పోస్ట్‌లు

నవంబర్ 26, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

అయ్యో పాపం క్రిస్ గేల్

చిత్రం
క్రికెట్ ఆటలో డేరింగ్ బ్యాట్స్ మెన్ గా పేరు తెచ్చుకున్న క్రిస్ గేల్ ఉన్నట్టుండి వేదాంతం లోకి వెళ్లి పోయాడు. తనపై లేనిపోని రీతిలో కామెంట్స్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మాన్షి సూపర్ లీగ్‌కి వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ గుడ్ బై చెప్పాడు. తనకు జట్టులో కనీస గౌరవం, మర్యాద దక్కడం లేదని వాపోయాడు. తాను భారంగా మారి పోయానని, జట్టు యాజమాన్యం భావించిన విషయాన్ని అర్థం చేసుకునే, దాన్ని నుంచి తప్పుకున్నానన్నాడు. ఈ లీగ్‌లో జోజీ స్టార్స్ ఫ్రాంఛైజీ తరపున క్రిస్ గేల్ ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జోజీ స్టార్స్ ఆరు మ్యాచ్‌లు ఆడగా, ఒక్కటి కూడా విజయం సాధించలేదు. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 101 పరుగులు మాత్రమే చేయ గలిగాడు. ఈ మొత్తం టోర్నమెంట్‌లో గేల్‌కు 50కి పైగా పరుగులు ఒకసారి మాత్రమే చేశాడు. ఇదే సమయంలో క్రిస్ గేల్ మీడియాతో మాట్లాడారు. తన ఆవేదనను అభిమానులతో పంచుకున్నాడు. నేను వరసగా రెండు, మూడు మ్యాచులు సరిగా ఆడక పోతే చాలు.. జట్టుకి భారంగా కనిపిస్తాను. జట్టులోని సభ్యులు నన్ను భారంగా భావిస్తున్నారని నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. ఎన్నో సంవత్సరాలు...

అంతటా అరెస్టులు..కొనసాగుతున్న సమీక్షలు

చిత్రం
బేషరతుగా సమ్మెను విరమిస్తున్నామని, ఇక కార్మికులు విధుల్లోకి చేరుతారని ఆర్టీసీ జేఏసీ నేతలు చేసిన ప్రకటన తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తాము ఎట్టి పరిస్థితుల్లో విధుల్లోకి తీసుకోబోమంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ సంస్థపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పలు దఫలాలుగా చర్చలు జరిపారు. తాజాగా సమీక్ష కూడా చేపట్టారు. ప్రగతి భవన్‌లో జరిగిన మీటింగ్ లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌, ఆర్టీసీ ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నివేదికపై ఈ సమీక్షా సమావేశంలో కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నివేదికను రాష్ట్ర కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రూట్లను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర హైకోర్టు కూడా రూట్ల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆర్టీసీకి సంబంధించిన తాజా పరిణామాలను సీఎం కేసీఆర్‌ అధికారులను అడిగి తెలుసు కున్నట్టు తెలుస్తోంది. మరో వైపు ప్రజలు, కార్మికుల కోణంలో ఆలోచించి సమ్మె విరమించాలని న...

సూసైడ్స్ కు ప్రూఫ్స్ ఉన్నాయా

చిత్రం
కోరి తెచ్చుకున్న తెలంగాణాలో ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకోని పరిస్థితి. కార్మికులకు నాయకత్వం వహించిన ఆర్టీసీ జేఏసీ నేతలు ఉన్నట్టుండి సమ్మెను కాలాఫ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయా డిపోల వద్దకు వెళ్లి జాయిన్ కావాలని పిలుపునించారు. తీరా డ్యూటీల కోసం వెళ్లిన వారికి నిరాశే ఎదురైంది. చాలా చోట్ల పోలీసులు కార్మికులను అరెస్ట్ చేశారు. ఇదే విషయంపై హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై విచారణ చేపట్టింది. ప్రభుత్వం కారణంగానే ఆర్టీసీ కార్మికులు చని పోయారని అనడానికి ఆధారాలు ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. కార్మికులకు గుండె పోటు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ తీరు వల్లే ఆర్టీసీ కార్మికులు సూసైడ్ చేసుకున్నారని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. కార్మికులను డిస్మిస్‌ చేసినట్టు ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించలేదు కదా అని ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. అయితే ప్రభుత్వ తీరుతోనే కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పలు సూసైడ్‌ నోట్‌లను పిటిషన్‌ న్యాయస్థానం ముందు...

