దివికేగిన దిగ్గజ నేత - పెద్దదిక్కును కోల్పోయిన తెలంగాణ - పాలమూరు బిడ్డ మరువదు ఈ గడ్డ..!

సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు ఇకలేడు..ఇక రాడు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరి పోతే నిబిడాశ్చర్యంతో మీరే అంటూ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గం మాడ్గులకు చెందిన సూదిని జైపాల్ రెడ్డి తీవ్ర అస్వస్థతో హైదరాబాద్ లో కను మూశారు. అద్భుతమైన మేధావిగా, రాజకీయ దురంధరుడిగా, అపర చాణుక్యుడిగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, నడిచే ఎన్‌సైక్లోపేడియాగా, పదాలకు అర్థాలు వెతుక్కునే డిక్షనరీ ఆయన. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ఆయన ఎన్నో పదవులు నిర్వహించారు. లోతైన పరిశీలన, తార్కిక పరిజ్ఞానం, దేశ, అంతర్జాతీయ రాజకీయ పరమైన అవగాహన కలిగి ఉన్నారు. అన్నిటికంటే ఆయన గొప్ప భావుకుడు, మానవతావాది, రచయిత, చివరి వరకు విలువలకు కట్టుబడి ఉన్న వ్యక్తి. జైపాల్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనతో సంభాషించాలన్నా లేక ఇంటర్వ్యూ చేయాలంటే చాలా మంది జర్నలిస్టులు జడుసుకున్న సందర్భాలు ఎన్నో. 24 ఏళ్ల సుదీర్ఘమైన పాత్రికేయ అనుభవంలో కరవుకు కొండగుర్తుగా ఉన్న ఈ జిల్లాకు చెందిన నాకు ఆయనను ఇంటర్వ్యూ చేసే అవకాశం ఓ దినపత్రిక ద్వారా దక...