అయ్యో భాగ్యరాజా..ఎందుకిలా
ఈమధ్య సినిమా డైరెక్టర్లు రూటు మార్చారు. ఏదో రకంగా వార్తల్లో నిలిచేందుకు ఇష్ట పడుతున్నారు. ఇందుకు దిగ్గజ దర్శకులు కూడా మినహాయింపు ఏమీ కాదు. సమంత చేసిన కామెంట్స్ పై వంగా సందీప్ రెడ్డి ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. అది అప్పట్లో వైరల్ గా మారింది. తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు భాగ్యరాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు మహిళలే కారణమన్నట్టుగా చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఈ రోజుల్లో మహిళలు ఎల్లప్పుడూ ఫోన్‌లో ఉంటున్నారు. అదే దాడులకు, అత్యాచారాలకు కారణమవుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు.
మొబైల్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి మహిళలు స్వీయ నియంత్రణ కోల్పోయారని భాగ్యరాజా అభిప్రాయ పడ్డారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ‘కరుతుకలై పాతివు సీ’ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలపై వేధింపులు, అత్యాచారం కేవలం తప్పిదం మాత్రమే కాదు. చట్టరీత్యా నేరం అనే విచక్షణ మరిచి, మహిళల అజాగ్రత్త వల్లే పురుషులు తప్పులు చేస్తున్నారని వాపోయారు. ఈ రోజుల్లో మహిళలు ఎప్పుడూ చూసినా ఫోన్‌లలోనే ఉంటున్నారు, రెండేసి ఫోన్‌లు, సిమ్‌లు వాడుతున్నారు. వారిపై ఘోరాలు జరగడానికి ఇది ఓ కారణం. మహిళలపై ఆంక్షలు విధించిన సందర్భాల్లో, ఇలాంటి నేరాలేవీ జరగలేదు అని చెప్పుకొచ్చారు.
తమిళనాట తీవ్ర సంచలనం రేపిన పొల్లాచ్చి సంఘటనపై స్పందిస్తూ, ఇందులో బాలురుపైన మాత్రమే నిందలు వేయడం సరికాదని భాగ్యరాజా అన్నారు. అమ్మాయిలు చేసిన పొరపాటును వాళ్లు ఉపయోగించు కున్నారనీ, వారు అజాగ్రత్తగా ఉన్నందునే ఇలాంటి ఘటనలు జరుతున్నాయని ధ్వజమెత్తారు. మగాళ్ల విచ్చల విడి సంబంధాలను ఆయన సమర్ధించుకున్నారు. ఒక పురుషుడు పొరపాటు చేస్తే, సరిద్దుకుంటాడు. అదే మహిళలు తప్పు చేస్తే అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది అంటూ అయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తమిళనాట మరింత ఆగ్రహానికి గురి చేసేలా ఉన్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి