జీతే రహో..సీజే సాబ్


తెలంగాణ రాష్ట్రంలో అంతా తానే అయి చక్రం తిప్పుతున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావుకు చుక్కలు చూపిస్తున్నారు రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్. అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఈ ప్రధాన న్యాయమూర్తి ఇప్పుడు వైరల్ గా మారి పోయారు. నిజాయితీ, నిబద్దత, ప్రజల పట్ల అచంచలమైన ప్రేమ ఈ జస్టిక్ కు ఉన్నాయి. అందుకే ఆయన ధర్మాసనంలో ఉన్నారంటే అవతలి వారు ఎంతటి వారైనా, ఏ స్థానంలో ఉన్నా భయపాడాల్సిందే. వణికి పోవాల్సిందే. ప్రతి అంశాన్ని పరిశీలించడం, కీలక తీర్పులు ఇచ్చే సమయంలో కొంత సంయమనం పాటించడం చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఆయన అట్టడుగు నుంచి వచ్చారు గనుక . జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి ఉన్నత స్థాయికి చేరుకున్నారు.

ఇప్పటి దాకా చీఫ్ జస్టిస్ గా రాజస్థాన్, కర్ణాటకలో పని చేశారు. రాఘవేంద్ర సింగ్ చౌహన్ ను రంజన్ గొగోయ్ నామినేట్ చేస్తే, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలంగాణ చీఫ్ జస్టిస్ గా అపాయింట్ చేశారు. 24 డిసెంబర్ 1959 లో పుట్టారు. ఇప్పుడు ఆయనకు 59 ఏళ్ళు.13 నవంబర్ 1983 లో అడ్వొకేట్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. క్రిమినల్, సర్వీస్ మేటర్స్ ఎక్కువగా చూశారు. 2005 లో రాజస్థాన్ హైకోర్టులో అడిషనల్ జడ్జ్ గా అపాయింట్ అయ్యారు. 2008 లో పర్మనెంట్ జడ్జ్ గా అపాయింట్ అయ్యారు. 2015 లో కర్ణాటక జడ్జ్ గా నియమించబడ్డారు. 22 జూన్ 2019 లో తెలంగాణ హైకోర్టు చీఫ్ జడ్జ్ గా పదవి బాధ్యతలు చేపట్టారు.

ప్రస్తుతం తెలంగాణాలో ఆర్టెసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం గత 34 రోజులుగా సమ్మె చేస్తున్నారు. వీరిని ప్రభుత్వం విధుల్లోకి తీసు కోవడం లేదు. దీనికి సంబంధించి కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. దీనిపై చీఫ్ జస్టిస్ చౌహన్ తో పాటు అభిషేక్ రెడ్డి తో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్బంగా సీజే పలుమార్లు కీలక వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగించింది. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారాయి. ప్రజలు తిరగ బడితే ఏమవుతుందో తెలుసా. ఈ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు. అధికారం ఎంత ఎక్కువగా వుంటే అంత తక్కువగా ఉపయోగించాలి. సీఎం రాజు లాంటి వాడు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత ఆయనదే. ఓ రకంగా ఆయన తండ్రి లాంటి వాడు.

ఈ సర్కారుకు సోయి అంటూ ఉందా అన్న అనుమానం కలుగుతోంది. నా ఇన్నేళ్ల సర్వీసులో మీలాంటి అధికార్లను నేనెప్పుడూ చూడలేదు. అన్నీ అబద్దాలే. తప్పుడు లెక్కలే. వీరిని ఎందుకు ఇంకా కొనసాగిస్తున్నారు. క్షమాపణలు కాదు కావాల్సింది..సమస్యకు పరిష్కారం. గెలిపిస్తే జనాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఇచ్చిన లైసెన్స్ గా భావించొద్దు. ఇలాంటి కఠినమైన మాటలని ఉపయోగించింది చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్. ఇంకో అడుగు ముందుకు వేసి..ప్రభుత్వానికే కాదు కోర్టుకు కూడా చర్యలు తీసుకునే అధికారం ఉందన్న సంగతి మరిచి పోవద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే న్యాయం ఇంకా బతికే ఉందన్న నమ్మకం కలుగుతోంది. హ్యాట్స్ ఆఫ్ సీజే సర్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!