శ్రీముఖి తీరుపై నెటిజన్స్ ఫైర్
బిగ్ బాస్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఫైనలిస్ట్ గా రాహుల్ గెలిచినా ఇంకా శ్రీముఖి ఫ్యాన్స్ జీర్ణించు కోలేక పోతున్నారు. చివరి సమయంలో పుంజుకున్న రాహుల్ టైటిల్‌ను దక్కించు కోగా శ్రీముఖి రెండో స్థానంలో నిలిచింది. ఇక రాహుల్ కన్నా అన్ని విషయాల్లో తనే బెటర్ అనుకున్న శ్రీముఖి రన్నరప్‌కే పరిమిత మవడం జీర్ణించు కోలేక పోతోంది. ప్రేక్షకుల సమక్షంలోనే ఆమె తన మనసులో మాట బయట పెట్టింది. హోస్ట్ నాగార్జున రాహుల్‌ను విజేతగా ప్రకటించ గానే ముందుగా శ్రీముఖిని మాట్లాడమని సూచించాడు.
ఓటమిని ఎవరూ ఇష్ట పడరు. ముఖ్యంగా నేను అంటూ తన బాధను వెల్లగక్కింది. అయితే ఎంతోమంది హృదయాలను గెలుచు కున్నానంటూ సంతోషం వ్యక్తం చేసింది. ముఖ్య అతిథి చిరంజీవి కూడా రాహుల్ చెక్ మాత్రమే తీసుకున్నాడు. కానీ నువ్వు కొన్ని కోట్ల హృదయాలను గెలుచుకున్నావు అంటూ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక ప్రజల తీర్పును శ్రీముఖి గౌరవించి నట్టులేదు. విధిరాత, అదృష్టం ఉంటే గెలుపు దక్కేది అని ఆమె బిగ్‌బాస్ వేదికపై చెప్పుకొచ్చింది.
అంటే రాహుల్ ఏం చేయక పోయినా, కేవలం అదృష్టం వల్లే గెలిచాడు అన్నట్టుగా ఆమె మాటలు ధ్వనించాయి. మొదటి నుంచి టైటిల్ తనదే అని ఫిక్స్ అయిన శ్రీముఖికి రాహుల్ విజయం గట్టి షాక్ నిచ్చిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. పైగా విజేతగా నిలిచిన రాహుల్‌కు కనీస కృజ్ఞతలు చెప్పక పోవడంపై నెటిజన్లు శ్రీముఖిని విమర్శిస్తున్నారు. ఆచి తూచి మాట్లాడే శ్రీముఖి అంత పెద్ద స్టేజిపై సరిగా ప్రవర్తించ లేదని అంటున్నారు. మొత్తం మీద రాహుల్ మాత్రం హీరోగా మారి పోయాడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి