సర్కార్ తీస్తానంటున్న వర్మ

సంచలనాలకు కేరాఫ్ గా మారిన దమ్మున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ఏది మాట్లాడినా లేదా ఏది తీసినా అది వివాదాస్పదం అవుతోంది. తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో వర్మ మూవీ తీశాడు. ఈ సినిమా రిలీజ్ కాకుండానే పలు ఆరోపణలు ఎదుర్కుంటోంది. ఇంకా ఈ సినిమాకు సెన్సార్ సెర్టిఫికెట్ రాలేదు. అయినా తాను మాత్రం ఆగనంటున్నాడు ఈ డైనమిక్ దర్శకుడు. మరాఠాలో బాల థాక్రే ఏర్పాటు చేసిన శివ సేన మొదటి సారిగా అధికారంలోకి వచ్చింది. గతంలో రామ్ గోపాల్ వర్మ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో సర్కార్ సినిమా తీశారు. ఇది బాల్ థాక్రే కు చెందిన మూవీ.

అది బిగ్గెస్ట్ హిట్ సినిమాగా రికార్డ్ బ్రేక్ చేసింది. అయితే తన మనసులోని మాట బయట పెట్టారు వర్మ. సర్కార్ సినిమాను మరోసారి తీయాలని ఉందన్నారు. బయట, సోషల్‌ మీడియాలో నాపై భిన్నమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజానికి నాకు బాగా తిట్టించు కోకపోతే నిద్రపట్టదు. నాలో అలాంటి బుద్ధి ఒకటి డెవలప్‌ అయ్యింది. ఎవరైనా పొగిడితే నాకు నిద్ర వస్తుంది అంటున్నారు ఈ డైరెక్టర్. టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్, అజయ్‌ మైసూర్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై కమ్మ రాజ్యంలో కడప రెడ్లు విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా గురించి వర్మ కొన్ని విశేషాలు తెలిపారు. నా కెరీర్‌లో నేను తీసిన తొలి సందేశాత్మక చిత్రం ఈ సినిమా.

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి పరిస్థితుల నుంచి ఈ సినిమా ఆలోచన వచ్చింది. 2019 మే 22 నుంచి సెప్టెంబరు 2020 కాలపరిమితిలో సినిమా ఉంటుంది. అంటే జరిగినవి, జరుగుతున్నవి తీయడంతో పాటు జరగబోయేవి కూడా ఊహించి తీసిన చిత్రం. రాజకీయ వ్యంగ్యంగా ఈ సినిమా ఉంటుంది. మారుతున్న రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఈ సిరీస్‌ను కంటిన్యూ చేయవచ్చేమో. ఈ సినిమాలో మాజీ ముఖ్యమంత్రి పాత్ర వేయడానికి ఒకరు అవసరం అయ్యారు. ఆ పాత్ర కోసం ఆర్టిస్టును వెతుకుతున్నప్పుడు ఓ వ్యక్తిని నేను సోషల్‌ మీడియాలో చూశాను. నాసిక్‌లో వెయిటర్‌గా చేస్తున్నాడని తెలిసింది.

అతన్ని పిలిపించి నటనలో శిక్షణ ఇప్పించాం. ఈ సినిమాలో ఏ వర్గం వారినీ హైలైట్‌ చేయ లేదు. టార్గెట్‌ చేయ లేదు. కొన్ని రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్స్‌ను పోలి ఉన్న ఆర్టిస్టులను సినిమాలో తీసు కోవడం జరిగింది. దీంతో ఆడియన్స్‌ వారి ఆలోచనకు తగ్గట్లు ఊహించు కుంటున్నారు. అంతే కానీ నేను ఎవర్నీ టార్గెట్‌ చేయలేదన్నారు వర్మ. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రాన్ని ఎన్టీఆర్‌కు అంకితం ఇచ్చాం. కమ్మ రాజ్యంలో..మూవీని ప్రఖ్యాతిగాంచిన ఇద్దరు తండ్రీ కొడుకులకు అంకితమివ్వాలని అనుకుంటున్నాని చెప్పారు. ఈ సినిమా ఐడియా మాత్రమే నాది. టీమ్‌ అంతా కలిసి తీశాం. సెన్సార్‌ నుంచి టైటిల్‌పై అభ్యంతరం ఎదురైతే అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే టైటిల్‌ అనుకుంటున్నాం అని వెల్లడించారు.

ఇప్పుడు గ్యాంగ్‌స్టర్, క్రిమినల్‌ కథల కన్నా పొలిటికల్‌ క్రిమినల్‌ స్టోరీసే ఆసక్తికరంగా ఉంటున్నాయి. మా కంపెనీ నుంచి రానున్న మరో చిత్రం ‘బ్యూటీఫుల్‌’ వచ్చే నెల 6న విడుదలవుతుంది. ఓ చైనీస్‌ కో–ప్రొడక్షన్‌ కంపెనీతో లేడీ బ్రూస్‌లీ సినిమా తీస్తున్నాం. నేను విన్నది ఏంటంటే ఈ సీన్‌ తెలుగుదేశం వారికి బాగా నచ్చిందట. అంటే తెలుగుదేశం వారు బయటకు చెప్పలేని విషయాన్ని నేను చెప్పినందుకు వారికి నచ్చిందేమో. ఆ సీన్‌ నచ్చిందని కొన్ని ఫోన్లు వచ్చాయి. అయినా ఓ తండ్రి తన కొడుక్కి ప్రేమగా పప్పు వడ్డిస్తాడు. ఈ సీన్‌ను ఏదోలా భావిస్తే నా తప్పు కాదు.సినిమాలో పవన్‌ కల్యాణ్‌ను పోలి ఉన్న ఓ వ్యక్తి మనసేన అనే పార్టీ పెడతారు. ఈ మనసేన పార్టీకి, జనసేనకు ఏ సంబంధం లేదన్నారు ఆర్జీవీ.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!