పెల్లుబికిన భాషాభిమానం..అమిత్ పై ఆగ్రహం..!

భారత దేశంలో ఎక్కువగా హిందీ భాషను మాట్లాడుతున్నారు కాబట్టి దేశమంతటా హిందీని తప్పని సరిగా వాడాలంటూ బీజేపీ హోమ్ శాఖా మంత్రి అమిత్ చంద్ర షా వ్యాఖ్యానించడంపై దేశమంతటా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పలు రాష్ట్రాలలో ఆయా పార్టీలకు చెందిన అధినేతలు, నటులు, ముఖ్యమంత్రులు, విపక్షాలు, మేధావులు, భాషాభిమానులు పెద్ద ఎత్తున మండి పడ్డారు, తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమిళ నాడు, పక్షిమ బెంగాల్ లో ఆందోళనలు చేపట్టారు. అంతే కాకుండా తమిళనాడులో ప్రజలు స్వచ్చందంగా రోడ్లపైకి వచ్చారు. మద్రాస్ లో రోడ్లపై ఏర్పాటు చేసిన బోర్డులపై ఉన్న హిందీ అక్షరాలను చెరిపి వేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పు కునేది లేదంటూ స్పష్టం చేశారు. తమపై బలవంతంగా హిందీని రుద్దాలని ప్రయత్నం చేస్తే దేశం అగ్ని గుండమే అవుతుందని అమిత్ షా ను హెచ్చరించారు.

డీఎంకే అధినేత స్టాలిన్ ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ప్రముఖ నటులు కమల హాసన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. జల్లికట్టు లాగా ఉద్యమించాల్సి వస్తుందన్నారు. ఎవరి భాష వారిదే. ఇంకొకరి పెత్తనాన్ని సహించం, ఇంకో భాషను స్వీకరించే ప్రసక్తి లేదన్నారు. తమిళనాడు లో ప్రభావం చూపించే నటుడిగా పేరున్న తలైవా రజనీకాంత్ సైతం హిందీని ఒప్పుకోమన్నారు. కాగా ఇటీవల ఆయన బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. ఇదే సమయంలో ఆయన ప్రకటన చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. మరో వైపు స్టాలిన్ బీజేపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఇంకో వైపు కర్ణాటక బీజేపీ సీఎం యెడ్యూరప్ప సైతం కన్నడ నాట కన్నడ తప్పా హిందీని ఒప్పుకోమన్నారు. దీంతో అన్ని ప్రాంతాలలో బీజేపీపై తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో బీజేపీ పునరాలోచనలో పడింది. ఇది పార్టీకి మరింత డ్యామేజ్ కలిగించేలా ఉందని, అమిత్ షా తన మాటలను వెనక్కి తీసుకున్నారు. మాతృ భాషలతో పాటు హిందీని కూడా నేర్చుకోవాలని మాత్రమే అన్నానని చెప్పారు. ఒకే దేశం ఒకే భాషపై దుమారం చేరేగడంపై ఆయన స్పందించారు. నేను కూడా హిందీ మాట్లాడని గుజరాత్ నుంచి వచ్చా. దీనిపై కొందరు రాజకీయం చేయాలనీ చూస్తున్నారని అన్నారు. మొత్తం మీద ఒకే ఒక్క మాట కలకలం రేపింది. కాకా పుట్టించడం లోను ..దానిని చల్లార్చడం లోను అమిత్ షా తర్వాతే ఎవ్వరైనా. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!