ఉగ్రమూకల పంజా..రక్తమోడిన కొలంబో

ఉగ్ర మూకలు మరింత రెచ్చి పోయాయి. శ్రీలంక రాజధాని కొలంబోలో ఒక్కసారిగా భారీ శబ్దాలతో నగరం దద్దరిల్లి పోయింది. ప్రశాంత వాతావరణంలో చర్చీలలో ప్రార్థనలు చేసుకుంటున్న వారే లక్ష్యంగా ఈ దాడులు వెంటవెంటనే కొనసాగాయి. ఇప్పటి వరకు 130 మందికి పైగా చనిపోగా ఇంకా ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో కొలిక్కి రాలేదు. మూడు చర్చీలు, మూడు హోటళ్లలో ఈ పేలుళ్లు జరిగాయి. భారీ పేలుళ్లు చర్చీలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆకస్మిక దాడుల దెబ్బకు శ్రీలంక ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. ప్రధానమంత్రి కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న హోటల్‌లో బాంబులు పేలాయి. ఈస్టర్ పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. చాలా మంది చర్చీలలో ప్రార్థనలు చేశారు. ప్రశాంత వాతారణం నెలకొన్న సమయంలో బాంబులు పేలడంతో జనం భయంతో పరుగులు తీశారు. బాంబు పేలుళ్ల దుర్ఘటన దుర్వార్త దావానలంలా వ్యాపించడంతో ..ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి. ఇండియా, పాకిస్తాన్, చైనా, అమెరికా, ఇంగ్లండ్ , రష్యా దేశాల అధిపతులు తీవ్ర దిగ్భ్రాంతిని ప్రకటించారు. ఈ...