ఓటమిని ఒప్పుకోను..గెలిచేదాకా నిద్రపోను
ఎవరు ఎన్ని రకాలుగా ఆరోపణలు చేసినా, విమర్శలు గుప్పించినా నేను పట్టించుకోను. నేను చేసిన సినిమాలు సక్సెస్ కావొచ్చు. కాక పోవచ్చు. వాటిపై నిజాయితీగా కామెంట్స్ చేస్తే ఒప్పుకుంటా. కానీ నా మూవీస్ చూడకుండా అర్థం లేని ఆరోపణలు చేస్తే మాత్రం ఒప్పుకోను. ఓటమిని తేలిగ్గా తీసుకోను. అయితే గెలిచేదాకా నిద్ర పోను అని స్పష్టం చేశారు ప్రముఖ యంగ్, డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ. ఇదిలా ఉండగా నా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆడినా.. ఆడక పోయినా నేను పట్టించుకోను కానీ ఆ తర్వాత ఓ నటుడిగా ప్రతీకారం తీర్చుకుంటాను అని అంటున్నాడు అర్జున్ రెడ్డి.
ఇటీవల విజయ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న మేర విజయాన్ని సాధించలేక పోయాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ నేను ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిని. హీరోగా జీవితం మొదలైన కొత్తలో నా సినిమాను ప్రజలు ఇష్టపడక పోయేవారు. నా స్నేహితులు సినిమాలు చూస్తూ మధ్యలో వెళ్లిపోయినా, ఆ తర్వాత వారి అభిప్రాయాన్ని నాతో షేరు చేసుకునేవారని వెల్లడించారు. విజయ్ గోవాలో జరుగుతున్న ఐఎఫ్‌ఎఫ్‌ఐ కార్యక్రమంలో పాల్గొన్నాడు. డియర్ కామ్రేడ్ సినిమాపై ఓ చిన్న అమ్మాయి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సినిమా విడుదలైన సమయంలో ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి డియర్ కామ్రేడ్‌లోని మొదటి సగ భాగం మాత్రమే తనకు నచ్చిందని, రెండవ భాగం నచ్చలేదని చెప్పింది.
అది నిజమైన విమర్శ అని దానిని తాను అంగీకరిస్తాను. అయితే దానిపై నేను ఎటువంటి విమర్శ చేయను. నేను చేసే సినిమాలను ఇష్ట పడతానని తెలిపాడు. సినీ పరిశ్రమల్లో రాజకీయాల గురించి కామెంట్స్ చేశాడు. ఇది ఒక వ్యాపారం. ఇక్కడ డబ్బు, అధికారం ప్రభావం ఉంటుంది. నేను ఏదైతే అనుకున్నానో అది చేయడానికే సినిమాల్లోకి వచ్చాను. నేను సినిమా సక్సెస్ అవుతుందా, లేదా అనే విషయాన్ని పట్టించుకోను. నేను కేవలం మంచి సినిమాలు మాత్రమే చెస్తానని అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్కువ మంది నా చిత్రాన్ని ఇష్ట పడకతే, నేను అంటే ఏంటో నా తరువాతి చిత్రంలో చూపిస్తాను అని చెప్పారు విజయ్ దేవరకొండ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి