మొబైల్స్ క్రేజీ..అమ్మకాలు స్పైసీ


కోట్లాది జనం ఇప్పుడు రేయింబవళ్లు మొబైల్స్ జపం చేస్తున్నారు. అవి లేకుండా, వాడకుండా ఉండలేక పోతున్నారు. ఇంటర్నెట్ సర్వీసెస్ పెరగడం, డేటా అత్యంత సులువుగా అందుబాటు లోకి రావడంతో స్మార్ట్ ఫోన్స్ కంపల్సరీగా మారింది. దీంతో ఆయా మొబైల్స్ తయారీదారులైన కంపెనీలకు లెక్కలేనంత ఆదాయం సమకూరు తోంది. ఆకట్టుకునే డిజైన్స్, కళ్ళు చెదిరే ఫీచర్స్ తో మొబైల్ ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. ఇండియాలో 4 జీ స్మార్ట్ ఫోన్స్ విడుదలయ్యాక ఇప్పటి దాకా 530 మిలియన్ ఫోన్లను అమ్మేశారు. ఇది మొబైల్స్ అమ్మకాల్లో సరికొత్త రికార్డు.

వీటిలో ఎక్కువగా చైనా కంట్రీకి చెందిన మొబైల్స్ ఉన్నాయి. వీటి విలువ సుమారు 6 లక్షల కోట్ల రూపాయలు అంటే నమ్మగలమా. ఇది వాస్తవం కూడా. 2012లో ఇండియాలో మొదటి 4జీ స్మార్ట్‌ ఫోన్ విడుదలైంది. ఈ ఏడాది జూన్ 19 వరకు స్మార్ట్‌ఫోన్ తయారీ దారులు ఏకంగా 53 కోట్ల 4జీ ఫోన్లు విక్రయించినట్టు టెక్ ఆర్క్ సంస్థ తెలిపింది. వచ్చే ఏడాది భారత్‌లో 5జీ స్మార్ట్‌ ఫోన్లు విడుదల కాబోతున్నాయని, అయితే, 2022 తర్వాత కానీ జనాలు వాటిపై పెద్దగా ఆసక్తి చూపే అవకాశం లేదని పేర్కొంది. 2025 నాటికి దేశంలో సుమారు 300 మిలియన్ 5జీ స్మార్ట్‌ఫోన్లు అమ్ముడయ్యే అవకాశం ఉందని తెలిపింది.

5జీ ఫోన్ల విషయంలో ధరలు వంటివి మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని టెక్‌ ఆర్క్ చీఫ్ ఫైసల్ కవూసా చెప్పారు. దేశంలో ఇప్పటి వరకు అమ్ముడైన 530 మిలియన్ల 4జీ స్మార్ట్‌ ఫోన్లలో శాంసంగ్ వాటా 28.2 శాతం ఉండగా, షావోమీ 20.7 శాతం, వివో 11.3 శాతం మార్కెట్‌ షేర్‌ను కలిగి ఉన్నాయి. ఒప్పో 7.8 శాతం, లెనోవో + మోటొరోలా 6.2 శాతం వాటాను కలిగి ఉన్నాయి. భారత్‌లో 4జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయిన తర్వాత అమ్ముడు పోయిన ప్రతీ నాలుగు ఫోన్లలో మూడు ఈ బ్రాండ్లకు చెందినవే కావడం గమనార్హం. ఈ ఏడేళ్లలో చైనా బ్రాండ్లు 54.3 శాతం అమ్ముడు పోగా, గ్లోబల్ బ్రాండ్ల శాతం 36.5 శాతం మాత్రమే కావడం గమనార్హం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!