అయ్యో భాగ్యరాజా..ఎందుకిలా

చిత్రం
ఈమధ్య సినిమా డైరెక్టర్లు రూటు మార్చారు. ఏదో రకంగా వార్తల్లో నిలిచేందుకు ఇష్ట పడుతున్నారు. ఇందుకు దిగ్గజ దర్శకులు కూడా మినహాయింపు ఏమీ కాదు. సమంత చేసిన కామెంట్స్ పై వంగా సందీప్ రెడ్డి ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. అది అప్పట్లో వైరల్ గా మారింది. తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు భాగ్యరాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు మహిళలే కారణమన్నట్టుగా చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఈ రోజుల్లో మహిళలు ఎల్లప్పుడూ ఫోన్‌లో ఉంటున్నారు. అదే దాడులకు, అత్యాచారాలకు కారణమవుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. మొబైల్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి మహిళలు స్వీయ నియంత్రణ కోల్పోయారని భాగ్యరాజా అభిప్రాయ పడ్డారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ‘కరుతుకలై పాతివు సీ’ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ  వ్యాఖ్యలు చేశారు. మహిళలపై వేధింపులు, అత్యాచారం కేవలం తప్పిదం మాత్రమే కాదు. చట్టరీత్యా నేరం అనే విచక్షణ మరిచి, మహిళల అజాగ్రత్త వల్లే పురుషులు తప్పులు చేస్తున్నారని వాపోయారు. ఈ రోజుల్లో మహిళలు ఎప్పుడూ చూసినా ఫోన్‌లలోనే ఉంటున్నారు, రెండేసి ఫోన్‌లు, సిమ్‌లు వాడుతున్నారు. వారిపై ఘోరాలు జరగడానికి ఇది ఓ కారణం. మహ...

దిగ్గజ కంపెనీకి బిగ్ షాక్

చిత్రం
నిన్నటి దాకా టాప్ కంపెనీల జాబితాలో నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న టెక్ దిగ్గజ అమెరికన్ కంపెనీ ఉన్నట్టుండి రెండో స్థానానికి పడి పోయింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చోటు చేసుకుంటున్న మార్పులు ఈ కంపెనీపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఉద్యోగులకు పని చేసే వాతావరణాన్ని కల్పిస్తున్న కంపెనీల్లో టాప్ రేంజ్ లో ఉన్నవన్నీ ఇప్పుడు తమ నియమాలను మార్చేశాయి. మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నాయి. వారికి వెసలుబాటు ఉండేలా ఉన్నచోటు నుంచే వర్క్ చేసుకునే సదుపాయాన్ని అన్ని కంపెనీలు ఇస్తున్నాయి. గంటల తరబడి పనిలో నిమగ్నమయ్యే వారికి కొంచం రిలాక్సేషన్ ఉండేలా చర్యలు చేపట్టాయి. మరింత సౌకర్యంగా ఉండేలా  చూస్తున్నాయి   మానవ వనరుల విభాగాలు. నిర్దేశించిన టార్గెట్స్, ప్రాజెక్ట్స్ ను ఇంట్లో నుండే పూర్తి చేస్తున్నారు ఐటీ ప్రొఫెషనల్స్. దీంతో ఫుల్ ఎంజాయ్ చేస్తూ విధులు నిర్వహిస్తున్నారు. కంపెనీలన్నీ ఉత్తమ సంస్కృతిని పాటించడం, ఉద్యోగాలకు తగిన భద్రత కల్పించడం, ఉద్యోగులకు పనికి తగ్గ గుర్తింపుతో పాటు పదోన్నతులు కల్పించడం, ఉద్యోగులకు ఉల్లాసానికి క్రీడా కార్యక్రమాలతోపాటు అప్పుడప్పుడు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి....

