పోస్ట్‌లు

నవంబర్ 28, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

అజ్జూకు అరుదైన గౌరవం

చిత్రం
భారత మాజీ క్రికెట్ సారధి, ప్రస్తుత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షడు మహమ్మద్ అజహరుద్దీన్ కు అరుదైన గౌరవం దక్కనుంది. ఇప్పటికే ఈ అతగాడికి ఎన్నో అవార్డులు, పురస్కారాలు దక్కాయి. ఇండియా జట్టుకు ఎనలేని విజయాలు నమోదు చేసిన ఆటగాడిగా పేరుంది. ప్రస్తుతం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో  అజహరుద్దీన్‌ పేరిట ఒక స్టాండ్‌ ఏర్పాటు చేయనున్నారు. హెచ్‌సీఏ అపెక్స్‌ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నార్తర్న్‌ పెవిలియన్‌లోని స్టాండ్స్‌లలో ఒక దానిని అజహర్‌ స్టాండ్‌గా వ్యవహరిస్తారు. డిసెంబర్‌ 6న భారత్, వెస్టిండీస్‌ మధ్య ఇక్కడ జరిగే తొలి టి20 మ్యాచ్‌ సమయంలో అధికారికంగా స్టాండ్‌కు పేరు పెడతామని హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు జాన్‌ మనోజ్‌ వెల్లడించారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్‌ క్రికెటర్లు అర్షద్‌ అయూబ్, వెంకటపతి రాజులను భవిష్యత్తుల్లో ఇదే తరహాలో గౌరవిస్తామని కూడా ఆయన చెప్పారు. మరో వైపు సౌత్‌ పెవిలియన్‌ బ్లాక్‌లోని ఒక లాంజ్‌కు హెచ్‌సీఏ మాజీ సంయుక్త కార్యదర్శి ఆర్‌.దయానంద్‌ పేరు కూడా పెట్టనున్నారు. టి20 మ్యాచ్‌ కోసం నేటి నుంచి టికెట్ల అమ్మ కాలు ప్రారంభిస్తున్నట్లు హెచ్‌సీఏ అధ...

ఫ్రాంచైజీలపై రాహుల్ ఫైర్

చిత్రం
మాజీ భారత జట్టు సారధి, ప్రస్తుత క్రికెట్ అకాడెమీ బాధ్యుడు రాహుల్ ద్రవిడ్ ఫ్రాంచైజీలపై నిప్పులు చెరిగారు. సామాన్యంగా తనపని తాను చేసుకుని పోయే స్వభావం ఉన్న వ్యక్తి. ఉన్నట్టుండి తన మనసులోని అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఇండియాలో ప్రస్తుతం ఐపీఎల్ హవా కొనసాగుతోంది. కోట్లాది రూపాయల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే కార్పొరేట్ కంపనీలు దీనిపై కన్నేశాయి. అంతే కాకుండా ప్రతిభావంతులైన ఆటగాళ్లకు మంచి ఛాన్సెస్ వస్తున్నాయి. అయితే ఫ్రాంచైజీలు మాత్రం భారత సీనియర్ ఆటగాళ్లను అస్సలు పరిగణలోకి తీసు కోవడం లేదు. దీనిపై ది వాల్ తీవ్రంగా స్పందించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భారత క్రికెట్ కోచ్ లను తీసుకోకుండా ఫ్రాంచైజీలు తప్పు చేస్తున్నాయని మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అభిప్రాయ పడ్డాడు. లీగ్‌లో ఎక్కువ మంది మన ఆటగాళ్లే ఉంటారని, వారిని అర్థం చేసు కోవడంలో ఇండియన్ కోచ్ లే ముందుంటారని స్పష్టం చేశారు. ఎంతో మంది ప్రతిభా వంతులైన కోచ్‌లు మనకు అందుబాటులో ఉన్నారని, హెడ్‌ కోచ్‌గా పెట్టుకునే అవకాశం∙లేకపోతే కనీసం, అసిస్టెంట్‌ కోచ్‌గానైనా ఎంపిక చేసుకుంటే బాగుంటుందని ఈ దిగ్గజ ద్రవిడ్‌ సూచించాడు. ...

బంధాలే కీలకం..కథకు ప్రాణం

చిత్రం
దేనికైనా కుటుంబమే ముఖ్యం. కథైనా లేదా పాటలైనా, మాటలైనా అన్నీ ఇందులోంచి వచ్చినవే. అందుకే బంధాల అనుబంధాలను, వాటిలోని భావోద్వేగాలను తెరమీద చూపించేందుకు తాను ప్రయత్నం చేస్తున్నారు వర్ధమాన దర్శకుడు సుందర్ సూర్య. ఆప్యాయతలు.. అనుబంధాలంటే ఆయనకు చాలా ఇష్టం. పెరిగిన వాతావరణం అలాంటిది. అమ్మ ప్రోత్సాహంతోనే సినిమా రంగంలో రాణిస్తున్నా అంటున్నారు. 12 ఏళ్ల ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నా. ఆనంద క్షణాల్ని గుర్తు చేసుకుంటూ, ప్రస్తుత కాలాన్ని గడపాలనే చిన్న లైన్‌ ఆధారంగానే అమ్మమ్మగారి ఇల్లు సినిమా తీశా అంటున్నారు సూర్య. కథా చర్చల కోసం ఆయన హైదరాబాద్ కు వచ్చారు. చిన్నతనం నుంచి సినిమాలంటే పిచ్చి. అందుకే దీనినే ఎంచుకున్నారు. కుటుంబంలో పెద్దన్నయ్య ప్రభుత్వ ఉద్యోగి, చిన్నన్నయ్య వ్యాపారి. నచ్చిన రంగంలో రాణించాలని అమ్మ మణి ప్రోత్సహించింది. ఆమెకు చాలా రుణపడి ఉన్నా. మనసుకు నచ్చిన పని చేయడంలో ఉన్న ఆనందం మరెక్కడా దొరకదు. దీనిని నేను బలంగా విశ్వసిస్తాను. అందుకే చిత్ర పరిశ్రమలో నిలదొక్కు కోవాలనే బలమైన కాంక్షతో ముందుకు సాగుతున్నా అని చెప్పారు ఈ యంగ్ డైరెక్టర్. అమ్మమ్మ గారి ఇల్లు చిత్రీకరణ నా బలమైన ఆకాంక్షను ...

హబ్బీకీ ప్రియాంక లవ్లీ గిఫ్ట్

చిత్రం
‘వైట్‌ టైగర్‌’ సినిమా షూటింగ్‌లో బీజీగా ఉన్నారు బాలీవుడ్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా. మరికొన్ని రోజుల్లో ఈ గ్లోబల్‌ స్టార్‌ మొదటి పెళ్లి రోజును జరుపు కోబోతున్నారు.  2018 డిసెంబర్‌ 1న వీరి వివాహం అయిన విషయం తెలిసిందే. తాజాగా సినిమాకు కొన్ని రోజులు విరామం ఇచ్చిన ప్రియాంక అమెరికాకు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా న్యూయార్క్‌ వెళ్లిన ప్రియాంక భర్త హలీవుడ్‌ పాప్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. జెర్మన్‌ షెపర్డ్‌ జాతికి చెందిన ఓ కుక్క పిల్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనికి ‘గినో’ గా అప్పుడే పేరు కూడా పెట్టేశారు. ఇందుకు నిక్‌ నిద్రలేవక ముందే కుక్కపిల్లను ఇంటికి తీసుకువచ్చి ప్రియాంక సర్‌ప్రైజ్‌ చేశారు. ఇదంతా వీడియో తీసిన ప్రియాంక ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.  దీనికి ‘ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరూ క్యూట్‌గా ఉన్నారు. హ్యపీ యానివర్సరీ బేబీ’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఇ​క దీనిపై స్పందించిన నిక్‌..ఉదయాన్నే నాకు మంచి బహుమతి అందింది. మా గిల్‌కు హాయ్‌ చెప్పండి. నిద్ర లేచినప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నాను. థాంక్యూ ప్రియాంక అంటూ తెలిపారు. కాగా ఇప్పటికే ప్రియాంక చోప్రా ఇంటిలో డయానా అనే కుక్క ...

సర్కార్ తీస్తానంటున్న వర్మ

చిత్రం
సంచలనాలకు కేరాఫ్ గా మారిన దమ్మున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ఏది మాట్లాడినా లేదా ఏది తీసినా అది వివాదాస్పదం అవుతోంది. తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో వర్మ మూవీ తీశాడు. ఈ సినిమా రిలీజ్ కాకుండానే పలు ఆరోపణలు ఎదుర్కుంటోంది. ఇంకా ఈ సినిమాకు సెన్సార్ సెర్టిఫికెట్ రాలేదు. అయినా తాను మాత్రం ఆగనంటున్నాడు ఈ డైనమిక్ దర్శకుడు. మరాఠాలో బాల థాక్రే ఏర్పాటు చేసిన శివ సేన మొదటి సారిగా అధికారంలోకి వచ్చింది. గతంలో రామ్ గోపాల్ వర్మ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో సర్కార్ సినిమా తీశారు. ఇది బాల్ థాక్రే కు చెందిన మూవీ. అది బిగ్గెస్ట్ హిట్ సినిమాగా రికార్డ్ బ్రేక్ చేసింది. అయితే తన మనసులోని మాట బయట పెట్టారు వర్మ. సర్కార్ సినిమాను మరోసారి తీయాలని ఉందన్నారు. బయట, సోషల్‌ మీడియాలో నాపై భిన్నమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజానికి నాకు బాగా తిట్టించు కోకపోతే నిద్రపట్టదు. నాలో అలాంటి బుద్ధి ఒకటి డెవలప్‌ అయ్యింది. ఎవరైనా పొగిడితే నాకు నిద్ర వస్తుంది అంటున్నారు ఈ డైరెక్టర్. టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్, అజయ్‌ మైసూర్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై కమ్మ రాజ్యంలో కడప రెడ్లు విడుదల చే...

ఓటమిని ఒప్పుకోను..గెలిచేదాకా నిద్రపోను

చిత్రం
ఎవరు ఎన్ని రకాలుగా ఆరోపణలు చేసినా, విమర్శలు గుప్పించినా నేను పట్టించుకోను. నేను చేసిన సినిమాలు సక్సెస్ కావొచ్చు. కాక పోవచ్చు. వాటిపై నిజాయితీగా కామెంట్స్ చేస్తే ఒప్పుకుంటా. కానీ నా మూవీస్ చూడకుండా అర్థం లేని ఆరోపణలు చేస్తే మాత్రం ఒప్పుకోను. ఓటమిని తేలిగ్గా తీసుకోను. అయితే గెలిచేదాకా నిద్ర పోను అని స్పష్టం చేశారు ప్రముఖ యంగ్, డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ. ఇదిలా ఉండగా నా సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ఆడినా.. ఆడక పోయినా నేను పట్టించుకోను కానీ ఆ తర్వాత ఓ నటుడిగా ప్రతీకారం తీర్చుకుంటాను అని అంటున్నాడు అర్జున్‌ రెడ్డి. ఇటీవల విజయ్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద అనుకున్న మేర విజయాన్ని సాధించలేక పోయాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ నేను ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిని. హీరోగా జీవితం మొదలైన కొత్తలో నా సినిమాను ప్రజలు ఇష్టపడక పోయేవారు. నా స్నేహితులు సినిమాలు చూస్తూ మధ్యలో వెళ్లిపోయినా, ఆ తర్వాత వారి అభిప్రాయాన్ని నాతో షేరు చేసుకునేవారని వెల్లడించారు. విజయ్‌ గోవాలో జరుగుతున్న ఐఎఫ్‌ఎఫ్‌ఐ కార్యక్రమంలో పాల్గొన్నాడు. డియర్‌ కామ్రేడ్‌ సినిమాపై ఓ చిన్న అమ్మాయి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సినిమా విడుదలైన సమయ...

రౌడీపై పార్వతి ఫైర్

చిత్రం
అర్జున్‌ రెడ్డి సినిమా విడుదలై రెండేళ్లు అయినా ఇంకా ఆ సినిమాపై వివాదాలు మాత్రం రాజు కుంటూనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని కబీర్‌ సింగ్‌ పేరుతో హిందీ లోనూ తెర కెక్కించడంతో విమర్శకులు మండి పడిన విషయం తెలిసిందే.  ఈ చిత్రాలపై మలయాళ నటి పార్వతీ మీనన్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఒక నటిగా తానైతే ఆ సినిమాల్లో నటించే దాన్నే కాదంటూ కుండ బద్ధలు కొట్టారు. తాజాగా గోవా ఫిల్మ్‌ ఫెస్ట్‌వల్‌ వేదికలో విజయ్‌ దేవరకొండ ఎదురు పడగానే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమా చూస్తే అది విషాదంగా ఉన్నా అక్కడే వది లేస్తాం. అయితే అర్జున్‌రెడ్డి సినిమాలో హీరో మహిళను చెంప దెబ్బ కొడతాడు. దానికి యూట్యూబ్‌లో వచ్చిన కామెంట్లు చూసి షాకయ్యాను. ఈ సినిమాలో హింస ఎక్కువగా ఉండి, యువతను ప్రేరేపించేదిగా ఉంది. అయితే ఒక నటిగా ఈ సినిమాలో భాగం కాకుండా మాత్రమే ఉండగలను, కానీ దర్శకుడిని సినిమా చేయవద్దని చెప్పలేను అని పార్వతి పేర్కొన్నారు. అయితే తనకు ఎదురొచ్చిన వాళ్లను చంపేసుకుంటూ పోయే జోకర్‌ సినిమా మాత్రం వాస్తవాలను చూపించిందనడం గమనార్హం. నటి పార్వతీ మీనన్‌ వ్యాఖ్యలపై హీరో విజయ్‌ రెస్పాండ్ అయ్యారు. ఈ వార్తలు చూస్తుంటే చిరాకు పుడు...

ఆర్టీసీకి సీఎం ఆక్సిజన్..ఇదే లాస్ట్ ఛాన్స్

చిత్రం
ఎట్టకేలకు పెద్దాయన దయ తలిచిండు. 52 రోజులుగా సమ్మె చేసి ఇటీవలే విరమించిన కార్మికులకు తీపి కబురు అందించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆర్టీసీ కార్మికులారా వెంటనే సంతోషంగా జాయిన్ కండి. మీరంతా నా బిడ్డలే. ఎప్పుడో చెప్పిన. నా మాటలు పట్టించుకోలేదు. యూనియన్ నేతల మాటలు విన్నారు, రోడ్డున పడ్డారు. సంస్థ మీది. నా వెంట ఉన్నారు. అందుకే ఈ డిసిషన్ తీసుకున్నానని చెప్పారు కేసీఆర్. కార్మికులను చేర్చుకోవాలని ఆర్టీసీకి  లిఖిత పూర్వకమైన ఉత్తర్వులు ఇచ్చామన్నారు. ఆర్టీసీ మీ సంస్థ. మీరు బతకాలని కోరుతున్నం. ఈ సమస్య సుఖాంతం అవుతదని నేను ఆశిస్తున్న. మీకు ఏ యూనియన్‌ సహాయ పడదు. యూనియన్‌ లేకపోతే ఎట్లా అని మీకు అనుమానం ఉంటది.  యాజమాన్యం వేధింపులు భరించాలా అని అనుకోకండి. మీకు డిపో నుంచి ఇద్దరు చొప్పున వర్కర్స్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌ పెడతా. సానుభూతితో వ్యవహరించే సీనియర్‌ మంత్రిని ఇన్‌చార్జిగా పెడతా. సమ్మె ప్రక్రియలో చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒక వ్యక్తికి వీలైతే ఆర్టీసీలో లేదా ప్రభుత్వంలో ఉద్యోగమిస్తం. వారు మా బిడ్డలు. వారిని కాపాడు కుంటం. వాళ్లను గాలికి వదలం. వారి కుటుంబాలకు తక్షణ సహాయం కూడా చేస్తం. తెలంగాణ ...

నిత్య..ఆనందమే

చిత్రం
ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్క నిత్యా మీనన్ కే చెల్లుతుంది. తాజాగా ఈ అమ్మడు పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఏది చెప్పినా లేదా మాట్లాడినా హాటుగా, ఘాటుగా ఉంటాయి.  దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించడానికి తానే పర్ఫెక్ట్‌ అని చెప్పి చర్చల్లో నిలిచింది. ఏదో ఒక విషయంతో సంచలనం సృష్టించడం పరిపాటిగా మారింది. బాల నటి గానే సినీ రంగ ప్రవేశం చేసిన నిత్యా మీనన్‌ హీరోయిన్‌గా మాత్రం 2006లో కథానాయకిగా కన్నడ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. అయితే 31 ఏళ్ల నిత్యాకు ఇంకా పెళ్లి ఆలోచన రాలేదట. కాగా గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పాల్గొన్న ఆమె అక్కడ జరిగిన చర్చా వేదికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సినీ రంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ తన క్యారెక్టర్‌ సినిమాకు అసలు సెట్‌ కాదని తెలిపారు. అడవులలో మృగాలను కెమెరాలో బంధించాలన్నది తన ఆశ అని తెలిపారు. పరిస్థితుల ప్రభావంతో అనుకోకుండా నటినయ్యాను అని చెప్పారు. అయితే సమీప కాలంగా తాను సినిమాను చాలా ప్రేమించడం మొదలెట్టానని తెలిపారు .ఇదో అందమైన రంగం అని, దీని ద్వారా తాను ప్రజల మనసుల్ని మార్చ గలుగుతున్...

ఓన్లీ రిలయన్స్ అదుర్స్

చిత్రం
భారతీయ వ్యాపారాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మరో అరుదైన ఘనతను స్వంతం చేసుకుంది. ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ 10 లక్షల కోట్లకు చేరింది. ఈ స్థాయి మార్కెట్‌ క్యాప్‌ సాధించిన తొలి, ఏకైక ఇండియన్ కంపెనీగా నిలిచింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హై, 1,584ను తాకిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ చివరకు 0.6 శాతం లాభంతో 1,580 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ 10,01,555 కోట్లకు చేరింది. ఫలితంగా ఈ కంపెనీ ప్రమోటర్‌ ముకేశ్‌ అంబానీ సంపద 4,28,973 కోట్లకు చేరింది. ఒక్క రిలయన్స్‌ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌.. 19 నిఫ్టీ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌కు, మొత్తం నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ సూచీలోని 250 కంపెనీల మార్కెట్‌ క్యాప్‌కు సమానం. కంపెనీ షేర్‌ ధరను ఆ కంపెనీ మొత్తం షేర్లతో గుణిస్తే వచ్చే విలువను మార్కెట్‌ క్యాప్‌గా వ్యవహరిస్తారు. అతి తక్కువ కాలంలోనే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ 10 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ మైలురాయిని సాధించడం విశేషమని చెప్పక తప్పదు. వినియోగ ఆధారిత టెలికం, రిటైల్‌ రంగాల్లో పెట్టుబడుల వల్ల రిలయన్స్‌ ఈ ఫలితాన్ని పొందింది. ఈ రెండు విభాగాల వాటా కంపెనీ మొత్తం లాభాల్లో నిలకడ...

