లక్కీ సుధీర్..లవ్లీ సినిమా
తెలుగు బుల్లి తెరమీద నవ్వులు పూయిస్తున్న వారంతా తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులర్ అవుతున్నారు. వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. జబర్దస్త్, ఢీ, పోవే పోరా వంటి టెలివిజన్ షోస్ ద్వారా ప్రేక్షకుల్లో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన తొలి చిత్రం సాఫ్ట్‌వేర్ సుధీర్ విడుదలకు సిద్ధమవుతోంది. రాజు గారి గది ఫేమ్ ధన్యా బాలకృష్ణ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రాజశేఖర్ రెడ్డి పులిచర్లని దర్శకుడిగా పరిచయం చేస్తూ, శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పారిశ్రామికవేత్త శేఖర్ రాజు ఈ మూవీని నిర్మించారు. డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా విడుదల కానుంది.
ఒక ట్రెండీ కంటెంట్‌తో సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్‌లో చిత్రాన్ని తెరకెక్కించామని చెప్పారు దర్శకుడు రాజశేఖర్ రెడ్డి. వినోదంతో పాటు వాణిజ్య అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. సినిమా ఔట్‌పుట్ బాగా వచ్చింది. సుధీర్ ఫ్యాన్స్‌కి ఈ సినిమా ఒక ఫీస్ట్‌లా ఉంటుందన్నారు. సుధీర్‌కి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ఒప్పు కున్నాను అన్నారు నటి ధన్యా బాలకృష్ణ. నాకిది మొదటి సినిమా అయినా పూర్తి సహకారం అందించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు.
మా సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు నిర్మాత శేఖర్ రాజు. పదేళ్ల కిందట హైదరాబాద్ వచ్చి ఫిల్మ్ చాంబర్ ముందుగా వెళ్తూ, మనల్ని లోపలికి రానిస్తారా, లేదా అనుకున్నాను. అలాంటిది ఇవాళ నా ఫస్ట్ సినిమా గురించి మీతో పంచు కోవడం ఆనందంగా ఉందన్నారు హీరో సుధీర్. గత మార్చి 20న నా రెండు సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయ్యాయి. నాకు ఇష్టమైన రజినీకాంత్, పవన్ కల్యాణ్‌గార్లను సాఫ్ట్‌వేర్ సుధీర్ చిత్రంలో అనుకరించా నని చెప్పారు. సో సప్తగిరికి ఇప్పుడు సుధీర్ తోడయ్యాడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి