ఇండియాను షేక్ చేస్తున్న జియో - ఎయిర్ టెల్, వోడా డీలా..!

ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ స్టార్ట్ చేసిన జియో ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఆయిల్, జ్యుయెలరీ, ఈ కామర్స్ , ఫ్యాషన్, లాజిస్టిక్ రంగాలలో టాప్ రేంజ్ లో కొనసాగుతున్న ఈ కంపనీ ఇటీవలే టెలికం రంగాన్ని ఒంటి చేత్తో శాసించే స్థాయికి చేరుకుంది. ప్రత్యర్హి కంపెనీలు భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ , ఎయిర్ టెల్ , వోడా ఫోన్ , ఐడియా, టాటా టెలికాం ఇలా ప్రతి టెలికాం ఆపరేట్స్ కు చుక్కలు చూపిస్తోంది. మొదటి సారిగా జియో ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు లైట్ గా తీసుకున్నాయి మిగతా కంపెనీలు. కానీ ఆర్ ఐ ఎల్ మాత్రం దేశ వ్యాప్తంగా విస్తరించింది. ఎంతలా అంటే ప్రపంచాన్ని గూగుల్ ఎలా తన కంట్రోల్ లో పెట్టుకున్నదో, అలాగే రిలయన్స్ కంపెనీ మారుమూల గ్రామాలకు సైతం తన నెట్ వర్క్ ను ఏర్పాటు చేసింది. ఇందు కోసం వేలాది కోట్లను ఖర్చు చేసింది. దీంతో డేటా కన్వర్జేషన్ అన్నది మరింత సులభతరంగా తయారైంది. ఇండియాలో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి ఇంటర్నెట్ ఆధారిత సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని ఇటీవల ముంబైలో జరిగిన మీటింగ్ లో చెప్పారు ముకేశ్ అంబానీ. ఇది తమ ఆలోచన కాదని. తమకు ప్రాణం పోసి, ప్రపంచం...