అందరి చూపు ఈడెన్ వైపు

ప్రపంచంలోనే అత్యున్నతమైన క్రికెట్ ఆటకు వేదికైన ఈడెన్ గార్డెన్స్ మరో చరిత్రకు నాంది పలకబోతోంది. గులాబీ గుబాళింపులన్నీ సిటీ ఆఫ్ జాయ్ లోనే కనిపిస్తున్నాయి. కోల్‌కతాలో ఎక్కడ చూసినా ఇప్పుడు పింక్ టెస్టు పలుకులే. క్రికెట్‌ను ప్రేమించే చారిత్రక నగరానికి ఇప్పుడు కొత్త శోభ చేకూరింది. తొలిసారి జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టును విజయవంతం చేసేందుకు కోల్‌కతా వాసులంతా ప్రయత్నం చేస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పింక్ టెస్టును సూపర్ సక్సెస్ చేసేందుకు, చిరస్మరణీయంగా మార్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లూ చేశాడు. భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగే డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌కు పలు ఆకర్షణలు తోడవుతున్నాయి. గతంలో భారీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన బెంగాల్ క్రికెట్ సంఘం ఈ సారి కూడా ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష హోదాలో ఉండటం కూడా వారికి అదనపు బలాన్ని ఇచ్చింది. ఆతిథ్యం అద్భుతంగా ఉండేందుకు ‘క్యాబ్’ అన్ని ఏర్పాట్లు చేసింది. స్వయంగా గంగూలీనే అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. టెస్టు మ్యాచ్ సందర్భంగా చేయబోయే ప్రత్యేక కార్యక్రమాల గురించి వెల్లడించారు. బంగ్లాదేశ్...