సేవల రంగంలో సోనీ..మైక్రోసాఫ్ట్ ఒప్పందం
ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీలుగా భాసిల్లుతున్న సోనీ ..మైక్రోసాఫ్ట్ కంపెనీలు సేవల రంగంలో ఒకరికొకరు పరస్పర సహాయ సహకారాలు అందించుకునేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఈ మేరకు సోనీ కంపెనీ ఛైర్మన్ అండ్ సిఇఒగా ఉన్న కెన్‌చిరో యొషిదా ..మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్లలు సంతకాలు చేశారు. క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్స్ ఫర్ గేమింగ్ ఎక్స్ పీరియన్సెస్ అండ్ ఏవన్ సొల్యూషన్స్ పరంగా ఈ రెండూ ఇచ్చి పుచ్చుకుంటాయి. దీని వల్ల గేమింగ్ ఇండస్ట్రీలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆవిష్కరణలతో పాటు కస్టమర్స్ సంతృప్తి చెందేందుకు కావాల్సిన వసతులు సమకూర్చడం, కొత్త రకంగా ఆలోచించేలా ఈ రెండూ పనిచేస్తాయి.
దీనికి ఐటీ దిగ్గజ కంపెనీగా ఉన్న మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఫ్లాట్ ఫాం మీద సోనీకి సేవలందిస్తుంది. డిజిటల్ టెక్నాలజీ పరంగా సోనీ ఇప్పటికే ముందంజలో ఉంది. టీవీలు, ఇతర వస్తువులను అమ్మడంలో ఆ కంపెనీనే టాప్. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా ..సోనీ ప్రొడక్ట్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దానికి కారణం కొన్నేళ్లుగా ఆ సంస్థ తన నమ్మకాన్ని..వస్తువుల విక్రయంలో, ఏర్పాటు చేయడంలో , సేవలందించడంలో టాప్ కంపెనీగా వుంటూ వస్తోంది. దీంతో వినియోగదారులు ఫస్ట్ ప్రయారిటీ సోనీ తయారు చేసిన ఉత్పత్తుల వైపు మొగ్గు చూపిస్తున్నారు. కాలం మారింది. టెక్నాలజీ మారింది. క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారిత సేవలను ఉపయోగించు కోగలిగితే..సరైన సమయంలో అడాప్ట్ చేసుకోగలిగితే సమయం ఆదా అవుతుంది.
అంతకంటే ఎక్కువగా పని భారం తగ్గుతుంది. ఉద్యోగుల సంఖ్య కూడా పెంచు కోకుండా ఉండేలా వీలు కలుగుతుంది. దీంతో సోనీ లాంటి కంపెనీలు మైక్రోసాఫ్ట్ తయారు చేసిన క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారిత సేవలు పొందేందుకు పోటీ పడుతున్నాయి. రెండు దిగ్గజ కంపెనీలు జత కట్టడంతో ప్రపంచ మార్కెట్‌లో ఇప్పటికే వాటి బ్రాండ్‌ల విలువ అమాంతం పెరుగుతుంది. సోనీ మామూలు కంపెనీ కాదు. ఐటీ పరంగా చూస్తే మైక్రోసాఫ్ట్ ఇటీవల ప్రకటించిన ఆదాయ వృద్ధి కంపెనీల జాబితాలో పైకి ఎగబాకింది. సత్య సిఇఓ అయ్యాక ..ఆచి తూచి అడుగులు వేస్తోంది ఆ కంపెనీ. ఏదీ త్వరగా నిర్ణయం తీసుకోకుండా ..ఏ రకంగా ప్రపంచానికి సేవలు అందించవచ్చో .. ఆదిశగా ప్రొడక్ట్ సొల్యూషన్స్ రూపొందిస్తోంది.
ఇది ఒకరకంగా చెప్పాలంటే మరో స్ట్రాటజీగా అనుకోవచ్చు. కంపెనీల మధ్య పోటీ ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఇటీవల కంపెనీలు పోటీ పడడం కంటే ఎలా భాగస్వామ్యం కలిగి ఉండవచ్చో నని ఆలోచిస్తున్నాయి. దీని వల్ల బ్రాండ్ ల విలువ పెరుగుతుంది. స్పేస్ ఎక్కువవుతుంది. ఉత్పత్తులను త్వరగా విక్రయించేందుకు అవకాశం ఏర్పడుతుంది. సెమీ కండక్టర్స్, ఏఒన్ సొల్యూషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతోంది సోనీ అండ్ ఎంఎస్. సోనీకి గేమింగ్, ఎంటర్ టైన్ మెంట్, మ్యూజిక్, తదితర రంగాల్లో మంచి పట్టుంది. కంపెనీలు కలవడం వృద్ధికి చిహ్నంగా భావించవచ్చు. రేపు మరికొన్ని కంపెనీలు ఇతర రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యులుగా మారినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి