టీసీఎస్ సిఇఓకు భారీగా పెరిగిన జీతం
ఇండియాలో టెక్నాలజీ సర్వీసెస్ విషయంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ది నమ్మకమైన సంస్థగా ఎదిగింది. దీని వెనుక ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా ఉన్న రాజేష్ గోపినాథన్‌దే ఈ క్రెడిట్ అంతా. మూల వేతనం భారీగా పెరిగింది ఈసారి. 2019 ఫైనాన్షియల్ ఇయర్ పరంగా చూస్తే గతంలో కంటే ఈసారి 28 శాతం వేతనం పెంచుతూ టీసీఎస్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఆయన సిఇఓగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కంపెనీకి పలు కాంట్రాక్ట్‌లు తీసుకు రావడం, కంపెనీని లాభాల బాట పయనించేలా చేశారు. దీంతో పాటు సంస్థ వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది.
దీని వెనుక రాజేష్ కృషి ఉంది. ఒక కోటి 15 లక్షల రూపాయలు జీతంగా తీసుకుంటున్నారు. 1.26 లక్షలు ఇతర అలవెన్సుల కింద దక్కుతోంది. 60 లక్షల రూపాయలు అదనంగా అలవెన్సుల రూపేణా అందుతోంది. ఓవర్ ఆల్‌గా చూస్తే ఏడాదికి 13 కోట్ల రూపాయలకు పైగానే ఆయన వేతనాలు తీసుకుంటున్నారు. మరో వైపు టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్. గణపతి సుబ్రమణ్యం 2019 ఫైనాన్షియల్ ఇయర్లో 11 కోట్ల 61 లక్షలు సంపాదిస్తున్నారు. 2017-2018 సంత్సరంలో చూస్తే రాజేష్ గోపినాథన్ 16 కోట్ల 2 లక్షల రూపాయలు పొందారు. కోటి 15 లక్షలు వేతనంగా తీసుకుంటే ..1.26 కోట్లు ఇతర సేవల పరంగా పొందారు. 12 కోట్ల 49 లక్షలు మూల వేతనం తీసుకున్నారు. ఎన్. గణపతి 11 కోట్ల 61 లక్షలు తీసుకున్నారు. 24 శాతం వేతన పరంగా పెరిగింది.
చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న టి. రామకృష్ణ ఏడాదికి 4 కోట్లకు పైగా జీతం తీసుకుంటున్నారు. ఏడాదికి ఎగ్జిక్యూటివ్స్ స్థాయిలలో పనిచేస్తున్న వారిలో ఎక్కువగా ఏడాదికి 4 నుంచి 10 శాతం మధ్యలో వేతనాలు పెరుగుతూ వస్తున్నాయని ముంబయి చెందిన ఓ సంస్థ ఇటీవల తెలిపింది. మొత్తం మీద కోట్లు వెనకేసుకుంటూ తమను తాము నిరూపించుకుంటున్న వీరికి హ్యాట్సాఫ్ చెప్పడం తప్ప ఏం చేయగలం. వీరి జీతాలను చూసిన అప్ కమింగ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కలలు కంటున్నారు. కోట్లు సంపాదించే కొలువులు లేక పోయినా కనీసం లక్షలు ఇచ్చే ఉద్యోగాలు వస్తాయని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇంజనీరింగ్ కాలేజీలు, ఎన్ ఐటీలు, ఐఐటీలు, త్రిబుల్ ఐటీలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఇప్పటికే జేఇఇ మెయిన్స్ రాసిన వాళ్లు, అడ్వాన్స్ డ్ పరీక్షకు సిద్ధమవుతున్నారు. కానీ ఐటీ కంపెనీలు కొత్త బాట పట్టాయి. చాకులాంటి కుర్రాలను ఏరికోరి తీసుకుంటున్నాయి. వారికి తమ కంపెనీ పరంగా ట్రైనింగ్ ఇప్పిస్తున్నాయి. వారికే పనిచేసేలా రూపొందిస్తున్నాయి. ఏది ఏమైనా ఇపుడు డాలర్ల పంట పండుతోంది. అది ఏమేరకు ఈ బూమ్ ఉంటుందో చూడాల్సిందే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి