ఆర్టీసీకి సీఎం ఆక్సిజన్..ఇదే లాస్ట్ ఛాన్స్
ఎట్టకేలకు పెద్దాయన దయ తలిచిండు. 52 రోజులుగా సమ్మె చేసి ఇటీవలే విరమించిన కార్మికులకు తీపి కబురు అందించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆర్టీసీ కార్మికులారా వెంటనే సంతోషంగా జాయిన్ కండి. మీరంతా నా బిడ్డలే. ఎప్పుడో చెప్పిన. నా మాటలు పట్టించుకోలేదు. యూనియన్ నేతల మాటలు విన్నారు, రోడ్డున పడ్డారు. సంస్థ మీది. నా వెంట ఉన్నారు. అందుకే ఈ డిసిషన్ తీసుకున్నానని చెప్పారు కేసీఆర్. కార్మికులను చేర్చుకోవాలని ఆర్టీసీకి లిఖిత పూర్వకమైన ఉత్తర్వులు ఇచ్చామన్నారు. ఆర్టీసీ మీ సంస్థ. మీరు బతకాలని కోరుతున్నం. ఈ సమస్య సుఖాంతం అవుతదని నేను ఆశిస్తున్న.
మీకు ఏ యూనియన్ సహాయ పడదు. యూనియన్ లేకపోతే ఎట్లా అని మీకు అనుమానం ఉంటది. యాజమాన్యం వేధింపులు భరించాలా అని అనుకోకండి. మీకు డిపో నుంచి ఇద్దరు చొప్పున వర్కర్స్ వెల్ఫేర్ కౌన్సిల్ పెడతా. సానుభూతితో వ్యవహరించే సీనియర్ మంత్రిని ఇన్‌చార్జిగా పెడతా. సమ్మె ప్రక్రియలో చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒక వ్యక్తికి వీలైతే ఆర్టీసీలో లేదా ప్రభుత్వంలో ఉద్యోగమిస్తం. వారు మా బిడ్డలు. వారిని కాపాడు కుంటం. వాళ్లను గాలికి వదలం. వారి కుటుంబాలకు తక్షణ సహాయం కూడా చేస్తం. తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్న. గత నాలుగైదేళ్ల నుంచి రూపాయి కూడా చార్జీ పెంచ లేదు.
కానీ సంస్థ మనది. కార్మికులు మన బిడ్డలు. వారు కూడా బతకాలి. వాళ్లు మనలో భాగమే. కొంత చార్జీల భారం పెంచుతం. కిలోమీటర్‌కు 20 పైసలు పెంచి నట్లయితే సంస్థకు ఏటా 750 కోట్ల అదనపు ఆదాయం వస్తది. కొంత నష్టాన్ని కూడా పూడుస్తది. ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాటలు విని పెడదారి పడుతున్నరు. చెడిపోతున్నరు. సంస్థను దెబ్బ తీస్తున్నరు. జీవితాలు పాడుచే సుకుంటున్నరు. లేని టెన్షన్‌కు గురవుతున్నరు. ప్రధాన సమస్య అదే. దాని వల్ల ఈ రోజు అసంబద్ధమైన డిమాండ్లతో అనాలోచితమైన సమ్మెను ఇంత దూరం తెచ్చిండ్రు.
భవిష్యత్తుపై బెంగతో ఉన్న ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కొండంత భరోసా ఇచ్చారు. సమ్మె చేసిన కార్మికులందరినీ ఎలాంటి షరతు ల్లేకుండా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఎన్నో సంస్థలను కాపాడినం. ఎంతో మందికి అన్నం పెట్టినం. వీళ్లను బజార్లో పడేసి మనం జేసేది ఏముంటది ఒక చాన్స్ ఇచ్చి చూద్దాం మనం అని మంత్రులందరూ విజ్ఞప్తి చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది.
