మల్టిప్లెక్స్ ఏర్పాటులో అజయ్ దేవన్ 600 కోట్ల పెట్టుబడి

ఇండియన్ ఎంటర్ టైన్ మెంట్ రంగంలో ఇది ఊహించని పరిణామం. హిందీ సినిమా పరిశ్రమలో విలక్షణమైన నటుడిగా అజయ్ దేవ్‌గన్ పేరు తెచ్చుకున్నారు. కాజోల్‌ను పెళ్లి చేసుకున్నారు. చాప కింద నీరులా సినీ నటులు తమ వ్యాపారాలను విస్తరించుకుంటూ వెళుతున్నారు. ఓ వైపు సినిమా స్టార్స్ మరో వైపు క్రీడాకారులు తమకు అనువైన రంగాలను ఎంచుకుంటూ ఆదాయాన్ని గడిస్తున్నారు. సచిన్ రెస్టారెంట్లలో పెట్టుబడులు పెడితే . ప్రస్తుత ఇండియన్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి క్రీడాకారులకు సంబంధించిన వస్తువులు తయారు చేసే కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టారు. అంతేకాకుండా తానే ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ప్రమోట్ చేస్తున్నాడు. ఇది కూడా వ్యాపారాన్ని ఎలా విస్తరించుకుంటూ పోవచ్చో వీరిని చూస్తే తెలుస్తుంది. ఈ స్పోర్ట్స్ స్టార్టప్ కంపెనీ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది. ఇక సినిమా రంగానికి వస్తే హిందీలో అమితాబ్ బచ్చన్ ఎక్సెల్ గ్రూప్, బిగ్ బి గ్రూపుల ద్వారా ఇప్పటికే పెట్టుబడులు పెట్టారు. భారీగా ఆదాయాన్ని పొందారు. షారూఖ్ ఖాన్ ఐపీఎల్ రంగంలోకి ప్రవేశించాడు. ఏకంగా బిడ్ లో...