రాములో రాములా రికార్డులు భళా

తెలుగు సినీ రంగపు పాటల ప్రస్థానంలో ఎన్నో మలుపులు.మజిలీలు ఉన్నాయి. వీటిని కాదని అరుదైన రికార్డులు కూడా నమోదయ్యాయి. తాజాగా అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో డైనమిక్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురంలో సినిమా విడుదల కాకుండానే అంచనాలు పెంచేసింది. ఊహించని రీతిలో ముందస్తు బిజినెస్ కూడా పూర్తయింది. ఇదే సమయంలో సినిమా యూనిట్ పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేసింది. ఇదిలా ఉండగా సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన సాంగ్ సౌంత్ ఇండియాను షేక్ చేసింది. రెండో పాటను వరంగల్ కు చెందిన కాసర్ల శ్యామ్ రాసిన రాములో రాములా పాట ఇప్పటికే ఉన్న రికార్డులనన్నిటిని బ్రేక్ చేస్తోంది.

విడుదల చేసిన కొద్దీ సేపట్లోనే యూట్యూబ్ ను షేక్ చేసింది. ఇది కూడా ఓ చరిత్రే. చిన్నప్పటి నుంచి నాటకాలు అంటే పడి చచ్చే కాసర్ల ఎన్నో పాటలు, గేయాలు రాశారు. పలు పాటల ఆల్బమ్స్ కూడా విడుదల చేశారు. అను కోకుండా సినిమా రంగంలోకి ఎంటర్ అయ్యాడు. తెలంగాణ నేపధ్యంలో చాలా పాటలు రాశారు. వరంగల్‌ శంకర్, సారంగపాణిలు కాసర్లకు అవకాశాలు ఇచ్చారు. తెలుగు యూనివర్సిటీలో ఎంఏ ఫోక్‌ ఆర్ట్స్‌ చదివాడు. ఆకాశవాణిలో యువవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. తాజాగా అల వైకుంఠపురములో కోసం రాసిన  రాములో రాములా సౌత్‌ ఇండియాలోనే 24 గంటల్లో 8.3 మిలియన్‌ మంది యూట్యూబ్ లో వీక్షించారు.

20 రోజుల్లో 50 మిలియన్‌ మంది వీక్షించారు. ప్రముఖ హీరో వెంకటేష్, నాగచైతన్య నటిస్తున్న వెంకీ మామ, సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తున్న ప్రతి రోజు పండగే, నితిన్‌ నటిస్తున్న భీష్మ ఇలా పలు సినిమాల్లోనూ పాటలు రాశారు కాసర్ల. ఇక బస్‌ స్టాప్‌ సినిమాలోని కలలు పాటకు 2012లో సంతోషం అవార్డు, వంశీ ఇంటర్నేషనల్‌ వారు సినారే అవార్డు, తెలుగు రచయితల అసోసియేషన్‌ నుంచి విశిష్ట రచన పురస్కారం, సింగిడి అవార్డులు ఆయనకు దక్కాయి.
మొదటి సారిగా శ్యామ్ కు 2003 లో డైరెక్టర్ బి.జయ చంటిగాడు సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.

కృష్ణవంశీ మహాత్మాలో నీలపురి గాజులు రాసిన పాట హిట్ సాంగ్ గా నిలిచింది. అయినా ఛాన్స్ లు రాలేదు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ రోజుల్లో సినిమాలోని రింగ్‌ ట్రింగ్‌ పాటతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. దేవిశ్రీప్రసాద్‌తో వర్క్‌ చేయాలనుకున్న కోరిక ఎఫ్‌2 సినిమా ద్వారా తీరింది. ఈ మూవీలోని రెచ్చి పోదాం బ్రదర్‌ పాట మోస్ట్ పాపులర్ సాంగ్ గా నిలిచింది. ఆ సినిమా బిగ్గెస్ట్ మూవీగా రికార్డు తీరుగా రాసింది. ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలో దిమాక్‌ కరాబ్‌  అనే పాట కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పటి దాకా 150కు పైగా చిత్రాల్లో 350కు పైగా పాటలు రాశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!