అయ్యప్ప భారీ విగ్రహం..త్వరలో నిర్మాణం

ప్రపంచంలోని అయ్యప్ప భక్తులకు శుభ సూచకం. వేలాది మంది అయ్యప్ప దీక్ష చేపట్టిన భక్త జన బాంధవులు నిత్యం పూజా కైంకర్యాలతో పాటు శాశ్వతంగా, వసతి సౌకర్యాలు ఉండే విధంగా ఆ భూతనాథ అయ్యప్ప అన్నదాన క్షేత్రం నిర్మించాలని అయ్యప్ప ఆలయ సమితి నిర్ణయించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 44 నంబర్ జాతీయ రహదారిపై ఉన్న కొత్తకోట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసేందుకు అహోరాత్రులు శ్రమిస్తోంది. అయ్యప్ప స్వామిని నిత్యం కొలిచే వారే ఈ సమితిని ఎర్పాటు చేయడం జరిగింది. 2017 సంవత్సరంలో మహబూబ్ నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో 184 పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఇందులో భాగంగా పూర్తి స్థాయిలో అయ్యప్ప స్వామి పేరుతో ఆలయాన్ని నిర్మించాలని ప్రతిజ్ఞ చేయడం..ఆ దిశగా స్వామి వారి ఆశీస్సులతో, దాతలు, అభిమానులు, భక్తులు, కులమతాలకు అతీతంగా తమ వంతు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు పూర్తి స్థాయిలో అన్నదాన కోసం ఎందరినో భక్త బాంధవులను సంప్రదించడం జరిగింది. చాలా మంది తమకు తోచిన రీతిలో స్పందించారు. ఆర్ధిక, హార్థిక పరంగా చేయూతను అందించా...