పింక్ బాల్ ఎవరిని గెలిపించెనో
ఇండియా అంటేనే క్రికెట్. క్రికెట్ అంటేనే ఇండియా. కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది ఈ ఆటపై. చిన్నారులు, వృద్దులు, అభిమానులు, సినీ స్టార్స్,, పొలిటికల్ లీడర్స్, ఇలా ప్రతి ఒక్కరు క్రికెట్ ప్రేమికులే. ఇదిలా ఉండగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ప్రెసిడెంట్ గా సౌరభ్ గంగూలీ ఎన్నికయ్యాక క్రికెట్ స్వరూపమే పూర్తిగా మారి పోయింది. మొదటి సారిగా పట్టుబట్టి పింక్ బాల్ ను ఇంట్రడ్యూజ్ చేశాడు గంగూలీ. దీంతో ప్రస్తుతం ప్రపంచం మొత్తం టీమిండియా, బంగ్లాదేశ్‌ల మధ్య జరిగే రెండో టెస్టుపై ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అభిమానులతో పాటు ఇరు దేశాల క్రికెటర్లు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ టెస్టు ప్రారంభానికి కొన్ని గంటలే సమయం ఉంది.
తొలి డేనైట్ టెస్టుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్జెన్స్ ఆతిథ్య మిస్తోంది. డే నైట్ టెస్టు కోసం రెగ్యులర్‌గా వాడే రెడ్ బాల్స్‌కు బదులు పింక్ బాల్స్‌ను వాడతారు. దీంతో ఈ పింక్ బాల్‌తో మనోళ్లు నెగ్గుకు రాగలరా అనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుత టీమిండియా సభ్యుల్లో కొంత మందికి పింక్ బాల్ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. సారథి విరాట్ కోహ్లి, వైఎస్ కెప్టెన్ అజింక్యా రహానే, ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్‌లు తొలిసారి పింక్ బాల్ క్రికెట్ ఆడ నుండటం విశేషం.ఇప్పటికే టీమిండియాతో పాటు, బంగ్లాదేశ్ ఆటగాళ్లు ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. తొలుత బెంగళూరులో రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు.
అనంతరం కోల్‌కతాలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే పింక్ బాల్ క్రికెట్ ఆడిన అనుభవం కొంత మందికి ఉండటం టీమిండియాకు లాభించే అంశం. బౌలర్లలో షమీ ఊహించని రీతిలో పెర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాడు. రివర్స్ స్వింగ్ సుల్తాన్ అయిన షమీ బంగ్లా పని పడతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. క్రికెట్ ఆసోసియేషన్ ఆఫ్ బెంగాల్ సూపర్ లీగ్ ఫైనల్లో పింక్ బంతులను ఉపయోగించారు. ఈ మ్యాచ్‌లో షమీ రెచ్చి పోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. దీంతో ఈ అనుభవం బంగ్లాతో జరిగే మ్యాచ్‌లో పనికొస్తుంది. షమీతో పాటు సాహా, రవీంద్ర జడేజా, మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, చటేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్ లకు మంచి పట్టుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి