కోహ్లీ కన్న..మందాన్న మిన్న
భారతీయ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేసుకుంది. ఈ రికార్డును ఏకంగా టీమిండియా మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మందాన్న క్రియేట్ చేసింది. ఇండియాకు ప్రపంచ మహిళా క్రికెట్ లో ఈ రూపకంగా మంచి పేరు తీసుకు వచ్చింది ఈ ప్లేయర్. అరుదైన రికార్డును బద్దలు కొట్టిన ఈ క్రికెటర్ ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 63 బంతుల్లో 74 పరుగులు సాధించింది. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా రెండు వేల పరుగుల మైలు రాయిని చేరుకుంది.
పురుషులు, మహిళల క్రికెట్‌లో కలిపి ఈ రికార్డు సాధించిన రెండో క్రికెటర్‌గా మందాన్న నిలిచింది. 48 ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డు సాధించి టీం ఇండియా ఓపెనర్ శిఖర్ ధవన్ మొదటి స్థానంలో ఉండగా, మందాన్న 51 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలు రాయిని చేరుకొని రెండో స్థానంలో నిలిచింది. భారత పురుష క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కంటే కూడా మందాన్న రెండు వేల పరుగుల్ని ముందుగా సాధించడం విశేషం. కోహ్లి 53వ ఇన్నింగ్స్‌లో 2 వేల వన్డే పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు.
ఇక భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ 52వ ఇన్నింగ్స్‌లో రెండు వేల పరుగులు చేశాడు. కాగా స్మృతి మందాన్నకు పంచ్ హిట్టర్ గా పేరుంది. ఏ మాత్రం తొట్రు పడకుండా, ప్రత్యర్థులు ఎవరున్నారో చూడకుండా ఆడడం ఆమెకు అలవాటు. మైదానంలో నిలదొక్కుకుంటే చాలు బౌలర్లకు చుక్కలు చూపిస్తుంది. అందుకే ఆమెను క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఆడ పులి అని ముద్దుగా పిలుచుకుంటారు. మొత్తం మీద కోహ్లీ ని దాటేసిన మందాన్న ఇప్పుడు ఇండియాలో వైరల్ గా మారింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి