చెలరేగిన స్మిత్ ..రాజస్థాన్ ఈజీ విన్
క్రికెట్ ఆటకు ఉన్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు సరదా కోసం ఆడిన గిల్లీ దండా ..ఇపుడు క్రికెట్ రూపంలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. కోట్లాది ఫ్యాన్స్‌ను నిద్ర లేని రాత్రులు గడిపేలా చేసేస్తోంది. క్షణ క్షణానికి ఉత్కంఠను రేపుతూ..ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ..నరాలు తెగిపోతాయో అన్నంత ఉద్వేగాన్ని కలిగించే ఈ క్రికెట్ ఇపుడు జనాన్ని పీడిస్తోంది. పిల్లలు..మహిళలు..యూత్..పెద్దలు..వృద్ధులు ఇలా ఒకరేటిమి..అందరూ..అంతటా టీవీలకు అతుక్కు పోయారు..లక్షలాది మంది మొబైల్స్‌లో వీక్షిస్తున్నారు. ఇవేవీ పట్టించుకోని వేలాది అభిమానులు టికెట్ల వేటలో విజేతలుగా నిలుస్తున్నారు. తమకున్న అభిమానాన్ని చాటుకునేందుకు ప్రత్యక్షంగా మైదానంలో ఇరు జట్లు తలపడే పోరాటాన్ని చూస్తూ..తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
ఐపీఎల్ టోర్నీలో జైపూర్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ముంబై ఇండియన్స్ జట్టుపై సునాయసంగా గెలుపొందింది. అయిదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. ఆర్ఆర్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ విధ్వంసకరమైన రీతిలో ఆటతీరును ప్రదర్శిస్తే..సహచర ఆటగాడు..పంచ్ హిట్టర్‌గా పేరొందిన సంజూ శాంసన్ తోడవడంతో స్కోర్ పరుగులు తీసింది. 48 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో 59 పరుగులు స్మిత్ చేస్తే..19 బంతులు ఆడి నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 35 పరుగులతో అలరించాడు శాంసన్. ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన రియాన్ పరాగ్ రెచ్చి పోయాడు. స్టేడియం నలు వైపులా షాట్లు ఆడాడు. కేవలం 29 బంతులు మాత్రమే ఆడిన ఈ క్రికెటర్ 5 ఫోర్లు , ఒక సిక్సర్ బాది 43 పరుగులు చేశాడు. గెలుపు లాంఛనం అనిపించినా..చివర్లో పరాగ్, టర్నర్‌లు త్వరగా అవుట్ కావడంతో కొంత ఉత్కంఠ రేగింది.
కెప్టెన్ నాటౌట్‌గా ఉండడంతో స్మిత్..బిన్నీ లు కలిసి రాజస్థాన్‌కు మరో విజయాన్ని అందించారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. రోహిత్ శర్మ త్వరగా అవుట్ కాగా..డికాక్ రెచ్చిపోయాడు. ఆరు ఫోర్లు రెండు సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. సూర్యకుమార్ ఒక ఫోర్ ..ఒక సిక్సర్‌తో 34 పరుగులు చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 97 పరుగులు జోడించారు. పోలార్డ్, డికాక్ అవుట్ కాగా..హార్దిక్ పాండ్యా 23 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోర్ చేసింది ముంబయి జట్టు. బలమైన జట్టుగా పేరొందిన ముంబై జట్టును రాజస్థాన్ ఓడించడంతో మరింత జోష్ పెంచింది రాజస్థాన్ ఆటగాళ్లలో.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి