ఇక యుద్ధం తప్పదా

ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఆధిపత్య పోరు చివరకు ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజలను కలవర పరుస్తోంది. ఇప్పటికే ఇరాన్ పై క్షిపణులతో దాడులకు పాల్పడిన అమెరికాకు అదే రీతిలో జవాబు ఇచ్చింది ఇరాన్. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తార స్థాయికి చేరుకున్నాయి. తమ జనరల్‌ ఖాసిం సులేమానీని హత మార్చినందుకు గానూ ఇరాన్‌.. ఇరాక్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. పన్నెండు బాలిస్టిక్‌ క్షిపణులతో అమెరికా వైమానిక స్థావరాలపై విరుచుకు పడింది. కాగా ఇరాన్‌ చర్యను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. అంతే గాకుండా యుద్ధానికి సిద్ధమన్న సంకేతాలు జారీ చేశారు.

ఈ మేరకు..అంతా బాగుంది..ఇరాక్‌లో ఉన్న రెండు సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నాం. ఇదంతా చాలా బాగుంది. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి.. అత్యంత శక్తిమంతమైన మిలిటరీ వ్యవస్థ మా దగ్గర ఉంది. రేపు నేను కూడా ఓ ప్రకటన చేస్తాను అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా యుద్ధం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాక్‌లో ఉన్న అమెరికా వైమానిక స్థావరాలపై క్షిపణి దాడి చేయడాన్ని ఇరాన్‌ సమర్థించుకుంది. ఆత్మరక్షణ కోసమే ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపింది.

ఈ మేరకు ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావేద్‌ జరీఫ్‌ మాట్లాడుతూ..ఐక్యరాజ్య సమితి చార్టర్‌ ఆర్టికల్‌ 51 ప్రకారం..మా పౌరులు, సీనియర్‌ అధికారులపై పిరికి పంద దాడులు చేసిన వారి నుంచి ఆత్మ రక్షణ కోసమే ఈ చర్యకు పూనుకున్నాం. అంతేగానీ యుద్ధాన్ని కోరు కోవడం లేదు. అయితే మాకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడుల నుంచి మమ్మల్ని మేము కాపాడు కునేందుకు ఏ అవకాశాన్ని వదులుకోం అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఐక్య రాజ్య సమితి మరోసారి ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!