సోని ప్లాన్ అమలయ్యేనా

చిత్రం
ఇండియన్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్ లో రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ కు చెందిన ముకేశ్‌ అంబానీకి చెందిన నెట్‌వర్క్‌18 మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌లో కొంత వాటాను జపాన్‌ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం సోనీ కార్పొరేషన్‌ కొనుగోలు చేసే అవకాశాలు వున్నాయి. దీనికి సంబంధించి నెట్‌వర్క్‌18 మీడియాలో సోనీ కంపెనీ మదింపు నిర్వహిస్తోందని సమాచారం. చర్చలు ఆరంభ దశలోనే ఉన్నాయని, ఒప్పందం కుదరవచ్చు లేదా కుదరక పోవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నెట్‌వర్క్‌18లో వాటా  కైవసం కోసం ఏ రకమైన ఒప్పందాలు కుదుర్చు కోవాలి అనే అంశంపై సోనీ కంపెనీ కసరత్తు చేస్తోంది. వాటా కోసం బిడ్‌ను దాఖలు చేయడం లేదా తన భారత వ్యాపారాన్ని నెట్‌వర్క్‌18 వినోద చానెళ్లలో విలీనం చేయడం, తదితర మార్గాలపై సోనీ అధ్యయనం చేస్తోంది. ఒక వేళ ఒప్పందం సాకారమైతే, సోనీకి ‘స్థానిక’ బలం మరింత పెరుగుతుంది. నెట్‌ఫ్లిక్స్‌ తదితర పోటీ సంస్థలకు గట్టి పోటీని ఇవ్వ గలుగుతుంది. మరోవైపు అంబానీ చానెళ్లకు సోనీ ఇంటర్నేషనల్‌ కంటెంట్‌కు యాక్సెస్‌ లభిస్తుంది. కాగా వివిధ అవకాశాలను మదింపు చేస్తున్నామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రతినిధి పేర్కొన్నారు. సోనీ సం...

సోని ప్లాన్ అమలయ్యేనా

ఇండియన్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్ లో రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ కు చెందిన ముకేశ్‌ అంబానీకి చెందిన నెట్‌వర్క్‌18 మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌లో కొంత వాటాను జపాన్‌ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం సోనీ కార్పొరేషన్‌ కొనుగోలు చేసే అవకాశాలు వున్నాయి. దీనికి సంబంధించి నెట్‌వర్క్‌18 మీడియాలో సోనీ కంపెనీ మదింపు నిర్వహిస్తోందని సమాచారం. చర్చలు ఆరంభ దశలోనే ఉన్నాయని, ఒప్పందం కుదరవచ్చు లేదా కుదరక పోవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నెట్‌వర్క్‌18లో వాటా కైవసం కోసం ఏ రకమైన ఒప్పందాలు కుదుర్చు కోవాలి అనే అంశంపై సోనీ కంపెనీ కసరత్తు చేస్తోంది. వాటా కోసం బిడ్‌ను దాఖలు చేయడం లేదా తన భారత వ్యాపారాన్ని నెట్‌వర్క్‌18 వినోద చానెళ్లలో విలీనం చేయడం, తదితర మార్గాలపై సోనీ అధ్యయనం చేస్తోంది. ఒక వేళ ఒప్పందం సాకారమైతే, సోనీకి ‘స్థానిక’ బలం మరింత పెరుగుతుంది. నెట్‌ఫ్లిక్స్‌ తదితర పోటీ సంస్థలకు గట్టి పోటీని ఇవ్వ గలుగుతుంది. మరోవైపు అంబానీ చానెళ్లకు సోనీ ఇంటర్నేషనల్‌ కంటెంట్‌కు యాక్సెస్‌ లభిస్తుంది. కాగా వివిధ అవకాశాలను మదింపు చేస్తున్నామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రతినిధి పేర్కొన్నారు. సోనీ సంస్థ భారత...

ఉద్దవ్ ప్రమాణంలో అంబానీ ఫ్యామిలీ

చిత్రం
భారతీయ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ ఫ్యామిలీ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచింది. ఈ ఇండియన్ కుబేరుడు ఎక్కడ వుంటే అక్కడ లక్షలాది కళ్ళు వెంటాడుతాయి. ఎక్కువగా దృష్టి పెడతాయి. రిలియన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు చైర్మన్ గా ఉన్న ముకేశ్ అంబానీ ఆస్తులు ట్రిలియన్ డాలర్లను ఎప్పుడో దాటేశాయి. ఇప్పటికే టెలికాం, ఆభరణాలు, దుస్తులు, ఆయిల్, ఇలా ప్రతి రంగంపై తన పట్టు సాధించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం టెలికాం రంగాన్ని షేక్ చేస్తోంది రిలయన్స్ జియో. ముకేశ్ అంబానీ ఎక్కడ కాలు మోపితే అక్కడ ఆర్ధిక వ్యవహారాలే ప్రాధాన్యత వహిస్తాయి. ఇది సహజం కూడా. ఈ బిజినెస్ కింగ్ మేకర్ ఏది మాట్లాడిన, ఏది చేసినా, ఎక్కడికి వెళ్లినా అది నిమిషాల్లోపే వైరల్ అవుతుంది. ఎందుకంటే ప్రతిదీ కోట్లతో ముడిపడి ఉంటుంది కనుక. తాజాగా ముకేశ్ అంబానీ మరోసారి వార్తల్లో నిలిచారు. మరాఠా సీఎంగా శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఎట్టకేలకు కొలువు తీరినట్టయింది. ముంబై శివాజీ పార్క్‌లో  అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి  రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన అతిరధ మహారధులు హాజరయ్యారు. ముఖ్...

