కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు - ఉత్తమ్ వర్సెస్ రేవంత్
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రతిపక్ష పాత్రను పోషించలేక పోతోంది. ఓ వైపు అధికార పక్షాలు రాకెట్ కంటే స్పీడ్ గా దూసుకు వెళుతుంటే కాంగ్రెస్ మాత్రం ఇంటి పోరుతో సతమతమవుతోంది. తాజాగా పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ పై అభ్యర్థిని ముందుగానే ప్రకటించడంపై అదే పార్టీకి చెందిన ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదన్నారు. పార్టీలో చర్చించ కుండానే, ఏకాభిప్రాయం తీసుకోకుండానే, ఎలాంటి సమావేశం నిర్వహించకుండానే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా డెసిషన్ తీసుకుంటారని రేవంత్ ప్రశ్నించారు. ఉత్తమ్ తన భార్యకు టికెట్ కేటాయిస్తూ ముందస్తుగానే ప్రకటన చేయడంతో సమస్య మరింత జఠిలంగా మారింది. అంతకు ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీని సోనియా గాంధీ తన చేతుల్లోకి తీసుకున్నాక, ఢిల్లీలో రేవంత్ రెడ్డి తన కుటుంబంతో సహా ఆమె నివాసం కు వెళ్లి కలిశారు.
ఇదే సందర్భంలో పార్టీకి సంబంధించి పూర్తిగా ప్రక్షాళన చేస్తారని, తెలంగాణా పీసీసీ అధ్యక్ష పదవిని మార్పు చేస్తారని పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. ఆ మేరకు రేవంత్ రెడ్డి కి పట్టం కట్టబోతున్నట్లు వార్తలు సైతం వచ్చాయి. ఇదే సమయంలో సీనియర్లు హుటాహుటిన ఢిల్లీ వెళ్లి నిన్న గాక మొన్న వచ్చిన రేవంత్ కు ఎట్లా ఇస్తారని, సీనియర్స్ తాము ఉండగా అంటూ చక్రం తిప్పినట్లు ఆరోపణలున్నాయి. ఇదే సమయంలో నల్లమలలో యురేనియం తవ్వకాలపై రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లారు. చెంచులకు, గిరిజనులకు అండగా ఉంటానని చెప్పారు. ఎవరైనా ఇక్కడికివస్తే చెట్లకు కట్టేసి కొట్టండంటూ పిలుపునిచ్చారు. ఇది వైరల్ అయ్యింది. దీనిపై మరో సీనియర్ కాంగ్రెస్ నానాయకుడు వి. హనుమంత్ రావు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. నల్లమలను కాపాడుకునేందుకు తమతో కలిసి రావాలని కోరారు. ఇందుకు పవన్ కళ్యాణ్ సైతం ఒప్పుకున్నారు.
ఆయన స్వయంగా రేవంత్ కు ఫోన్ చేసి కలిసి పోరాటం చేద్దామని కోరారు. అనంతరం దస్ పల్ హోటల్ లో యురేనియం కు వ్యతిరేకంగా అఖిలపక్షం సమావేశం జరిగింది. అన్ని పార్టీలకు చెందిన వారంతా పాల్గొన్నారు. అందులో రేవంత్, సంపత్, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. దీనిపై సంపత్ కుమార్ తీవ్ర నిరసన తెలిపారు. పవన్ మీటింగ్ కు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెళ్లాలంటూ ప్రశ్నించారు. దీంతో పాటు ఉత్తమ్ , సంపత్, వంశీ చందర్ రెడ్డి పై రేవంత్ మండిపడ్డారు. పద్మావతి అభ్యర్థిత్వాన్ని ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని, తాను ఛామల కిరణ్ కుమార్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ లో పదవి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవ్వరికీ తెలియదన్నారు. యురేనియం విషయంలో సంపత్ కు ఏబీసీడీ లు కూడా తెలియవన్నారు. వీహెచ్ పిలిస్తేనే వెళ్ళాను తప్పా అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అవినీతి అక్రమాల వివరాలను త్వరలోనే బీజేపీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ కు అప్పగిస్తానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు ఈ రూపకంగా బయట పడింది. ఈ విషయంపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి