ట్రోలింగ్ పై మందన్న ఫైర్

ఒక్కసారి సినిమా రంగంలోకి ఎంటర్ అయితే చాలు హీరోలకేమో కానీ వచ్చిన చిక్కంతా హీరోయిన్లకే. నటించడం సహజం. అలాగని వారికి ప్రైవసీ ఉంటుందన్న ఇంకిత జ్ఞానం లేకుండా ఎలా పడితే అలా కామెంట్స్ చేసుకుంటూ పోవడం, ఈ సోషల్ మీడియా వచ్చాక మరీ ఎక్కువై పోయింది. తాజాగా వీరి బారిన కన్నడ బ్యూటీ రష్మికా మందన్న కూడా పడింది. ఈ మేరకు ట్రోలింగ్ పై ఘాటుగా స్పందించింది. సెలబ్రిటీల మైనంత మాత్రన తమ గురించి ఇంత నిర్దాక్షిణ్యంగా ట్రోలింగ్ చేయడం సరి కాదని, తమ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల ఒక నెటిజన్ ఆమె చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ చిన్న పిల్ల భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో నటి అవుతుందని ఎవరైనా ఊహించార అంటూ అసభ్యకర కామెంట్లు చేశాడు. ఈ ట్రోలింగ్ రష్మిక దృష్టికి రావడంతో ఆమె స్పందించింది. సెలబ్రిటీలను ట్రోలింగ్ చేయడం ద్వారా నెటిజన్లకు వస్తున్న లాభమేంటో నాకు తెలియడం లేదు. మేము మీకు ఎందుకు సాఫ్ట్ టార్గెట్స్ అవుతున్నాము. పబ్లిక్ ఫిగర్స్ అయినంత మాత్రాన మా మీద నిర్దాక్షిణ్యంగా దాడి చేస్తారా అంటూ ఫైర్ అయ్యింది. ట్రోలింగ్‌ను పట్టించు కోవద...