మరాఠా పీఠంపై శివసేనాని

చిత్రం
దేశం నివ్వెర పోయేలా మహారాష్ట్ర పీఠాన్ని అధీష్టించారు శివసేన సేనాధిపతి ఉద్దవ్ థాక్రే. కాకలు తీరిన నాయకులు, పాలకులుగా వినుతికెక్కిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలకు కోలుకోలేని షాక్ ఇచ్చారు శివసేనాని. మహా ..రాష్ట్రలో నూతన శకం ప్రారంభమైంది. శివ సైనికుడిని మరాఠా సీఎం పీఠంపై కూర్చో బెడతామంటూ ఠాక్రే చేసిన శపథం ఎట్టకేలకు నెర వేరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా జనసందోహం మధ్యన శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని శివాజీ మైదానంలో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. దీంతో ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా ఉద్ధవ్‌ చరిత్ర సృష్టించారు. ఉద్ధవ్‌తో పాటు మరో ఆరుగురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. మూడు పార్టీల నుంచి ఇద్దరు చొప్పున.. శివసేన నుంచి ఏక్‌నాథ్‌ ముండే, సుభాష్‌ దేశాయ్‌, ఎన్సీపీ నుంచి చగన్‌ భుజ్జల్‌, జయంత్‌ పాటిల్‌, కాంగ్రెస్‌ నుంచి బాలాసాహెబ్‌, నితిన్‌​ కేత్‌లు ప్రమాణం చేశారు. దీంతో నెల రోజుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. మహారాష్ట్రకు ఇక 18వ ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌ సేవ...

రాములో రాములా రికార్డులు భళా

చిత్రం
తెలుగు సినీ రంగపు పాటల ప్రస్థానంలో ఎన్నో మలుపులు.మజిలీలు ఉన్నాయి. వీటిని కాదని అరుదైన రికార్డులు కూడా నమోదయ్యాయి. తాజాగా అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో డైనమిక్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురంలో సినిమా విడుదల కాకుండానే అంచనాలు పెంచేసింది. ఊహించని రీతిలో ముందస్తు బిజినెస్ కూడా పూర్తయింది. ఇదే సమయంలో సినిమా యూనిట్ పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేసింది. ఇదిలా ఉండగా సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన సాంగ్ సౌంత్ ఇండియాను షేక్ చేసింది. రెండో పాటను వరంగల్ కు చెందిన కాసర్ల శ్యామ్ రాసిన రాములో రాములా పాట ఇప్పటికే ఉన్న రికార్డులనన్నిటిని బ్రేక్ చేస్తోంది. విడుదల చేసిన కొద్దీ సేపట్లోనే యూట్యూబ్ ను షేక్ చేసింది. ఇది కూడా ఓ చరిత్రే. చిన్నప్పటి నుంచి నాటకాలు అంటే పడి చచ్చే కాసర్ల ఎన్నో పాటలు, గేయాలు రాశారు. పలు పాటల ఆల్బమ్స్ కూడా విడుదల చేశారు. అను కోకుండా సినిమా రంగంలోకి ఎంటర్ అయ్యాడు. తెలంగాణ నేపధ్యంలో చాలా పాటలు రాశారు. వరంగల్‌ శంకర్, సారంగపాణిలు కాసర్లకు అవకాశాలు ఇచ్చారు. తెలుగు యూనివర్సిటీలో ఎంఏ ఫోక్‌ ఆర్ట్స్‌ చదివాడు. ఆకాశవాణిలో యువవాణి కార్యక్రమాన్ని నిర్...