సెంటిమెంట్ వర్కవుట్

చిత్రం
మన ఇండియన్స్ కు సెంటిమెంట్స్ ఎక్కువ. దేనిని తట్టుకోలేరు. సంతోషం వచ్చినా చివరకు కన్నీళ్లు వచ్చినా ఆపుకోలేరు. భారతదేశంలో ఇప్పుడు ఒకే ఒక్క టాపిక్ వైరల్ గా మారింది. మరాఠాలో ఎవరు పీఠాన్ని చేజిక్కిచ్చుకుంటారో తెలియక తంటాలు పడుతున్న సమయంలో ఒక్కసారిగా సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు శరద్ పవార్. దీంతో మాహారాష్ట్ర రాజకీయాలు మరింత రంజుగా మారాయి. ఇప్పటికే భారతీయులకు సెంటిమెంట్‌ ఎక్కువ అన్నది ఎవరు కాదనలేని వాస్తవం. అందుకే మనోళ్లను సెంటిమెంటల్‌ ఫూల్స్‌ అని వెక్కిరిస్తుంటారు. సెంటిమెంట్‌కు ఆయింట్‌మెంట్‌ కూడా లేదని సరదాగా అంటుంటారు. ఈ మాటకేమో గానీ సెంటిమెంట్‌తో రాజకీయాల్లోనూ బాగా నెగ్గుకు రావొచ్చని తాజాగా నిరూపితమైంది. మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న తీవ్ర సంక్షోభం ఒక్క సెంటిమెంట్‌ సీన్‌తో సమసి పోయిందంటే ఆశ్చర్య పడాల్సిన పని లేదు. వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఎత్తులు, పైఎత్తులతో నెల రోజులుగా వేడెక్కిన మరాఠ రాజకీయాలు చివరకు సెంటిమెంట్‌‌ సీన్‌తో కొలిక్కి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన కలిసి రాక పోవడంతో బీజేపీ తెలివిగా ఎన్సీపీ శాసనసభా పక్షనేతగా ఉన్న అజిత్‌ పవార్‌న...

మరాఠాలో మహా పాలిటిక్స్

చిత్రం
రోజుకో ట్విస్టుతో మరాఠా రాజకీయం మరింత హీటెక్కిస్తోంది. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.నిన్నటి దాకా బీరాలు పలికిన ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్‌ పవార్‌ ఉన్నట్టుండి డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో బలపరీక్ష చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పవార్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అజిత్‌ తాజా నిర్ణయంతో బీజేపీకి ఊహించని షాక్‌ తగిలింది. ఎన్సీపీలో సగం మంది ఎమ్మెల్యేలతో ఫడ్నవిస్‌కు మద్దతు ప్రకటించిన అజిత్‌.. వెంటనే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అజిత్‌ నిర్ణయానికి షాకైన.. ఆ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌ తన చాతుర్యంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకున్నారు. మొత్తం 54 ఎమ్మెల్యేలలో దాదాపు 52 మంది సభ్యులు తమతో ఉన్నారని శరద్‌ ప్రకటించారు. దీంతో పార్టీని చీల్చిన అజిత్‌ చివరికి ఒంటరిగా మిగిలారు. ఈ నేపథ్యంలో అజిత్‌ను వెనక్కి తీసుకొచ్చేందుకు కూడా శరద్‌ పావులు కదిపారు. పలువురు కీలక నేతలను పంపి..ఆయనతో చర్చలు జరిపారు. ఎంతకూ అజిత్‌ వెనక్కి తగ్గక పోవడంతో శరద్‌ పవార్‌ భార్యను రంగంలోకి దింపారు. ఆమె అజిత్‌తో సమావేశమైన గంటల వ్యవధిల...

సుభాష్ నిర్ణయం..జీ షేర్ల పతనం

చిత్రం
భారతీయ వినోద రంగంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న మీడియా మొఘల్ సుభాష్ చంద్ర ఉన్నట్టుండి జీ గ్రూప్ కంపెనీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో కంపెనీపై తీవ్ర ప్రభావం చూపించింది. కంపెనీ షేరు భారీ నష్టాలతో కొనసాగింది. ఇన్వెస్టర్లు ట్రేడర్ల అమ్మకాలతో జీ 9 శాతం నష్టపోయింది. గత సెషన్‌లో 343.80 వద్ద ముగిసిన ఈ షేరు, 312.40 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. జీలో సుభాష్ చంద్ర నేతృత్వంలోని ఎస్సెల్ గ్రూప్ వాటా అమ్మకం గురించి గత వారం ప్రతికూల ప్రభావం చూపక పోయినప్పటికీ, జీ బోర్డు ఛైర్మన్ పదవి నుంచి సుభాష్ చంద్ర పదవి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడం ప్రతికూలంగా మారింది. కంపెనీ ఎండీ, సీఈవోలతో చైర్‌పర్సన్‌కు బంధుత్వం వంటివి ఉండ కూడదన్న సెబీ నిబంధనలకు లోబడి చంద్ర రాజీనామా చేసినట్లు జీఈఈఎల్‌ రెగ్యులేటరీ సమాచారంలో వెల్లడించింది. అయితే సుభాష్ చంద్ర కుమారుడు పునిత్ గోయెంకా నాన్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా కొనసాగుతారు. అలాగే బోర్డును పునర్‌ వ్యవస్థీకరించినట్లు, కొత్తగా ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు గా ఆర్‌ గోపాలన్‌, సురేంద్ర సింగ్, అపరాజిత జైన్‌ నియమితులైనట్లు పేర్కొంది. కొత్త బోర...