కనిపిస్తే కాల్చివేత..ఇండియా షట్ డౌన్

ప్రపంచం ఒకే ఒక్క వైరస్ ను చూసి వణుకుతోంది. 195 దేశాలకు విస్తరించిన ఈ మహమ్మారి కోట్లాది ప్రజలను, దేశాధినేతలను, పాలకులను ముప్పుతిప్పలు పెడుతోంది. అంతే కాదు ఏ సమయంలో ఎవరిని కాటేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ వైరస్ దెబ్బకు జనం పిట్టల్లా రాలుతున్నారు. టెక్నాలజీ పరంగా ఎంతో ముందంజలో ఉన్నా ప్రపంచాన్ని శాసించే పెద్దన్న అమెరికా సైతం కరోనాను చూసి జడుసుకుంటోంది. దీని ప్రభావం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఇటలీని కమ్మేసిన ఈ భూతం దెబ్బకు ప్రధాన దేశాలన్నీ విలవిలలాడుతున్నాయి. ఇక ఇండియా విషయానికి వస్తే కరోనా వైరస్ పుణ్యమా అంటూ ఇక్కడ కూడా పాకింది. ఇప్పటి దాకా కనీసం 500 మందికి పైగా ఈ వ్యాధిన బారిన పడ్డారు. కోట్లాది రూపాయలు కేంద్ర, రాష్ట్రాలు నీళ్లల్లా ఖర్చు చేస్తున్నాయి. సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదరదాస్ మోదీజీ, ఏపీ, తెలంగాణ సీఎంలు జగన్, కేసీఆర్ లు నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో నిమగ్నమయ్యారు. లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్లు మోదీ ప్రకటించగా కేసీఆర్ ఏకంగా కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు జారీ చే...