు. పోలీసు అధికారి జాతీయ గీతాన్ని ఆలపించి ఆందోళనకారులను శాంతింప జేసిన ఘటన బెంగళూరులో జరిగింది.

బీజేపీ మిత్ర పక్షాలు తలో దిక్కు నిల్చున్నాయి. ఈ ఒక్క చట్ట సవరణ దేశంలో అల్లకల్లోలం జరిగేందుకు కారణమైంది. ఇంకో వైపు తమిళనాడులో సైతం ఆందోళనలు మిన్నంటాయి. కేంద్ర సర్కార్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ప్రముఖ నటుడు సిద్దార్థ్ సైతం సిటిజన్ షిప్ సవరణ బిల్లు సవరణ అత్యంత ప్రమాదకరమైనదిగా పేర్కొన్నారు. బీజేపీ సర్కార్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!