బాధ్యత గల సీఎంగా, తెలంగాణ బిడ్డగా మిమ్మల్ని మా బిడ్డలుగా భావించి రోడ్డున పడేయ వద్దని చెబుతున్న. జాయిన్ కండి. ఎటువంటి కండిషన్లు మీకు పెట్టం. మీరు ఉద్యోగ భద్రత, యాజమాన్యం నుంచి వేధింపులు లేకుండా రక్షణ కోరుకోవడంలో తప్పులేదు. కానీ క్రమశిక్షణా రాహిత్యంతో మేము చెడగొడుతా ఉంటం.. మీరు కాపాడండి అంటే మిమ్నల్ని భగవంతుడూ కాపాడలేడు. మీరు ముందల పడటానికి, సంసారం నడపడానికి ప్రభుత్వం నుంచి 100 కోట్లు రిలీజ్ చేస్తున్న.
బస్సులు ప్రైవేటు చేస్తమని మేము అనుకున్నది వేరు. బయట సన్నాసులు ప్రచారం చేసింది వేరు. వాస్తవానికి మాకు సంపూర్ణ అధికారం ఉంది. ఈ రోజు మేము అనుమతు లివ్వొచ్చు. ఏదో కక్ష పూరితంగా సాధించే ఉద్దేశాలు, ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో పూర్తిగా ఆర్టీసీ లేదు. 35 వేల ప్రైవేటు బస్సులకు అనుమతులిచ్చిర్రు. బీజేపీ పాలించే ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిది వేలు ఆర్టీసీ బస్సులుంటే 25 వేల ప్రైవేటు బస్సులున్నయి. ప్రైవేటు పర్మిట్లను పెట్టుబడిదారులు, షావుకార్లకు ఇవ్వ దలుచు కోలేదు. నిజంగా కార్మికుల గురించి కొద్దిగా సిన్సియర్‌గా ఆలోచన చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే హైకోర్టు చీఫ్ జస్టిసే.
రాజ్‌భవన్‌లో కలిసినప్పుడు కూడా ఆయన చెప్పారు. వాళ్లు పేద కార్మికులు, వారిని బతికించే ప్రయత్నం చేయండి అని. ఆయన బెంచి మీద అదే చెప్పిండు. ఇక్కడున్న ఓ కేంద్ర మంత్రి, నలుగురు బీజేపీ ఎంపీలు మొన్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రవాణాను ప్రైవేటీకరణ చేసే చట్టానికి ఓటేశారు. కేంద్రం నుంచి 22 వేల కోట్లు రావాలి. రేపు నోటీసులిస్తం వారికి. మీరు చదువుకోండి. వాస్తవాలు తెలుసుకుని మానసికంగా సిద్ధమై మీటింగ్‌కు రండి. ఇక్కడ అందరం కలిసి మంచిగా మాట్లాడి భోజనం చేసి ఒక నిర్ణయం తీసుకుందాం. క్రమశిక్షణతో ఉంటే సింగరేణిలా ఆర్టీసీని లాభాల్తో తెస్తం.
20 ఏళ్ల కింద రవాణా మంత్రి గా ఆర్టీసీని 13.80 కోట్ల నష్టాల నుంచి 14.50 కోట్ల లాభంలోకి తెచ్చా. ఆర్టీసీకి అది స్వర్ణ యుగం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల పొట్టలు నింపినం తప్ప ఎవరి పొట్టలూ కొట్టలె. దేశం మొత్తంలో అత్యధిక వేతనాలు అందుకుంటున్న అంగన్‌వాడీ టీచర్లు, హోంగార్డులు, ఆశ వర్కర్లు తెలంగాణలోనే ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులకు మూల వేతనంలో 30 శాతం రిస్క్ అలవెన్స్ ఇస్తున్న, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులుంటే ప్రధాని ప్రాతినిధ్యం వహించే గుజరాత్‌లో కూడా ఇవ్వడం లేదు. ప్రతిపక్షాలు, యూనియన్ నేతలు కార్మికులకు లేని భరోసా కల్పించి బజార్ల పడేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి