దిగ్గజ కంపెనీకి బిగ్ షాక్
నిన్నటి దాకా టాప్ కంపెనీల జాబితాలో నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న టెక్ దిగ్గజ అమెరికన్ కంపెనీ ఉన్నట్టుండి రెండో స్థానానికి పడి పోయింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చోటు చేసుకుంటున్న మార్పులు ఈ కంపెనీపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఉద్యోగులకు పని చేసే వాతావరణాన్ని కల్పిస్తున్న కంపెనీల్లో టాప్ రేంజ్ లో ఉన్నవన్నీ ఇప్పుడు తమ నియమాలను మార్చేశాయి. మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నాయి. వారికి వెసలుబాటు ఉండేలా ఉన్నచోటు నుంచే వర్క్ చేసుకునే సదుపాయాన్ని అన్ని కంపెనీలు ఇస్తున్నాయి. గంటల తరబడి పనిలో నిమగ్నమయ్యే వారికి కొంచం రిలాక్సేషన్ ఉండేలా చర్యలు చేపట్టాయి. మరింత సౌకర్యంగా ఉండేలా చూస్తున్నాయి మానవ వనరుల విభాగాలు.
నిర్దేశించిన టార్గెట్స్, ప్రాజెక్ట్స్ ను ఇంట్లో నుండే పూర్తి చేస్తున్నారు ఐటీ ప్రొఫెషనల్స్. దీంతో ఫుల్ ఎంజాయ్ చేస్తూ విధులు నిర్వహిస్తున్నారు. కంపెనీలన్నీ ఉత్తమ సంస్కృతిని పాటించడం, ఉద్యోగాలకు తగిన భద్రత కల్పించడం, ఉద్యోగులకు పనికి తగ్గ గుర్తింపుతో పాటు పదోన్నతులు కల్పించడం, ఉద్యోగులకు ఉల్లాసానికి క్రీడా కార్యక్రమాలతోపాటు అప్పుడప్పుడు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి. అన్నింటికన్నా జీత భత్యాలు మెరుగ్గా ఇవ్వడం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఏయే కంపెనీలు ఉత్తమమైనవి అంటూ ఉద్యోగ అవకాశాలను కల్పించే ఇండీడ్ అధ్యయనం చేసింది. బ్రిటన్‌లోని రెంటోకిల్ ఇన్సియల్ అనే కంపెనీ నెంబర్ వన్‌గా నిలిచింది.
ఇలా 25 ఉత్తమ కంపెనీలను ఎంపిక చేసింది. గతేడాది మొదటి స్థానాన్ని సాధించిన అమెరికా దిగ్గజ సంస్థ ‘ఆపిల్’ ఈసారి రెండో స్థానానికి పడి పోయింది. కాగా బ్రిటన్‌లో ఉన్న దేశ, విదేశ కంపెనీలకే ఈ అధ్యయనాన్ని పరిమితం చేశారు. వేలాది మంది ఉద్యోగుల అభిప్రాయలతో పాటు నిపుణుల సమీక్షలను, కంపెనీ పత్రాలను పరిగణలోకి తీసుకొని ఈ అధ్యయనం చేశారు. ఆశ్చర్యంగా మొదటి ఐదు కంపెనీల్లో నాలుగు కంపెనీలు బ్రిటన్‌కు చెందినవి ఉండగా ఒక్క ఆపిల్ కంపెనీ మాత్రం అమెరికాకు చెందింది కావడం విశేషం. ఆపిల్ బ్రిటన్ బ్రాంచ్‌లో ఆరున్నర వేల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు.
ఉత్తమ పాతిక కంపెనీల్లో ఆర్థిక, ఐటీ, గృహోపకార, ఆహార కంపెనీలే కాకుండా వివిధ రకాల కంపెనీలు కొలువు తీరాయి. ‘ది అగిన్‌కేర్ గ్రూప్’ మూడో స్థానంలో రాగా, ఆ తర్వాత వరుసగా రెన్ కిచెన్స్, లష్ కాస్మోటిక్స్, ఈ , బర్క్లీస్, నండోస్, కుమన్, జేపీ మోర్గాన్ చేజ్, సైమన్స్ ఏజీ, పీడబ్ల్యూసీ, రోల్స్ రాయిస్, ఐ, మార్క్స్ అండ్ స్పెన్సర్, ఐకియా, బక్కావోర్, గ్లాక్సోస్మిత్‌క్లైన్, జాన్ లెవిస్ అండ్ పార్టనర్స్, వెయిట్‌రోజ్ అండ్ పార్టనర్స్, ఆర్‌బీఎస్, క్లార్క్స్, బేసిస్టమ్స్, లాయిడ్స్ బ్యాంక్, ఆర్నాల్డ్స్ క్లార్క్ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి