అమెరికాలో మనోళ్లు అదుర్స్
ప్రపంచమంతా ఇప్పుడు ఇండియా వైపు చూస్తోంది. ఆర్ధిక, సామాజిక, రాజకీయ, సాంకేతిక, వ్యాపార, క్రీడా రంగాలలో భారతీయులు అసాధారణమైన రీతిలో విజయాలు సాధిస్తున్నారు. ఇక ఐటీ సెక్టార్ లో టాప్ పొజిషన్ లో కొనసాగుతోంది ఇండియా. అంతే కాదు ప్రపంచాన్ని శాసిస్తున్న పెద్దన్న, అమెరికాలో అత్యధికంగా మన ఇండియన్స్ తమ హవా కొనసాగిస్తున్నారు. అక్కడ పాలిటిక్స్ ను ప్రభావితం చేస్తున్నారు. తాజాగా నలుగురు ప్రవాస భారతీయులు అమెరికాలో కీలక పదవులకు ఎన్నికయ్యారు.
వారిలో ఒకరు ముస్లిం మహిళ కాగా, మరో వైట్ హౌజ్ మాజీ సాంకేతిక విధాన సలహాదారు కూడా ఉన్నారు. గజాలా హష్మీ వర్జీనియా స్టేట్ సెనెట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా చరిత్ర సృష్టించారు. అలాగే, ఒబామా హయాంలో శ్వేత సౌధంలో టెక్నాలజీ పాలసీ అడ్వైజర్‌గా విధులు నిర్వహించిన సుహాస్ సుబ్రమణ్యం వర్జీనియా రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. గజాలా హష్మీ తొలిసారి ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుతం రేనాల్డ్స్ కమ్యూనిటీ కాలేజ్‌లో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ విభాగానికి వ్యవస్థాపక డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
భారతీయ అమెరికన్లు ఎక్కువగా ఉండే లావుడన్ కౌంటీ నుంచి వర్జీనియా ప్రతినిధుల సభకు సుహాస్ సుబ్రమణ్యం ఎన్నికయ్యారు. 1979తో బెంగళూరుకు చెందిన వైద్యురాలైన తన తల్లితో కలిసి ఆయన అమెరికా వెళ్లారు. మరోవైపు, కాలిఫోర్నియాలో భారతీయ అమెరికన్ మనోహర్ రాజు శాన్ ఫ్రాన్సిస్కో పబ్లిక్ డిఫెండర్‌గా ఎన్నికయ్యారు. అలాగే, నార్త్ కరొలినాలో చార్లట్ సిటీ కౌన్సిల్‌కు డింపుల్ అజ్మీరా మరోసారి ఎన్నికయ్యారు. మొత్తం మీద ఎన్నారైలను భారతీయులు అభినందిస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి