నటనలో రాణిస్తున్న జయశ్రీ


తెలుగు సినిమా ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీ పరంగా మార్పులు చోటు చేసుకోవడంతో ఇప్పుడు సినిమా తీయడం అన్నది సులభంగా మారింది. మూవీ అంటేనే అదో కలల ఖార్ఖానా. పూర్తిగా సృజనాత్మకతకు సంబంధించిన అంశం. మూవీ అంటేనే 24 విభగాల సమ్మేళనం. రెండున్నర గంటల సినిమా చూడాలంటే ఆరు నెలలో లేదా ఏడాది పాటు వందలాది మంది టెక్నీషియన్స్ కష్టపడాల్సి ఉంటుంది. హిట్టయిందా సరి లేకపోతే వీరి శ్రమ వృధానే. ఇదో మాయాజాలం..జూదం కూడా. ఎందరో ఇందులోకి రావాలని నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆ వేలాది మందిలో కొందరే హీరోలు..మరి కొందరు జీరోలే.

ఎవరు ఎప్పుడు లైమ్ లైట్ లోకి వస్తారో చెప్పలేం. అదంతా కష్టం మాటేమిటో కానీ అదృష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. సినిమా అంటేనే మొదటగా గుర్తుకు వచ్చేది హీరో, హీరోయిన్, డైరెక్టర్. ఒకప్పుడు హీరో డామినేషన్ ఉండేది. ఇప్పుడు అది పూర్తిగా మారి పోయింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. స్టోరీ డామినేషన్ చేస్తోంది. ఇప్పుడు సక్సెస్ కావాలంటే కథలో దమ్ముండాలి. మాటలు పేలాలి. మ్యూజిక్ దుమ్ము రేపాలి. ఇదే సమయంలో ప్రధాన పాత్రలతో పాటు అతిథి పాత్రలు కూడా ముఖ్యమే. ఇలాంటి కేరెక్టర్స్ నటీమణుల్లో చాలా మంది వదిన, తల్లి లేదా హీరోయిన్ కు తోడుగా నటిస్తున్నారు. వారిలో ఇటీవలి కాలంలో అద్భుతమైన, సహజ సిద్ధమైన నటనతో ఆకట్టుకుంటోంది జయశ్రీ రాచకొండ.

ఆమె స్వస్థలం కరీం నగర్ జిల్లా. ప్రస్తుతం హైదరాబాద్ లో లాయర్ గా ప్రాక్టీస్ చేస్తోంది. అదే సమయంలో సినిమాల్లో, షార్ట్ మూవీస్ లో, వాణిజ్య ప్రకటనల్లో నటిస్తోంది..మెప్పిస్తోంది. ఎన్నో అవకాశాలు తలుపు తడుతున్నా తాను మాత్రం కేరెక్టర్ ఉన్న పాత్రలనే ఎంచుకుంటోంది. అందంతో పాటు అభినయంలో కూడా పరిణతి సాధించింది జయశ్రీ. జాతీయ స్థాయిలో పేరొందిన మల్లేశం సినిమాలో కూడా ఆమె నటించారు. అనుకోకుండా సినిమాల్లోకి ఎంటర్ అయ్యా. అదే ఇప్పుడు వృత్తిగా మారేలా చేసింది అంటోంది జయశ్రీ. రాబోయే రోజుల్లో మరింతగా ఎదగాలని, తన నటనతో మెప్పించాలని కోరుకుందాం. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!