న్యూ బిజినెస్‌లోకి ప్రిన్స్ ఎంట‌ర్..!

అంద‌గాడు..ఆడ‌పిల్ల‌ల క‌ల‌ల రాకుమారుడిగా పేరున్న ఒకే ఒక్క న‌టుడు ఎవ‌ర‌న్నా ఉన్నారంటే..ఎవ‌రైనా ఠ‌క్కున సమాధానం చెప్పేది మ‌హేష్ బాబు అని. టాలీవుడ్‌, కోలివుడ్, బాలీవుడ్..ఇండియా వ్యాప్తంగా ఈ న‌టుడికి లెక్క‌లేనంత మంది అభిమానులు ఉన్నారు. సింప్లిసిటీని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే మహేష్ బాబు డైలాగ్ డెలివ‌రీ డిఫ‌రెంట్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌ను తాను ప్రూవ్ చేసుకునేందుకు ఆయ‌న త‌ప‌న ప‌డ‌తారు. జ‌యాప‌జ‌యాల‌ను మ‌హేష్ ప‌ట్టించుకోరు. అదీ ఆయ‌న స్పెషాలిటీ. న‌టుడిగా ఆయ‌న ప్రూవ్ చేసుకున్నారు. వ్య‌క్తిగ‌తంగా త‌ను, త‌న కుటుంబం ఇంతే. ప‌క్కా ప్రొఫెష‌న‌ల్‌గా ఉంటారు. ఎవ‌రి ప‌ట్ల జోక్యం చేసుకోరు. ఇండియ‌న్ మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ తో చేసిన సినిమా ఆడ‌క పోయినా..స‌ద‌రు డైరెక్ట‌ర్ ఒకే ఒక్క మాట చెప్పారు ప్రిన్స్ గురించి.

మ‌హేష్ బాబు ..డైరెక్ట‌ర్స్ ఛాయిస్ అంతే కాదు ద‌ర్శ‌కుల‌కు కావాల్సిన న‌టుడు. షూటింగ్ కు వ‌చ్చిన‌ప్పుడు ఎలా వుంటారో..పూర్త‌య్యాక ఇంటికి వెళ్లేట‌ప్పుడు అలాగే ఉంటారు. ఇలాంటి న‌టులు అరుదుగా ఉంటార‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రం ఓ సంద‌ర్భంలో తెలిపారు. ఇప్ప‌టికే టాప్ రేంజ్‌లో ఉన్న ఈ యాక్ట‌ర్ ఏం చేసినా ఓ సెన్సేష‌న‌ల్..కొద్ది క్ష‌ణాల్లో వైర‌ల్ గా మారుతుంది. ఆయ‌న‌కున్న క్రేజ్ కోట్ల‌ను కురిపించేలా చేస్తుంది. అందుకే పేరొందిన కంపెనీల‌న్నీ ప్రిన్స్‌తో యాడ్స్ చేస్తున్నాయి. కొన్ని సినిమాలు అనుకున్నంత రేంజ్‌లో ఆడ‌క పోయినా ..త‌ర్వాత వ‌చ్చిన సినిమాలు బ్లాక్ బ్ల‌స్ట‌ర్ గా నిలిచాయి. ఓవ‌ర్సీస్‌లో కూడా మ‌హేష్‌బాబుకు చెప్ప‌లేనంత మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అక్క‌డ కూడా ఆయ‌న సినిమాల‌కు భ‌లే గిరాకీ. ఊహించ‌ని రీతిలో మార్కెట్ ఉంటోంది. ఆయ‌న‌తో సినిమాలు తీసేందుకు నిర్మాత‌లు ఎక్కువ‌గా పోటీ ప‌డ‌తారు.

ఓ వైపు సినిమాలు ఒప్పుకుంటూనే మ‌రో వైపు బిజినెస్ ప‌రంగా ఇల్లు చ‌క్క‌దిద్దుకునే ప‌నిలో ప‌డ్డాడు ఈ హీరో. తాజాగా కొత్త వ్యాపారంలోకి ఎంట‌ర్ అవుతున్న‌ట్లు ప్రిన్స్ ట్వీట్ చేశాడు. బాలీవుడ్ న‌టుల్లాగే మ‌హేష్ కూడా ..డిఫ‌రెంట్ రంగాల్లోకి ఎంట‌ర‌వుతున్నాడు. గ‌చ్చిబౌలిలో విలాస‌వంత‌మైన ఏఎంబి సినిమాస్ పేరుతో ఓ మ‌ల్టీప్లెక్స్‌ను ఇటీవ‌ల ప్రారంభించారు. త్వ‌ర‌లో స్వంతంగా దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు స‌మాచారం. మిమ్మ‌ల్ని మ‌రింత ఉత్సాహం క‌లిగించే విష‌యాన్ని పంచుకుంటున్నాం. ప్ర‌స్తుతం మేం దీని ప‌నిలోనే నిమ‌గ్న‌మయ్యాం. ఆ సీక్రెట్ ఏమిటో తెలుసు కోవాలంటే www.spoyl.in/mahesh-babu ఈ వెబ్‌సైట్ ను క్లిక్ చేస్తే తెలుస్తుంద‌టూ మహేష్ బృందం పేర్కొంది. దుస్తులు , ర‌కాలు,బ్రాండ్స్ త‌దిత‌ర వాటికి సంబంధించిన‌వి ఎన్నో ఉన్నాయి. మ‌రో మూడు నాలుగు రోజుల్లో ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ ప్రారంభం కాబోతున్న‌ట్లు తెలిసింది.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!