హబ్బీకీ ప్రియాంక లవ్లీ గిఫ్ట్
‘వైట్ టైగర్’ సినిమా షూటింగ్‌లో బీజీగా ఉన్నారు బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా. మరికొన్ని రోజుల్లో ఈ గ్లోబల్ స్టార్ మొదటి పెళ్లి రోజును జరుపు కోబోతున్నారు. 2018 డిసెంబర్ 1న వీరి వివాహం అయిన విషయం తెలిసిందే. తాజాగా సినిమాకు కొన్ని రోజులు విరామం ఇచ్చిన ప్రియాంక అమెరికాకు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా న్యూయార్క్ వెళ్లిన ప్రియాంక భర్త హలీవుడ్ పాప్ సింగర్ నిక్ జొనాస్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. జెర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఓ కుక్క పిల్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనికి ‘గినో’ గా అప్పుడే పేరు కూడా పెట్టేశారు. ఇందుకు నిక్ నిద్రలేవక ముందే కుక్కపిల్లను ఇంటికి తీసుకువచ్చి ప్రియాంక సర్‌ప్రైజ్ చేశారు.
ఇదంతా వీడియో తీసిన ప్రియాంక ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనికి ‘ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరూ క్యూట్‌గా ఉన్నారు. హ్యపీ యానివర్సరీ బేబీ’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక దీనిపై స్పందించిన నిక్..ఉదయాన్నే నాకు మంచి బహుమతి అందింది. మా గిల్‌కు హాయ్ చెప్పండి. నిద్ర లేచినప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నాను. థాంక్యూ ప్రియాంక అంటూ తెలిపారు. కాగా ఇప్పటికే ప్రియాంక చోప్రా ఇంటిలో డయానా అనే కుక్క ఉంది. దీనిని 2016 నవంబర్‌లో తీసుకొచ్చారు.
దీని పేరు మీద ఇన్‌స్టాగ్రామ్ పేజీ కూడా ఉందంటే ప్రియాంకు డయానా అంటే ఎంత ఇష్టమో చెప్పనవసరం లేదు. తాజాగా గినోను ఇంటికి తీసుకువచ్చిన క్రమంలో డయానాను కూడా మేము ప్రేమిస్తున్నాం అని ప్రియాంక చెప్పుకొచ్చారు. ఇక మొదటి పెళ్లి రోజు దగ్గర పడుతుండటంతో ఇటీవల కొనుగోలు చేసిన ఇంటిలో ప్రియాంక, నిక్ కపుల్ ఈ వేడుకలను జరుపు కోబుతున్నారు.సో మిగతా బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ ఒక్కో కుక్క పిల్లను అడాప్ట్ చేసుకుంటే బావుంటుంది కదూ.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి