మెస్మరైజ్ చేస్తున్న 5జీ ఫోన్
స్మార్ట్ ఫోన్స్ లవర్స్ కు తీపి కబురు. ఎప్పటినుంచో ఊరిస్తూ వస్తున్న 5 జీ ఫోన్ ను వరల్డ్ మార్కెట్ లోకి తీసుకు వచ్చింది శాంసంగ్. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. శాంసంగ్ డబ్ల్యు 20..5జీ పేరుతో దీన్ని లాంచ్ చేసింది. గెలాక్సీ ఫోల్డ్ రీబ్రాండెడ్ వెర్షన్ 5జీ అప్ గ్రేడ్ చేసి ఈ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 855+ సాక్ మినహా మిగిలిన ఫీచర్లను గెలాక్సీ ఫోల్డ్ మాదిరిగా ఉంచింది.
ఎకెజి-ట్యూన్డ్ స్పీకర్లు, డాల్బీ అట్‌మాస్ సపోర్ట్, యాక్సిలెరో మీటర్, యాంబియంట్ లైట్, బేరో మీటర్, జియో మాగ్నెటిక్, గైరోస్కోప్,ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ లాంటి ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. అలాగే వైర్ లెస్ ఛార్జింగ్‌తో పాటు వైర్ లెస్ పవర్ షేర్‌కు మద్దతు ఇస్తుంది. డిసెంబరు నుంచి ఇది చైనాలో అందు బాటులోకి రానుంది. ధర వివరాలు, ఇతర మార్కెట్లలో దీని లభ్యత తదితర వివరాలను శాంసంగ్ ఇంకా వెల్లడించలేదు. అయితే దీని ధర సుమారు1,73,000 గా వుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే మోటోరోలా కూడా కొత్త ఫోన్ ను ఇటీవలే ప్రదర్శనకు ఉంచింది.
ఇప్పుడు మొబైల్ కంపెనీలన్నీ 5 జీ జపం చేస్తున్నాయి. డేటా, ఇంటర్ నెట్ వినియోగంలో మరింత స్పీడ్ రానుంది. అంతే కాకుండా రాబోయే కాలమంతా ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే వాటికే ఎక్కువగా డిమాండ్ ఉండబోతోంది. అంతే కాకుండా ఇప్పుడు కోట్లాది మంది ఉపయోగిస్తున్న 4 జీ మొబైల్ కస్టమర్స్ అందరూ ఇప్పుడు రానున్న న్యూ మొబైల్స్ కొనుగోలు చేయాల్సిందే. యాపిల్, వన్ ప్లస్, రెడ్ మీ, రియల్ మీ, వివో, తదితర కంపెనీలు కస్టమర్స్ కు గాలం వేస్తున్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి