మామ్స్ కు కిమ్స్ బంపర్ ఛాన్స్

గర్భిణులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం. మిసెస్‌ మామ్‌ పేరుతో  రెండో సీజన్‌ గ్రాండ్‌ ఫినాలేను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు డాక్టర్‌ శిల్పిరెడ్డి తెలిపారు. కొండాపూర్‌లోని కిమ్స్‌ హాస్పిటల్‌లో ఈ ప్రోగ్రాం వివరాలు వెల్లడించారు. మిసెస్‌ మామ్‌లో పాల్గొనే గర్భిణులకు మాదాపూర్‌లోని స్నాట్‌ స్పోర్ట్స్‌లో గ్రాండ్‌  ఫినాలే పోటీలు నిర్వహిస్తామన్నారు. మిసెస్‌ స్మైల్, మిసెస్‌ ఫ్యాషనిస్టా, మిసెస్‌ బ్రెయిన్స్, మిసెస్‌ బ్యూటీఫుల్‌ హెయిర్, మిసెస్‌ ఫిట్‌నెస్‌ తదితర కేటగిరీల్లో విజేత, రన్నరప్, రెండో రన్నరప్‌లను ఎంపిక చేస్తామన్నారు.

విజేతలకు ఉచిత ప్రసవంతో పాటు ఆసక్తికర బహుమతులు అంద జేయనున్నట్లు వెల్లడించారు. గర్భిణులు 8897993265 నంబర్‌కు ఫోన్‌ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. గర్భిణులు శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు వ్యక్తిత్వ వికాసంతో పాటు యోగా చేయిస్తామన్నారు. న్యూట్రిషన్‌లో చిట్కాలు, డెంటల్, హెల్త్‌ చెకప్స్, గర్భిణులు అందంగా ఎలా తయారు కావచ్చో తెలియ జేయడమే గాక సాధారణ ప్రసవం కోసం వారిని సిద్ధం చేస్తామని తెలిపారు.

గత ఏడాది 60 మంది మిస్‌ మామ్‌ పోటీల్లో పాల్గొనగా 40 మందికి సాధారణ ప్రసవాలు జరిగినట్లు చెప్పారు. ప్రసవానంతరం వ్యాయమం, బేబీ కేర్, బేబీ మేకప్, మసాజ్, స్నానం, హెల్దీ కుకింగ్‌లపై అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ నీలిమా ఆర్య, మన్సీ ఉప్పల, డాక్టర్లు సమంత, శారద, శ్రీదేవి పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల గర్భిణులకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది. శారీరక పరంగా చోటు చేసుకునే ఇబ్బందులను అధిగమించేందుకు వీలవుతుంది. దీనివల్ల టెన్షన్ కు దూరం అవుతారు.  

కామెంట్‌లు